Telugu Global
Business

Honda Elevate | జూన్ 6న మార్కెట్‌లోకి హోండా ఎలివేట్.. ఆ ఏడు కార్ల‌తో బ‌స్తీమే స‌వాల్‌..!

Honda Elevate: ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) వ‌చ్చేనెల ఆరో తేదీన మిడ్‌సైడ్ ఎస్‌యూవీ కారు ఎలివేట్ (Honda Elevate) భార‌త్‌లో మార్కెట్లోకి రానున్న‌ది.

Honda Elevate | జూన్ 6న మార్కెట్‌లోకి హోండా ఎలివేట్.. ఆ ఏడు కార్ల‌తో బ‌స్తీమే స‌వాల్‌..!
X

Honda Elevate | జూన్ 6న మార్కెట్‌లోకి హోండా ఎలివేట్.. ఆ ఏడు కార్ల‌తో బ‌స్తీమే స‌వాల్‌..!

ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) వ‌చ్చేనెల ఆరో తేదీన మిడ్‌సైడ్ ఎస్‌యూవీ కారు ఎలివేట్ (Honda Elevate) భార‌త్‌లో మార్కెట్లోకి రానున్న‌ది. వ‌చ్చేనెల నుంచే ఉత్ప‌త్తి ప్రారంభం కానున్న‌ది. హోండా ఎలివేట్ గ్లోబ‌ల్ మోడ‌ల్ కారు కానున్న‌ది. ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా మిడ్ సైజ్ ఎస్‌యూవీ క్రెటాతో గ‌ట్టిగా త‌ల‌ప‌డ‌నున్న‌ది.

భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో హోండా ఎలివేట్ (Honda Elevate) వ‌చ్చేనెల ఆరో తేదీన ఎంట‌ర్ కానున్న‌ది. భార‌త్‌లో హోండా కార్స్ విడుద‌ల చేస్తున్న తొలి ఎస్‌యూవీ కారు ఎలివేట్‌. వ‌చ్చే ఫెస్టివ్ సీజ‌న్ నుంచి హోండా ఎలివేట్ కార్ల డెలివ‌రీ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. హోండా ఎలివేట్ కారు ధ‌ర రూ.10.50 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల మధ్య ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.



హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌, ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్‌, స్కోడా కుషాఖ్‌, ఫోక్స్ వ్యాగ‌న్ టైగూన్‌, ఎంజీ మోటార్స్ ఎస్ట‌ర్ వేరియంట్ల కార్ల‌తో హోండా ఎలివేట్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది. హోండా ఎలివేట్ అప్‌రైట్ ఫ్రంట్ విత్ ఏ బోల్డ్ గ్రిల్లె, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్‌, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్‌, ట‌చ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్‌, డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, వైర్‌లెస్ చార్జ‌ర్‌, వెంటిలేటెడ్ సీట్లు, అడాస్ వ్య‌వ‌స్థ క‌లిగి ఉంటాయి.



హోండా ఎలివేట్ 1.5-లీట‌ర్ల వీటెక్ డీఓహెచ్‌సీ పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. గ‌రిష్టంగా 121 పీఎస్ విద్యుత్‌, 145 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. హోండా సిటీ ఇంజిన్.. ఎలివేట్‌లోనూ ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 7-స్పీడ్ సీవీటీ ఆప్ష‌న్‌తో అందుబాటులో ఉంటుంది. హోండా సిటీ ఈ:హెవ్ నుంచి స్ట్రాంగ్ హైబ్రీడ్ ప‌వ‌ర్ ట్రైన్ కూడా క‌లిగి ఉంటుంది.



First Published:  14 May 2023 8:16 AM GMT
Next Story