Telugu Global
Business

Equity mutual funds | మూడేండ్ల‌లో ఈక్విటీ ఫండ్స్‌పై డ‌బుల్ రిట‌ర్న్స్‌.. టాప్‌-10 సంస్థ‌ల బెనిఫిట్స్ ఇవే..!

Equity mutual funds | ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు.

Equity mutual funds | మూడేండ్ల‌లో ఈక్విటీ ఫండ్స్‌పై డ‌బుల్ రిట‌ర్న్స్‌.. టాప్‌-10 సంస్థ‌ల బెనిఫిట్స్ ఇవే..!
X

Equity mutual funds | ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. త‌మ కుటుంబ అవ‌స‌రాలు, పిల్ల‌ల ఉన్న‌త విద్యాభ్యాసం కోసం పొదుపు ప‌థ‌కాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు సేవింగ్స్ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెడ‌తారు. బంగారం, రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిస్క్ ఎదుర్కొంటే ఈక్విటీల్లో, ఈక్విటీ బేస్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు. ఇటీవ‌లి కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఆల్‌టైం గ‌రిష్ట స్థాయికి దూసుకెళ్లాయి. ఈ నేప‌థ్యంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో నిధులు మ‌దుపు చేసే ఇన్వెస్ట‌ర్లు పెరిగారు. గ‌త మూడేండ్ల‌లో ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యాయి. సుమారు 36 ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు రెట్టింపు అవుతున్నాయి. వాటిల్లో టాప్ 10 ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఉన్నాయి.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేండ్ల‌లో 196 శాతం రిట‌ర్న్స్ అందిస్తోంది. ఈ ప‌థ‌కంలో రూ.ల‌క్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేండ్ల‌లో రూ.2,95 ల‌క్ష‌లు అవుతుంది.

క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుబ‌డుల‌పై మూడేండ్ల‌లో 158 శాతం రిట‌ర్న్స్ పొందొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.ల‌క్ష మ‌దుపు చేస్తే మూడేండ్ల‌లో మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.2.58 ల‌క్ష‌లవుతాయి.

క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో పెట్టుబ‌డుల‌పై మూడేండ్ల‌లో 144 శాతం రిట‌ర్న్స్ వ‌స్తాయి. రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే, మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.2.43 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ అందుతాయి.

నిప్ప‌న్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 143 శాతం రిట‌ర్న్స్ అందిస్తుంది. అంటే రూ.ల‌క్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేండ్ల‌లో రూ.2.43 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ పొందొచ్చు.

హెచ్ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ నుంచి 138 శాతం రిట‌ర్న్స్ వ‌స్తాయి. రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల‌లో రూ.2.38 ల‌క్ష‌లు రిట‌ర్న్స్ అందుకోవ‌చ్చు.

క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవ‌ర్ ఫండ్ మూడేండ్ల‌లో 134 శాతం రిట‌ర్న్స్ అందిస్తుంది. రూ.ల‌క్ష పెట్టుబ‌డితో రూ.2.33 ల‌క్ష‌ల లాభం పొందొచ్చు.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 132 శాతం రిట‌ర్న్స్ ఇస్తుంది. రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల‌లో రూ.2.32 ల‌క్ష‌ల బెనిఫిట్ ల‌భిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేండ్ల‌లో 127 శాతం రిట‌ర్న్స్ అందిస్తుంది. రూ.ల‌క్ష పెట్టుబ‌డితో రూ.2.26 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ అందుకోవ‌చ్చు.

క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుబ‌డుల‌పై 125 శాతం రిట‌ర్న్స్ ల‌భిస్తుంది. రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే రూ.2.25 ల‌క్ష‌ల బెనిఫిట్ ల‌భిస్తుంది.

ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ కోస్ ఫండ్‌లో పెట్టుబ‌డుల‌పై 122 శాతం రిట‌ర్న్స్ వ‌స్తాయి. ఒక‌వేళ రూ.ల‌క్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేండ్ల‌లో రూ.2.21 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ అందుకోవ‌చ్చు.

First Published:  18 March 2024 9:15 AM GMT
Next Story