Telugu Global
Business

పర్మినెంట్ రిమోట్ జాబ్స్ కోసం ఇక్కడ వెతకొచ్చు!

కోవిడ్ తర్వాతి నుంచి రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ట్రెండ్స్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నెలలో కొన్నిరోజులపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా అచ్చంగా రిమోట్ వర్క్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలు బోలెడు ఉన్నాయి.

పర్మినెంట్ రిమోట్ జాబ్స్ కోసం ఇక్కడ వెతకొచ్చు!
X

కోవిడ్ తర్వాతి నుంచి రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ట్రెండ్స్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నెలలో కొన్నిరోజులపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా అచ్చంగా రిమోట్ వర్క్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలు బోలెడు ఉన్నాయి. ఇలాంటి అవకాశాల కోసం ఎక్కడ వెతకాలంటే..

రిమోట్ వర్క్ అంటే దూరంగా ఉంటూ పనిచేయడం అన్న మాట. అంటే ఆఫీసుకే వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉంటే ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు. ఇంట్లో ఉంటూ లేదా ప్రయాణిస్తూ కూడా పనిచేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలను అందించే కొన్ని ఆన్‌లైన్ జాబ్ ప్లాట్‌ఫామ్స్ ఇవీ..

అప్ వర్క్

‘అప్‌వర్క్ డాట్ కామ్’ (upwork.com) అనే వెబ్‌సైట్ ఫ్రీ ల్యాన్సర్లకు మంచి ప్లాట్‌ఫామ్‌గాఉంటూ వస్తోంది. ఇందులో సాఫ్ట్ వేర్ డెవలపర్ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకూ, మార్కెటింగ్ నుంచి ఏఐ సర్వీసెస్‌ వరకూ.. అన్నిరకాల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. రెజ్యూమె, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగావకాశాలు పొందొచ్చు.

రిమోట్ ఓకే

‘రిమోట్‌ఓకే డాట్ కామ్’ ( remoteok.com) అనే ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటీ, కస్టమర్‌ సపోర్ట్‌, డిజిటల్ మార్కెటింగ్‌, డిజైన్‌.. ఇతర రంగాలకు చెందిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ స్థాయిని బట్టి పెద్ద శాలరీలున్న ఉద్యోగాలు కూడా దొరుకుతాయి.

ఫ్లెక్స్ జాబ్స్

‘ఫ్లెక్స్‌జాబ్స్ డాట్ కామ్’ (flexjobs.com) అనే ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటీ, డిజైనింగ్, కంటెంట్, ఫైనాన్స్.. ఇలా బోలెడు రంగాలకు చెందిన ఉద్యోగాలను వెతకొచ్చు. విద్యార్హత, ఇంటర్వ్యూ ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందొచ్చు.

రిమోట్ డాట్ కో

‘రిమోట్ డాట్ కో’ (remote.co) అనే ప్లాట్‌ఫామ్ ద్వారా డేటా ఎంట్రీ, కంటెంట్ ట్రాన్స్‌లేషన్, రిమోట్ హెల్త్‌ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్‌ వంటి రంగాలకు చెందిన రకరకాల ఉద్యోగాలను వెతుక్కోవచ్చు.

వి వర్క్ రిమోట్ లీ

‘వి వర్క్ రిమోట్ లీ’ (weworkremotely.com) అనే వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటింగ్, కాపీరైటింగ్‌, మార్కెటింగ్‌, డిజైనింగ్, ప్రోగ్రామ్ డెవలపింగ్ వంటి ఉద్యోగాల కోసం సెర్చ్ చేయొచ్చు. ఇందులో రిమోట్ వర్క్‌తో పాటు పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ అవకశాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక వీటితోపాటు ‘నౌకరీ’, ‘ఇన్‌డీడ్’ వంటి జాబ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ‘ప్రిఫరెన్సెస్’ విభాగంలో రిమోట్ వర్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా రిమోట్ వర్క్ అవకాశాలను వెతుక్కోవచ్చు.

First Published:  26 Oct 2023 4:28 AM GMT
Next Story