Telugu Global
Business

Hyundai Creta N-Line | హ్యుండాయ్ నుంచి అప్‌డేటెడ్‌ క్రెటా ఎన్ లైన్‌.. రూ.16.82 ల‌క్ష‌ల నుంచి షురూ..!

Hyundai Creta N-Line | ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్‌(Hyundai Motor India) భార‌త్ మార్కెట్లోకి త‌న అత్యంత పాపుల‌ర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారు క్రెటా ఎన్ లైన్ ఎడిష‌న్‌ను ఆవిష్క‌రించింది.

Hyundai Creta N-Line | హ్యుండాయ్ నుంచి అప్‌డేటెడ్‌ క్రెటా ఎన్ లైన్‌.. రూ.16.82 ల‌క్ష‌ల నుంచి షురూ..!
X

Hyundai Creta N-Line | ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్‌(Hyundai Motor India) భార‌త్ మార్కెట్లోకి త‌న అత్యంత పాపుల‌ర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారు క్రెటా ఎన్ లైన్ ఎడిష‌న్‌ను ఆవిష్క‌రించింది. హ్యుండాయ్ నుంచి మార్కెట్‌లోకి వ‌చ్చిన మూడో ఎన్-లైన్ క్రెటా మోడ‌ల్ కారు ఇది. ఈ కారు 1.5 లీట‌ర్ల క‌ప్పా ట‌ర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ 160 పీఎస్ విద్యుత్‌, 253 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. దీని ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 7-స్పీడ్ డీఎంటీ వ‌ర్ష‌న్‌తో డిజైన్ చేశారు. 7-స్పీడ్ డీఎంటీ వ‌ర్ష‌న్ కారు లీట‌ర్ పెట్రోల్‌పై 18.2 కి.మీ, 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ వ‌ర్ష‌న్ 18 కి.మీ మైలేజీ ఇస్తుంది. 8.9 సెక‌న్ల‌లో 100 కిమీ స్పీడ్ అందుకుంటుంది. ఈ కారు ధ‌ర రూ.16.82 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.20.29 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.

కియా సెల్టోస్‌, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్‌, ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హై రైడ‌ర్‌, స్కోడా కుషాఖ్‌, ఎంజీ ఆస్ట‌ర్‌, ఫోక్స్ వ్యాగ‌న్ టైగూన్, సిట్రోన్ సీ3 కార్ల‌తో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ పోటీ ప‌డుతుంది. న్యూ గ్రిల్లె, క‌నెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌, స్ట‌యిలిష్ ఫ్రంట్ బంప‌ర్, స్పోర్టీ రెడ్ అసెంట్స్‌, కారు రేర్ స్పోర్టీ బంప‌ర్ విత్ డ్యుయ‌ల్ టిప్ ఎగ్జాస్ట్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

ఇటీవ‌లే మార్కెట్‌లో ఆవిష్క‌రించిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ కారు ఇంటీరియ‌ర్‌గా హైటెక్ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న‌ది. ఆల్ బ్లాక్ క్యాబిన్ థీమ్ విత్ రెడ్ అసెంట్స్‌, స్టీరింగ్ వీల్‌, హెడ్ రెస్ట్‌ల‌పై ఎన్‌-లైన్‌ బ్యాడ్జింగ్ ఉంటుంది. అత్యంత శ‌క్తిమంత‌మైన ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ - 1.5 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ క‌లిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 160 పీఎస్ విద్యుత్‌, 253 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 7-స్పీడ్ డ్యుయ‌ల్ క్ల‌చ్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌తో అందుబాటులో ఉంటుంది.

హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N-Line) కారు డ్యుయ‌ల్ కెమెరా డాష్ కామ్‌, 10.25-అంగుళాల డ్రైవ‌ర్ డిస్‌ప్లే, డ్యుయ‌ల్ జోన్ ఏసీ, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, 10.25-అంగుళాల ట‌చ్ స్క్రీన్‌, అడ్జ‌స్ట‌బుల్ రేర్ హెడ్ రెస్ట్స్‌, 60:40 స్ప్లిట్ రేర్ బెంచ్‌, 2-స్టెప్ రీక్లైన‌ర్ సీట్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N-Line) కారు గ‌త జ‌న‌వ‌రిలో న్యూ జ‌న‌రేష‌న్ క్రెటా కారు ఆవిష్క‌రించింది. లెవెల్‌-2 అడ్వాన్స్‌డ్ డ్రైవ‌ర్ అసిస్టెన్స్ సిస్ట‌మ్ (అడాస్‌)తోపాటు 70కి పైగా సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి. 6- ఎయిర్‌బ్యాగ్స్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), టైర్ ప్రెష‌ర్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ (టీపీఎంఎస్‌), వెహిక‌ల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్ఎం), రేర్ పార్కింగ్ కెమెరా, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌, 3-పాఇంట్ సీట్‌బెల్ట్స్‌, ఏబీఎస్ తోపాటు ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉంటాయి. న్యూ వెర్నా సెడాన్ మాదిరిగానే లెవెల్ 2 అడాస్ టెక్నాల‌జీ సిస్ట‌మ్ ఉంటుంది. ఫార్వ‌ర్డ్ కొలిష‌న్ వార్నింగ్‌, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌, లేన్ కీప్ అసిస్ట్‌, ఫ్రంట్ కెమెరా, సెన్స‌ర్ల‌తో లేన్ డిపార్చ‌ర్ వార్నింగ్ సిస్ట‌మ్ ఉంటాయి.

First Published:  14 March 2024 2:30 AM GMT
Next Story