Telugu Global
Business

Equity Linked Mutual Funds | ఈక్విటీ లింక్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. 2023లో బెస్ట్ రిట‌ర్న్స్ స్కీమ్స్ ఇవే..!

Equity Linked Mutual Funds | ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సంపాద‌న‌లో కొంత మొత్తం కుటుంబ ల‌క్ష్యాలు.. భ‌విష్య‌త్‌లో పిల్ల‌ల అవ‌స‌రాల కోసం పొదుపు చేస్తుంటారు. అత్య‌ధికులు రిస్క్‌లేని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మ‌దుపు చేస్తుంటారు.

Equity Linked Mutual Funds | ఈక్విటీ లింక్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. 2023లో బెస్ట్ రిట‌ర్న్స్ స్కీమ్స్ ఇవే..!
X

Equity Linked Mutual Funds | ఈక్విటీ లింక్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. 2023లో బెస్ట్ రిట‌ర్న్స్ స్కీమ్స్ ఇవే..!

Equity Linked Mutual Funds | ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సంపాద‌న‌లో కొంత మొత్తం కుటుంబ ల‌క్ష్యాలు.. భ‌విష్య‌త్‌లో పిల్ల‌ల అవ‌స‌రాల కోసం పొదుపు చేస్తుంటారు. అత్య‌ధికులు రిస్క్‌లేని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మ‌దుపు చేస్తుంటారు. మ‌రి కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో.. ఇంకొంద‌రు బంగారంపై పెట్టుబ‌డులు పెడుతుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై నిర్దిష్ట మొత్తం మాత్ర‌మే రిట‌ర్న్స్ ల‌భిస్తాయి. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పెట్టుబ‌డులు పెడితే లాభాలు వ‌స్తాయి.. ఇక బంగారంపై పెట్టుబ‌డులు ర‌మార‌మీ 19 శాతం వ‌ర‌కూ రిట‌ర్న్స్ ఇస్తాయి.

స్టాక్ మార్కెట్లు, స్టాక్స్ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్స్ ఆధారిత ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌కు రిట‌ర్న్స్ వ‌స్తాయి. అయితే, స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల‌కు రిస్క్ ముప్పు ఎక్కువ‌. ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్‌), లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్‌, మ‌ల్టీ క్యాప్‌, ఫ్లెక్సీ క్యాప్, ఫోక‌స్డ్ ఫండ్స్‌, గోల్డ్ ఈటీఎఫ్స్ వంటి ఫండ్స్‌లో గ‌తంతో పోలిస్తే రిస్క్ ఉన్నా రిట‌ర్న్స్ కూడా బాగానే అందిస్తున్నాయి. వీటిని నిరంత‌ర, గ్రోత్ ఆప్ష‌న్లుగా ఎంచుకోవ‌చ్చు.

2023లో ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మ‌దుపు చేసిన వారికి సంప‌ద సృష్టించాయి. అత్య‌ధిక ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్స్ 2023లో రెండంకెల స్థాయిని దాటి 20-30 శాతం రిట‌ర్న్స్ అందించాయి. అత్య‌ధిక స్థాయిలో రిట‌ర్న్స్ అందించిన ఫండ్స్ గురించి తెలుసుకుందాం..

దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్స్ మార్కెట్‌లో 243 ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్స్ ఉంటే వాటిల్లో 15 స్కీమ్‌ల్లో మాత్ర‌మే 30 శాతానికి పైగా రిట‌ర్న్స్ ల‌భించాయి. వాటిల్లో మ‌హీంద్రా మ‌నులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 2023లో 39.34 శాతం రిటర్న్స్ అందించింది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 2023 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ఈ ప‌థ‌కంలో రూ.10 వేలు పెట్టుబ‌డి పెట్టార‌నుకుందాం.. ఇప్పుడు రూ.13,934.49 అయింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల‌ర్ కంపెనీస్ ఫండ్ 36.30 శాతం, బంధ‌న్ ఎమ‌ర్జింగ్ బిజినెసెస్ ఫండ్ 35.08 శాతం రిట‌ర్న్స్ అందించాయి.

ఈక్విటీ లింక్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్: 2023లో వాటి నుంచి ల‌భించిన రిట‌ర్న్స్‌

మ‌హీంద్రా మ‌నులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ : 39.34%

ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల‌ర్ కంపెనీస్ ఫండ్ : 36.30%

బంధ‌న్ ఎమ‌ర్జింగ్ బిజినెసెస్ ఫండ్ : 35.08 %

యూనియ‌న్ స్మాల్ క్యాప్ ఫండ్ : 34.04 %

నిప్ప‌న్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ : 34.01%

హెచ్ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ : 33.98%

హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ : 33.66%

జేఎం మిడ్ క్యాప్ ఫండ్ : 32.68%

ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ : 32.57%

జేవీ వాల్యూ ఫండ్ : 31.53 %

సుంద‌రం స్మాల్ క్యాప్ ఫండ్ : 30.62%

మ‌హీంద్రా మ‌నులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ : 30.26 %

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌: 30.16%

డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ : 30.09 శాతం

ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ : 30.04 %

(నోట్‌: ఈ నెల 18న ఆదాయం ప‌న్నుశాఖ‌కు మ్యూచువ‌ల్ సంస్థ‌లు స‌మ‌ర్పించిన ఐటీ రిట‌ర్న్స్ ఆధారంగా రూపొందించిన ప‌ట్టిక ఇది)

ఆయా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై రిట‌ర్న్స్ ఇలా

* జేఎం మిడ్‌క్యాప్ ఫండ్ రూ.499.45 కోట్లు పెట్టుబ‌డుల‌తో 32.68 శాతం రిట‌ర్న్స్ అందించింది.

* మ‌హీంద్రా మ‌నులైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ 2023లో 30.26 శాతం రిట‌ర్న్స్ ఇచ్చింది.

* ఈ ఏడాది 31.53 శాతం రిట‌ర్న్స్ ఇచ్చిన వాల్యూ ఫండ్‌లో `జేఎం వాల్యూ ఫండ్ ఒక‌టే. జేఎం వాల్యూ ఫండ్ రూ.256.21 కోట్లు మాత్ర‌మే.

స్మాల్ క్యాప్ క్యాట‌గిరీలోని కొన్ని అతి చిన్న స్కీమ్‌లు 2023లో గ‌రిష్టంగా రిట‌ర్న్స్ అందించాయి.

* బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రూ.680.40 కోట్ల‌తో 30.16 శాతం రిట‌ర్న్స్ అందించింది.

* యూనియ‌న్ స్మాల్ క్యాప్ ఫండ్‌తో 34.04 శాతం రిట‌ర్న్స్‌. దీని విలువ రూ.1,103.50 కోట్లు.

* ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రూ.1,649.72 కోట్ల‌తో 32.57 శాతం రిట‌ర్న్స్ అందించింది.

మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న వారు వాటిల్లో పొంచి ఉన్న రిస్క్‌, మీ కుటుంబ భ‌విష్య‌త్ ల‌క్ష్యాలపై క్లారిటీ తెచ్చుకున్న త‌ర్వాతే ఏ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్టాలో నిర్ణ‌యించుకోవాల‌ని ఆర్థిక‌వేత్త‌లు సూచిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌థ‌కాల్లో వ‌చ్చిన లాభాలూ, రిట‌ర్న్స్‌ను సూచ‌న ప్రాయంగా మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

First Published:  26 Oct 2023 7:31 AM GMT
Next Story