Telugu Global
Business

OPPO Reno 8: నేటి నుంచి అమ్మకాలు ప్రారంభమైన ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వారం రోజుల క్రితమే ప్రీబుకింగ్ మొదలైన ఈ ఫోన్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్‌లతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

OPPO Reno 8: నేటి నుంచి అమ్మకాలు ప్రారంభమైన ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
X

ప్రతీ రోజు మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడల్ ఫోన్లు వస్తుంటాయి. చాలా వరకు ఫోన్లలో చిన్న చిన్న ఫీచర్లను మార్చి కొత్త మోడల్ పేరుతో మార్కెట్లోకి పంప్ చేస్తుంటారు. ముఖ్యంగా చైనా కంపెనీలు రెండు వారాలకు ఒక కొత్త మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో వినియోగదారుడికి ఏ ఫోన్ ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. చైనాకు చెందిన పలు కంపెనీలు ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పెట్టి ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. వీటిలో వన్ ప్లస్, ఒప్పో, వివో, రియల్ మీ వంటి బ్రాండ్లు ప్రజలకు చేరువయ్యాయి.

వన్ ప్లస్ ఫోన్లు చూడటానికి మంచి క్లాసీ లుక్‌తో ఉండటమే కాకుండా అద్భుతమైన కెమెరా ఆప్షన్లను కలిగి ఉన్నది. కానీ ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఒప్పో బ్రాండ్ కూడా మంచి కెమెరా నాణ్యత కలిగిన ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తీసుకొని వచ్చిందే ఒప్పో రినో 8 (OPPO Reno 8). దీన్ని పోట్రయట్ ఎక్స్‌ప్రెస్ (The Potrait Express) అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఒప్పో నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ ఫోన్ ఇది. ఇందులో అద్భుతమైన కెమెరాలను అమర్చడంతో అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. వారం రోజుల క్రితమే ప్రీబుకింగ్ మొదలైన ఈ ఫోన్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్‌లతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

ఫీచర్లు ఇవే..

ఒప్పో రినో 8లో అందరూ ఆసక్తికరంగా గమనిస్తున్నది పవర్ ఫుల్ కెమెరాల గురించే. సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్‌తో పని చేసే 50 మెగాపిక్సల్ కెమెరాను వెనుకవైపు అమర్చారు. ఇది ప్రధాన కెమెరాగా పనిచేస్తుంది. ముందువైపు సోనీ ఐఎంఎక్స్ 709 ఆర్జీబీడబ్ల్యూ సెన్సార్ 32 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. అద్భుతమైన సెల్ఫీలను తీయడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. వెనుక కెమెరాలకు సోనీ సెన్సార్ ఉన్నాయి. దీంతో అందమైన పోట్రయట్స్, వీడియోలు రూపొందించుకోవచ్చు. డీఓఎల్-హెచ్‌డీఆర్ టెక్నాలజీ ఈ కెమెరాల సొంతం. ఇవి వీడియో డైనమిక్ రేంజ్‌ను కూడా మెరుగుపరుస్తాయి. అల్ట్రానైట్ వీడియో ఫీచర్ ఇందులో చెప్పుకోదగిన మరో అంశం. ఏఐ పొట్రయట్ రీటచింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నది.

బ్యాట‌రీ..

ఇక 80 వాట్స్ సూపర్VOOC ఫ్లాష్ చార్జర్‌తో కేవలం 28 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ చేయవచ్చు. ఇందులో 4500mAh బ్యాటరీని అమర్చారు. హెల్త్ ఇంజిన్ టెక్నాలజీ కారణంగా నాలుగేళ్ల పాటు బ్యాటరీ జీవితం తగ్గకుండా ఉంటుంది. దీన్ని 1600 సార్లు ఫుల్‌గా చార్జ్ చేసుకోవచ్చని ఒప్పో ప్రామిస్ చేస్తోంది.

ఇక ఒప్పో రెనో8లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్, 8జీబీ ప్రాసెసర్, 128 జీబీ రోమ్‌తో వస్తుంది. ఇదే శ్రేణిలోని మిగతా ఫోన్‌ల కన్నా.. ఇది 40 శాతం అధిక స్పీడ్, 20 శాతం అధిక పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా 90Hz రీఫ్రెష్ రేట్ కారణంగా.. గేమింగ్‌కు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుందని తయారీదారులు చెప్తున్నారు. ఈ ఫోన్ వేడెక్కితే చల్లబర్చడానికి సూపర్ కండక్టీవ్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. ఇది మిగిలిన ఫోన్ల కంటే 1.5 రెట్ల వేగంతో చల్లబడుతుంది.

ఒప్పో రినో 8 ఫోన్ 6.4 అంగులాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. కలర్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. కాల్ వచ్చినప్పుడు కేవలం చేతి సంజ్ఞలతో మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఉన్నది. 5జీ నెట్‌వర్క్ పై కూడా ఈ ఫోన్ పని చేస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ. 29,999కి లభిస్తున్న ఈ ఫోన్‌తో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ వెర్షన్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.

First Published:  25 July 2022 8:47 AM GMT
Next Story