Telugu Global
Business

సెకండ్‌ హ్యాండ్ కార్ల‌లో.. ఆ మూడు మోడ‌ల్ కార్ల‌పైనే క్రేజ్‌

హ్యుండాయ్ మోటార్స్ క్రెటా, మారుతి సుజుకి బాలెనో, రెనాల్ట్ క్విడ్ మోడ‌ల్ కార్లు సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్‌లో బెస్ట్‌గా నిలిచాయ‌ని యూజ్డ్ కార్ల రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ పేర్కొంది.

సెకండ్‌ హ్యాండ్ కార్ల‌లో.. ఆ మూడు మోడ‌ల్ కార్ల‌పైనే క్రేజ్‌
X

క‌రోనా మ‌హమ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా ఉన్న ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ కార్ల‌పై మ‌న‌స్సు పారేసుకుంటున్నారు. కొత్త కార్ల‌తోపాటు సెకండ్ హ్యాండ్ కార్ల‌లోనూ అటువంటి వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.


హ్యుండాయ్ మోటార్స్ క్రెటా, మారుతి సుజుకి బాలెనో, రెనాల్ట్ క్విడ్ మోడ‌ల్ కార్లు సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్‌లో బెస్ట్‌గా నిలిచాయ‌ని యూజ్డ్ కార్ల రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ పేర్కొంది. హ్యుండాయ్ ఎలైట్ ఐ20, మారుతి సియాజ్ మోడ‌ల్ కార్ల‌కు కూడా గిరాకీ ఉంది. సెకండ్ హ్యాండ్ కార్ల‌లో `మోస్ట్ ట్ర‌స్టెడ్ బ్రాండ్లు`గా హ్యుండాయ్‌, హోండా, మారుతి సుజుకి నిలిచాయి.
యూజ్డ్ కార్ల‌లో హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ల‌కే అత్య‌ధికులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌స్తుతం కార్ల కొనుగోలుదారుల నుంచి ఎస్‌యూవీలు, సెడాన్‌ల‌కు గిరాకీ పెరుగుత‌న్న వేళ 67 శాతం మంది కార్పొరేట్ ప్రొఫెష‌న‌ల్స్ కూడా సెకండ్ హ్యాండ్ కార్ల‌ను వాడుతున్నారు. కొత్త కార్ల‌తో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే ఖ‌ర్చు త‌క్కువ అని వారు భావిస్తుండ‌ట‌మే దీనికి కార‌ణం అని తెలుస్తున్న‌ది. జ‌న‌వ‌రి -మార్చి మ‌ధ్య కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లు కొన్న వారిలో మ‌హిళ‌లు 36 శాతం మంది ఉన్నారు.హోలీ, న‌వ‌రాత్రి ఉత్స‌వాలు, అక్ష‌య తృతీయ వంటి ప‌ర్వ‌దినాల స‌మ‌యంలోనే కొత్త కార్ల కొనుగోళ్ల‌కు గిరాకీ ఉంటుంది. ఈ పండుగ‌ల వేళ ప్ర‌తి రోజూ 200, 450, 314 యూనిట్ల అమ్ముడ‌వుతాయి.ఇప్పుడంతా డిజిట‌ల్ మ‌యం.. ఇది సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌కు కూడా వ‌ర్తిస్తుంది. మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసిన వారిలో 71 శాతం మంది ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ పూర్తి చేశారు.

మొత్తం 70 శాతం ఆర్డ‌ర్లు హోం డెలివ‌రీ అయ్యాయ‌ని `స్పిన్నీ` పేర్కొంది.బెంగ‌ళూరులో అత్య‌ధికంగా 75 శాతం, ఢిల్లీలో 68 శాతం, హైద‌రాబాద్‌లో 68 శాతం ఆన్ లైన్ కొనుగోళ్లు జ‌రిగాయి. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది సిల్వ‌ర్ కార్ల‌ను అత్య‌ధిక మంది కొనుగోలు చేశారు. త‌ర్వాతీ స్థానాల్లో గ్రే, రెడ్ క‌ల‌ర్ కార్ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే 65 శాతం మంది సెకండ్ హ్యాండ్ కార్ల‌ను సొంతం చేసుకున్నారు. 2022తో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ‌.

Next Story