Telugu Global
Business

ఉచితంగా కెరీర్ కౌన్సెలింగ్ ఇలా పొందొచ్చు!

కెరీర్, ఉద్యోగాన్ని నిర్ణయించుకోవడంలో చాలా ముందుచూపు అవసరం. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఇంటర్‌‌లో గ్రూప్ తప్పుగా ఎంచుకుంటే ఆ తర్వాత కెరీర్‌‌ను మార్చుకోవడం అంత సులభం కాదు. కాబట్టి కెరీర్ విషయంలో ముందు నుంచే అవగాహన అవసరం. అందుకు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలు తెలిసి ఉండాలి. దీనికోసమే కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో ఉచితంగా కెరీర్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నాయి.

ఉచితంగా కెరీర్ కౌన్సెలింగ్ ఇలా పొందొచ్చు!
X

నచ్చిన వృత్తిలో ఉంటే ఆ సంతోషం, సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా ఈ తరం విద్యార్థులు నచ్చిన కెరీర్‌‌పై ముందునుంచే ఫోకస్ పెట్టడం ఎంతో అవసరం. మరయితే నచ్చిన కెరీర్‌‌ను ఎంచుకోవడం ఎలా? ఏయే చదువులతో ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి? ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ తెలుసుకోవాలి?

కెరీర్, ఉద్యోగాన్ని నిర్ణయించుకోవడంలో చాలా ముందుచూపు అవసరం. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఇంటర్‌‌లో గ్రూప్ తప్పుగా ఎంచుకుంటే ఆ తర్వాత కెరీర్‌‌ను మార్చుకోవడం అంత సులభం కాదు. కాబట్టి కెరీర్ విషయంలో ముందు నుంచే అవగాహన అవసరం. అందుకు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలు తెలిసి ఉండాలి. దీనికోసమే కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో ఉచితంగా కెరీర్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నాయి. కోర్సులు ఎంచుకునే ముందు, కెరీర్‌ గురించి ఆలోచించే ముందు ఇలాంటి కౌన్సెలింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఒకసారి తిరగేయడం మంచిది.

నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌

విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌’ అనే పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ (ఎన్‌సీఎస్‌) అనేది కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇందులో కెరీర్‌ కౌన్సెలింగ్‌తోపాటుగా ఉద్యోగావకాశాలు, స్కిల్స్ డెవలప్‌మెంట్, పలురకాల కోర్సులకు సంబంధించిన సమాచారం లభిస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో కెరీర్‌ కౌన్సెలర్లు, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు, పరిశ్రమలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఇందులో 14 ఏళ్ల వయసు దాటిన వారు ఎవరైనా వివరాలు నమోదు చేసుకుని కావాల్సిన అంశాలు తెలుసుకోవచ్చు. కౌన్సెలర్ల సాయంతో సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

ఎడ్యుమైల్‌స్టోన్స్

‘ఎడ్యుమైల్‌స్టోన్స్ డాట్ కామ్’ అనేది బెంగళూరు బేస్డ్ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సంస్థ. ఈ సంస్థకు మంచి పేరుతోపాటు లక్షల మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన అనుభవం కూడా ఉంది. ఇందులో 4 వేలమందికి పైగా కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. స్కూల్ విద్యార్థుల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారి వరకూ ఎవరికి ఎలాంటి కెరీర్ గైడెన్స్ అయినా, సూచనలు అయినా ఉచితంగా అందిస్తుంది ఈ సంస్థ.

మైండ్లర్‌

‘మైండ్లర్ డాట్ కామ్’ అనే ప్లాట్‌ఫామ్.. చిన్నచిన్న అసెస్‌మెంట్స్ ద్వారా విద్యార్థి ఇంట్రెస్ట్‌లను అంచనా వేస్తుంది. ఒరియంటేషన్‌ స్టైల్‌, ఇంట్రెస్ట్‌, పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్‌, ఎమోషనల్‌ కోషంట్‌ వంటివి పరిశీలించి తద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి ఆ తర్వాత కౌన్సెలింగ్ అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ వంటివి కూడా చేసుకోవచ్చు. వన్ టు వన్ కౌన్సెలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఇందులో కొన్ని సర్వీసులు ఉచితంగా లభిస్తే మరికొన్ని సేవల కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఫ్రెషర్స్‌వరల్డ్‌

‘ఫ్రెషర్స్ వరల్డ్ డాట్‌కామ్’ అనేది ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌ లాంటిది. ఇందులో ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం వెతకొచ్చు. అలాగే ఇందులో వివిధ ఉద్యోగాల తీరు, వాటికి కావాల్సిన అర్హతలు, ఉద్యోగావకాశాలు.. ఇలా వీటన్నింటి గురించిన వివరాలు కూడా ఉంటాయి. ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ప్రభుత్వ, ప్రైవేటు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు పొందొచ్చు. కెరీర్‌‌కు సంబంధించిన విషయాలపై వెబినార్లు, జాబ్ నోటిఫికేషన్లు, రెజ్యూమె బిల్డింగ్‌ టిప్స్, ఇంటర్వ్యూ టిప్స్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

మ్యాప్‌మైటాలెంట్‌

‘మ్యాప్‌మైటాలెంట్‌.ఇన్‌’ అనేది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కెరీర్‌ కౌన్సెలింగ్‌ ప్లాట్‌ఫామ్. అసెస్‌మెంట్స్‌ ద్వారా విద్యార్థిని పూర్తిగా అంచనా వేసి దానికి తగ్గట్టుగా కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇస్తారు. బిహేవియరల్‌ సైన్స్‌ అనే ఆప్షన్స్ సాయంతో విద్యార్థులు ఏది ఎంచుకోవాలో తెలిసేలా చేస్తారు. పలురకాల కౌన్సెలింగ్ సేవలను ఈ ప్లాట్‌ఫామ్ ఉచితంగానే అందిస్తోంది.

First Published:  1 Aug 2023 6:48 AM GMT
Next Story