Telugu Global
Business

ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! బెస్ట్ డీల్స్ ఇవే..

సేల్‌లో డిస్కౌంట్‌ లభించే వస్తువుల విషయానికొస్తే.. ముఖ్యంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ల అతి తక్కువ ధరకు లభించనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ ఫోన్‌తో పాటు, ఐఫోన్‌లపై కూడా పలు డిస్కౌంట్లు ఉండనున్నాయి.

ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! బెస్ట్ డీల్స్ ఇవే..
X

త్వరలోనే ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌’ను ప్రకటించబోతోంది. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేందుకు ఈ సేల్ మంచి ఆప్షన్. ఇందులో పలు మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌పై మంచి ఆఫర్స్ ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్ హోం పేజీలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పేజీ కనిపిస్తోంది. సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఎప్పటిలాగానే అక్టోబర్‌లో వచ్చే దసరా, నవంబర్‌లో వచ్చే దీపావళి పండుగలను లక్ష్యంగా చేసుకుని ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను తీసుకురాబోతోంది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే సేల్‌లో భాగంగా ఏయే వస్తువులపై డిస్కౌంట్స్ ఉంటాయో ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఇక సేల్‌లో డిస్కౌంట్‌ లభించే వస్తువుల విషయానికొస్తే.. ముఖ్యంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ల అతి తక్కువ ధరకు లభించనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ ఫోన్‌తో పాటు, ఐఫోన్‌లపై కూడా పలు డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 1 నుంచి ఐఫోన్‌ సేల్స్ మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 3 నుంచి శాంసంగ్ మొబైల్స్, అక్టోబర్ 6 నుంచి రియల్‌మీ ఫోన్స్, అక్టోబర్ 7 నుంచి రెడ్‌మీ, అక్టోబర్ 8 నుంచి ఒప్పో, పోకో మొబైల్స్ సేల్స్ మొదలవుతాయి. ఈ ఫోన్ల పై ఉండే డిస్కౌంట్ల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఇకపోతే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మానిటర్‌లపై 70 శాతం, ప్రింటర్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ పై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 13, ఐఫోన్ 14లపై కూడా భారీ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఎప్పటిలాగానే సేల్ సమయంలో రష్ అవర్స్ డీల్స్, బంపర్ వాల్యూ అవర్స్, సూపర్ వాల్యూ కాంబోస్ వంటివి ఉంటాయి.

First Published:  23 Sep 2023 12:27 PM GMT
Next Story