Telugu Global
Business

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను ఎలా వాడాలో తెలుసా?

క్రెడిట్ కార్డులను తెలివిగా వాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ రివార్డు పాయింట్లు సంపాదించొచ్చు. చాలా క్రెడిట్‌ కార్డు కంపెనీలు ఇతర సంస్థలతో కలిసి రివార్డు పాయింట్ల పేరుతో ఆఫర్లు అందిస్తుంటాయి.

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను ఎలా వాడాలో తెలుసా?
X

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను ఎలా వాడాలో తెలుసా?

ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డు వాడకానికి అలవాటు పడ్డారు. నాలుగైదు క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రెడిట్ కార్డులతో కొన్ని అదనపు ఉపయోగాలు కూడా ఉంటాయి. క్రెడిట్‌ కార్డులు వాడితే వచ్చే రివార్డు పాయింట్లతో రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని ఎలా వాడుకోవచ్చంటే..

క్రెడిట్ కార్డులను తెలివిగా వాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ రివార్డు పాయింట్లు సంపాదించొచ్చు. చాలా క్రెడిట్‌ కార్డు కంపెనీలు ఇతర సంస్థలతో కలిసి రివార్డు పాయింట్ల పేరుతో ఆఫర్లు అందిస్తుంటాయి. వీటి సాయంతో గిఫ్ట్‌ వోచర్లు, ట్రావెల్‌ టికెట్లు, రెస్టారెంట్లలో డిస్కౌంట్లు లాంటివి పొందొచ్చు. కొన్ని కార్డులు పెట్రోల్ బంకుల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రివార్డు పాయింట్లు అందజేస్తాయి. అలాగే కొన్ని రివార్డు పాయింట్లతో ఫ్లైట్ టికెట్స్‌లో డిస్కౌంట్స్, డీటీహెచ్ రీచార్జ్, హోటల్ బుకింగ్స్.. వంటి బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.

టైం లిమిట్

వాడకాన్ని బట్టి క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్లు వచ్చి చేరుతుంటాయి. అయితే ఈ రివార్డు పాయింట్లు వాడుకునేందుకు కూడా కొంత గడువు ఉంటుంది. టైం లిమిట్ దాటితే రివార్డు పాయింట్లు వేస్ట్ అవుతాయి. అందుకే ఎన్ని రివార్డు పాయింట్లు ఉన్నాయి? వాటిని ఎక్కడ ఉపయోగించొచ్చు? ఎప్పటి వరకూ వాడుకోవచ్చు? అనే విషయాలు తరచూ చెక్‌ చేసుకుంటుండాలి. కొన్ని కంపెనీలు బోనస్‌ రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. గడువులో మొత్తం పాయింట్లు ఉపయోగిస్తే బోనస్ పాయింట్లు కూడా యాడ్ అవుతాయి.

రిడీమ్ వాల్యూ

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు రిడీమ్ వాల్యూ ఉంటుంది. ఇది కొనే వస్తువుని బట్టి మారుతుంటుంది. అంటే రివార్డు పాయింట్లను వాడుకుని ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఒక రివార్డ్ పాయింట్‌ విలువ 20 పైసలుగా ఉంటే, వేరే వస్తువు కొనేటప్పుడు అదే పాయింట్‌ విలువ 50 పైసలు ఉండొచ్చు. కొన్ని కంపెనీలు ప్రతి 2000 పాయింట్లను రూ. 500 గా పరిగణిస్తాయి. ఇలా వాడే చోటు, వస్తువు, సర్వీస్, కార్డు రకాన్ని బట్టి రివార్డు పాయింట్ల విలువ మారుతూ ఉంటుంది.

రివార్డు పాయింట్లను వాడేముందు వాటికి ఎక్కడ, ఎప్పుడు, ఎంత వాల్యూ లభిస్తుందో తెలుసుకుని వాడడం మంచిది. రివార్డు పాయింట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్రెడిట్ కార్డు కంపెనీ వెబ్‌సైట్లు చెక్ చేయొచ్చు.

ఇకపోతే కొన్ని క్రెడిట్‌ కార్డుల్లో రివార్డు పాయింట్ల ఆప్షన్ ఉండదు. దానికి బదులు క్యాష్ బ్యాక్ పేరుతో కొన్ని బెనిఫిట్స్ అందజేస్తాయి. కొన్ని కార్డుల్లో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, షాపింగ్ డిస్కౌంట్లు.. ఇలా ప్రతి క్రెడిట్ కార్డుపై ఏదో రకమైన బెనిఫిట్ ఉంటుంది. కార్డు తీసుకునేటప్పుడు వాటి వివరాలు తెలుసుకోవాలి.

First Published:  4 Aug 2023 12:29 PM GMT
Next Story