Telugu Global
Business

Home Sales in Hyderabad | సొంతిళ్ల‌కు హైద‌రాబాద్ చుట్టూ ఫుల్ గిరాకీ.. ఆ సెగ్మెంట్‌లోనే ఎక్కువ రిజిస్ట్రేష‌న్లు!

Home Sales in Hyderabad | సొంతిల్లు ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌.. గ‌తంలో ఇల్లు క‌ట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్న‌ది నానుడి.. జీవిత కాల స్వ‌ప్నం ఇంటి కొనుగోలు అంటే భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది.

Home Sales in Hyderabad | సొంతిళ్ల‌కు హైద‌రాబాద్ చుట్టూ ఫుల్ గిరాకీ.. ఆ సెగ్మెంట్‌లోనే ఎక్కువ రిజిస్ట్రేష‌న్లు!
X

Home Sales in Hyderabad | సొంతిళ్ల‌కు హైద‌రాబాద్ చుట్టూ ఫుల్ గిరాకీ.. ఆ సెగ్మెంట్‌లోనే ఎక్కువ రిజిస్ట్రేష‌న్లు!

Home Sales in Hyderabad | సొంతిల్లు ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌.. గ‌తంలో ఇల్లు క‌ట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్న‌ది నానుడి.. జీవిత కాల స్వ‌ప్నం ఇంటి కొనుగోలు అంటే భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌ర్వాత సొంతింటి క‌ల నెర‌వేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలోనూ ఇండ్ల విక్ర‌యాలు పుంజుకుంటున్నాయి.

ఇండ్ల కొనుగోళ్ల‌లో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కొత్త రికార్డులు నెల‌కొల్పుతున్న‌ది. 2022 జూలైతో పోలిస్తే గ‌త నెల‌లో హైద‌రాబాద్‌లో ఇండ్ల విక్ర‌యాలు రికార్డు స్థాయిలో 26 శాతం వృద్ధి చెందాయి. గ‌త నెల‌లో 5,557 ఇండ్ల రిజిస్ట్రేష‌న్లు జ‌రిగాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జూలై ఇండ్ల కొనుగోళ్ల విలువ రూ.2,878 కోట్ల‌తో 35 శాతం గ్రోత్ న‌మోదైంది. తెలంగాణలో రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌తోపాటు మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ప‌రిధిలోనే ఇండ్ల విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి.

2023 జూలైలో జ‌రిగిన ఇండ్ల విక్ర‌యాల్లో 52 శాతం రూ.25-50 ల‌క్ష‌ల్లోపు విలువ క‌ల‌వే. రూ.25 ల‌క్ష‌ల్లోపు విలువ గ‌ల ఇండ్ల విక్ర‌యాలు మొత్తం ఇండ్ల సేల్స్‌లో 18 శాతం. రూ.కోటి కంటే ఎక్కువ ధ‌ర‌ గ‌ల ఇండ్ల విక్ర‌యాలు తొమ్మిది శాతానికి పైగా పెరిగాయి. గ‌తేడాదితో పోలిస్తే స్వ‌ల్ప వృద్ధిరేటు న‌మోదైందని ప్ర‌ముఖ రియాల్టీ క‌న్స‌ల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.

గ‌త నెల ఇండ్ల కొనుగోళ్లు ప్ర‌ధానంగా 1000-2000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం (ఎస్ఎఫ్‌టీ)లోనే సాగాయి. మొత్తం ఇండ్ల కొనుగోళ్ల‌లో 67 శాతం కూడా 1000-2000 చ‌ద‌రపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. గ‌తేడాదితో పోలిస్తే వెయ్యి ఎస్ఎఫ్‌టీల లోపు ఇండ్ల‌కు డిమాండ్ పెరిగింది. 2022 జూన్‌లో 500-1000 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో గ‌ల ఇండ్ల విక్ర‌యాలు 17 శాతం ఉంటే, 2023 జూలైలో 18 శాతానికి పెరిగాయి. 2000 చ‌ద‌ర‌పు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం గ‌ల ఇండ్ల‌కూ గిరాకీ పెరుగుతున్న‌ది. 2022 జూలైతో తొమ్మిది శాతం (2000 చ‌ద‌రపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం) ఉంటే, ఈ ఏడాది 11 శాతానికి పెరిగింది. తెలంగాణ‌లో ఇండ్ల విక్ర‌యాల్లో మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి జిల్లాదే రికార్డు. గ‌త నెల‌లో అత్య‌ధికంగా మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి జిల్లాలో 46 శాతం ఇండ్ల విక్ర‌యాలు జ‌రిగితే, త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో 37 శాతం, హైద‌రాబాద్‌లో 17 శాతం న‌మోద‌య్యాయి.

గ‌తేడాదితో పోలిస్తే 2023 జూలైలో ఇండ్ల ధ‌ర‌లు స‌గ‌టున 4.5 శాతం పెరిగాయి. మేడ్చ‌ల్‌-రంగారెడ్డి జిల్లాలో ఐదు శాతం, రంగారెడ్డిలో నాలుగు శాతం, హైద‌రాబాద్‌లో రెండు శాతం వృద్ధి చెందాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ.25-50 ల‌క్ష‌ల్లోపు ధ‌ర గ‌ల 1000-2000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గ‌ల ఇండ్లు ఎక్కువ‌. మెరుగైన వ‌స‌తులు, ఫెసిలిటీలు గ‌ల విలాస‌వంత‌మైన ఇండ్ల కొనుగోళ్ల‌కు ప్ర‌జ‌లు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలో రూ.5 కోట్ల విలువ గ‌ల 3000 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణం గ‌ల ఇండ్ల కొనుగోళ్లు కూడా జ‌రుగుతున్నాయి. కానీ 2021తో పోలిస్తే ఇండ్ల విక్ర‌యాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

Home Sales in Hyderabad | క‌రోనా త‌ర్వాత ఇండ్ల కొనుగోళ్ల‌కు గిరాకీ పెరుగుతోంది. 2021తో పోలిస్తే త‌గ్గినా.. గ‌తేడాది జూలైతో పోలిస్తే హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల సొంతిండ్ల కొనుగోళ్ల‌కు గిరాకీ ఎక్కువ‌వుతోంది. 2000 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంతోపాటు విలాస‌వంత‌మైన ఇండ్ల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.

First Published:  12 Aug 2023 12:35 PM GMT
Next Story