Telugu Global
Business

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్! ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి!

ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ నెల 16 నుంచి 21 వరకూ డిస్కౌంట్ సేల్ షురూ అయింది. ఈ సేల్‌లో ఐఫోన్‌ స‌హా ప‌లు స్మార్ట్‌ఫోన్‌ల‌పై మంచి ఆఫ‌ర్లు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్! ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి!
X

ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ సేవింగ్ డేస్' పేరుతో ఈ నెల 16 నుంచి 21 వరకూ డిస్కౌంట్ సేల్ షురూ అయింది. ఈ సేల్‌లో ఐఫోన్‌ స‌హా ప‌లు స్మార్ట్‌ఫోన్‌ల‌పై మంచి ఆఫ‌ర్లు ఉన్నాయి.

ఏడాదిని ముగింపు సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేవింగ్ డేస్ సేల్‌ తీసుకొచ్చింది. ఇందులో చాలా రకాల 5జీ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో కూడా అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో మోటో జీ52, రెడ్ మీ 10, గూగుల్ పిక్సెల్ 6ఏ, శాంసంగ్ గెలాక్సీఎస్ 21 ఎఫ్‌ఈ సహా మరికొన్ని మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో పిక్సెల్ 6ఏ (Pixel 6a) ధర భారీగా తగ్గింది.128జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ.29,999గా ఉంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా(EDGE 30 ULTRA) రూ. 54,999కి అందుబాటులో ఉంది. ఇది లేటస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. 200ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 ధర కూడా తగ్గింది. ఈ మొబైల్ ధర రూ.27,499 ఉంది. అలాగే రూ. 49,999 ధర ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్‌ఈ(S21FE) ప్రస్తుతం రూ. 39,999 కే లభిస్తుంది.

ఇక వీటితో పాటు ఐఫోన్ 13, ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది . బ్యాంక్ ఆఫర్‌‌తో కలిపి ఐఫోన్ 13 రూ. 62,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే ఫస్ట్ టైం. ఐఫోన్ 14 కొనాలనుకునే వారు దాదాపు అదే ఫీచర్లతో లభిస్తున్న ఐఫోన్ 13 ను కొనుగోలు చేయడం బెటర్ అని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

First Published:  17 Dec 2022 12:11 PM GMT
Next Story