Telugu Global
Business

ఎక్స్‌పైరీ డేట్ చూసే వాడుతున్నారా?

Expiry Date: మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్‌ రాసి ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌పైరీ డేట్ వెనుక చాలా అర్థాలు ఉంటాయని మీకు తెలుసా? అసలు ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు? డేట్ దాటిన తర్వాత వాటిని వాడితే ఏమవుతుంది?

Expiry Date: ఎక్స్‌పైరీ డేట్ చూసే వాడుతున్నారా?
X

Expiry Date: ఎక్స్‌పైరీ డేట్ చూసే వాడుతున్నారా?

మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్‌ రాసి ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌పైరీ డేట్ వెనుక చాలా అర్థాలు ఉంటాయని మీకు తెలుసా? అసలు ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు? డేట్ దాటిన తర్వాత వాటిని వాడితే ఏమవుతుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫుడ్ ఐటెమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇతర చాలా రకాల వస్తువులపై ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. వస్తువు కొనేముందు ఆ డేట్ చూసి కొనాలి. ఎక్స్‌పైరీ డేట్ పూర్తయిన ప్రొడక్ట్స్ వాడితే లేనిపోని ఇబ్బందులొస్తాయి. అయితే ఈ ఎక్స్‌పైరీ డేట్‌కు సంబంధించి రకరకాల లేబుల్స్ ఉంటాయి.

వాటిని గమనిస్తే అది ఎంతవరకు నిల్వ ఉంటుందో మనకు తెలుస్తుంది. లేబుల్ లో 'డిస్‌ప్లే అన్‌టిల్' లేదా 'సెల్ బై' అని రాసి ఉన్న తేదీలు అమ్మేవాళ్ల కోసం రాసినవి. కొనేవాళ్ల కోసం కాదు. 'బెస్ట్ బిఫోర్' కింద రాసే తేదీ కొనుగోలుదారుల కోసం. అయితే నిజానికి ఈ తేదీ క్వాలిటీని సూచిస్తుందే తప్ప సేఫ్టీని కాదు. అంటే ఆ తేదీ తర్వాత, పదార్థం రంగు, రుచి మారొచ్చని లేదా గట్టిగా, మెత్తగా అయిపోవచ్చని అర్థం. ఇక 'యూజ్ బై' కింద రాసి ఉన్న తేదీని మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిన తర్వాత అందులో పదార్థాన్ని తినడం ఏమాత్రం సురక్షితం కాదు.

ఇకపోతే ఎక్స్‌పైరీ డేట్‌ ఉండి, ప్యాకింగ్‌ సరిగా లేకపోతే కూడా ఆ వస్తువు వెంటనే పాడవ్వొచ్చు. డ్రైఫ్రూట్స్, చీజ్, కేక్స్ లాంటివి ప్యాకింగ్ సరిగా లేకపోతే వెంటనే పాడవుతాయి. ఉప్పు లాంటి పదార్థాలను ఎక్స్‌పైరీ డేట్‌తో సంబంధం లేకుండా సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. ఏదేమైనా వస్తువు వాడేముందు చెడిపోయిందా లేదా అనేది దాని నుంచి వచ్చే వాసన, స్వభావాన్ని చూసి కనిపెట్టొచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా మందుల విషయంలో ఎక్స్‌పైరీ తేదీని జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిపోయిన తర్వాత మందులు వాడటం వల్ల అవి పని చేయకపోవచ్చు లేదా దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడొచ్చు.

First Published:  14 Dec 2022 11:56 AM GMT
Next Story