Telugu Global
Business

HDFC SME-Credit Cards | వ్యాపార‌, పారిశ్రామిక లావాదేవీల కోసం నాలుగు హెచ్‌డీఎఫ్సీ ఎస్ఎంఈ క్రెడిట్ కార్డులు.. ఇవీ డిటైల్స్‌.. !

తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆవిష్క‌రించిన నాలుగు క్రెడిట్ కార్డుల వాడ‌కంపై 55 రోజుల వ‌డ్డీ ర‌హిత రుణ ప‌ర‌ప‌తి సౌక‌ర్యం ల‌భిస్తుంది.

HDFC SME-Credit Cards | వ్యాపార‌, పారిశ్రామిక లావాదేవీల కోసం నాలుగు హెచ్‌డీఎఫ్సీ ఎస్ఎంఈ క్రెడిట్ కార్డులు.. ఇవీ డిటైల్స్‌.. !
X

HDFC SME-Credit Cards | క్రెడిట్ కార్డు అంటే గ‌తంలో వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ సంస్థ‌ల అధిప‌తులు, ఎగ్జిక్యూటివ్‌ల‌కే ప‌రిమితం. అందుబాటులోకి వ‌చ్చిన అత్యాధునిక టెక్నాల‌జీ, మార్కెట్‌లో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు, డిజిట‌ల్ పేమెంట్స్‌, ఈ-కామ‌ర్స్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిట‌ల్ లావాదేవీల‌పై ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ల‌భిస్తున్నాయి. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. ఇక చిన్న వ్యాపారులు, సూక్ష్మ చిన్న త‌ర‌హా పారిశ్రామిక‌వేత్త‌ల‌ ఆర్థిక లావాదేవీలు క్రెడిట్ ఆధారంగా సాగుతుంటాయి. చిన్న వ్యాపారులు, చిన్న‌త‌ర‌హా పారిశ్రామిక‌వేత్త‌లకు బిజినెస్ లావాదేవీలకు క్రెడిట్ ఫెసిలిటీ అవ‌స‌రం. అటువంటి వారి కోసం ప్ర‌త్యేకించి సూక్ష్మ చిన్న త‌ర‌హా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ కొత్త‌గా నాలుగు క్రెడిట్ కార్డుల‌ను మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. సూక్ష్మ చిన్న‌త‌ర ప‌రిశ్రామిక రంగంలో ఔత్సాహిక‌ పారిశ్రామిక‌వేత్త‌లు, ఫ్రీలాన్స‌ర్‌లు, వృత్తి నిపుణుల విశ్వ‌జ‌నీన అవ‌స‌రాల‌కు ఈ క్రెడిట్ కార్డులు తోడ్పాటునిస్తాయి.

55 రోజుల వ‌డ్డీ ర‌హిత క్రెడిట్ ఫెసిలిటీ ఇలా

తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆవిష్క‌రించిన నాలుగు క్రెడిట్ కార్డుల వాడ‌కంపై 55 రోజుల వ‌డ్డీ ర‌హిత రుణ ప‌ర‌ప‌తి సౌక‌ర్యం ల‌భిస్తుంది. దేశీయ క్రెడిట్ కార్డుల మార్కెట్‌లో అత్య‌ధిక వ‌డ్డీ ర‌హిత క్రెడిట్ ఫెసిలిటీ క‌ల్పిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్ర‌క‌టించింది. బుల్లి వ్యాపారులు, పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ వ్యాపారాల్లో న‌గ‌దు లావాదేవీలకు మ‌రింత ఫ్లెక్సిబిలిటీ, సౌక‌ర్య‌వంతంగానూ ఉంటుంది.

సూక్ష్మ చిన్న‌తర‌హా ప‌రిశ్రామిక వేత్త‌ల (ఎస్ఎంఈ) పేమెంట్స్ సొల్యూష‌న్స్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బిజ్ ఫ‌స్ట్ (BizFirst), బిజ్ గ్రో (BizGrow), బిజ్ ప‌వ‌ర్ (BizPower), బిజ్ బ్లాక్ (BizBlack) అనే పేర్ల‌తో కొత్త క్రెడిట్ కార్డులు ఆవిష్క‌రించిన‌ట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స్వ‌యం ఉపాధిపై జీవిస్తున్న వ్య‌క్తులు, చిన్న మ‌ధ్య త‌ర‌హా, సూక్ష్మ చిన్న మ‌ధ్య త‌ర‌హా పారిశ్రామికేత్త‌ల విభిన్న పేమెంట్స్ అవ‌స‌రాల‌కు ఎస్ఎంఈ పేమెంట్ సొల్యూష‌న్ డిజైన్ చేశామ‌ని వెల్ల‌డించింది.

యుటిలిటీ బిల్లులు, జీఎస్టీ, ఆదాయం ప‌న్ను, అద్దె చెల్లింపులు, వ్యాపార నిమిత్తం ప్ర‌యాణం, బిజినెస్ ప్రొడ‌క్టివిటీ టూల్స్ వంటి అత్య‌వ‌స‌ర వ్యాపార ఖ‌ర్చుల్లో పొదుపును ఆఫ‌ర్ చేస్తాయి ఈ ఎస్ఎంఈ ఫోక‌స్డ్ క్రెడిట్ కార్డులు. చేతిలో న‌గ‌దు ఉంటే ఖ‌ర్చు నివారించ‌లేం. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల‌తో గ‌రిష్టంగా ఖ‌ర్చులు పొదుపు చేసేందుకు వెసులుబాటు క‌లుగుతుంద‌ని, ఈ ఎస్ఎంఈ పేమెంట్ సొల్యూష‌న్స్ అందుకు దోహ‌ద ప‌డ‌తాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

చెల్లింపులు.. వ‌సూళ్ల యాజ‌మాన్యానికి ఏకీకృత డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్

వ్యాపార లావాదేవీల్లో బిల్లుల చెల్లింపులు, వ‌సూళ్ల ప‌రిష్కారానికి హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ యూనిఫైడ్ డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ ప్ర‌వేశ పెట్టింది. బిజినెస్ సంస్థ‌ల అద్దె చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, ఇత‌ర చెల్లింపులను క‌న్సాలిడేట్ చేస్తుందీ ప్లాట్‌ఫామ్‌. ఎస్ఎంఈల‌కు క్ర‌మ‌బ‌ద్ధీక‌రణ‌తో కూడిన శ‌క్తిమంత‌మైన చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ను అందిస్తుంది. త‌ద్వారా మెరుగైన న‌గ‌దు నిర్వ‌హ‌ణ యాజ‌మాన్య ప‌ద్ద‌తులు అవ‌లింబించేందుకు వెసులుబాటు క‌లిగిస్తుంది.

బిజినెస్ క్రెడిట్ కార్డుల‌పై 5 కీల‌క ఫీచ‌ర్లు ఇవే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆక‌ర్ష‌ణీయ‌మైన విస్తృత శ్రేణి ఫీచ‌ర్ల‌తో ఎస్ఎంఈ ఫోక‌స్డ్ క్రెడిట్ కార్డుల‌ను జారీ చేసింది.

దేశీయ క్రెడిట్ కార్డుల మార్కెట్‌లో అత్య‌ధికంగా 55 రోజుల వ‌ర‌కు వ‌డ్డీ ర‌హిత క్రెడిట్ పీరియ‌డ్ క‌ల్పిస్తున్న‌ట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్ర‌క‌టించింది.

వ్యాపార లావాదేవీల ఖ‌ర్చుల‌పై 10ఎక్స్ రివార్డు పాయింట్లు.

అగ్ని ప్ర‌మాదం సంభ‌వించినా, దోపిడీకి గురైనా రిస్క్ లేకుండా బిజినెస్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ.

బిజినెస్ ఫోక‌స్డ్ కేట‌లాగ్‌, ట్రావెలింగ్‌, హోట‌ళ్ల‌లో డైనింగ్‌, మైక్రోసాఫ్ట్ 365, క్లియ‌ర్ ట్యాక్స్‌, వ్యాపారాల‌కు అమెజాన్‌, గూగుల్ యాడ్స్ కోసం చెల్లింపుల‌పై ఎక్స్‌క్లూజివ్ రీడిమ్ష‌న్ ఆప్ష‌న్లు.

క్రెడిట్ కార్డుపై రుణంతోపాటు ఈఎంఐ ఆప్ష‌న్ వ‌ల్ల ఫైనాన్సియ‌ల్ ఫ్లెక్సిబిలిటీ ల‌భ్యం.

వీటితోపాటు కొత్త‌గా ఆవిర్భ‌విస్తున్న గిగా బిజినెస్‌లో స్వ‌యం ఉపాధిపై జీవిస్తున్న ఫ్రీలాన్స‌ర్లు, గిగ్ వ‌ర్క‌ర్ల కోసం త్వ‌ర‌లో గిగా బిజినెస్ క్రెడిట్ కార్డు ఆవిష్క‌రిస్తామ‌ని హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.

First Published:  10 Feb 2024 3:22 AM GMT
Next Story