Telugu Global
Business

త్వ‌ర‌లో యూపీఐతో క్యాష్ డిపాజిట్ కూడా

యూపీఐతో పేమెంట్స్ మాత్ర‌మే కాదు.. త్వ‌రలో క్యాష్ డిపాజిట్ చేసేందుకూ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

త్వ‌ర‌లో యూపీఐతో క్యాష్ డిపాజిట్ కూడా
X

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) నాలుగైదేళ్ల‌లోనే విస్తృతంగా జ‌నంలోకి వెళ్లిపోయింది. ఫోన్‌పే, పేటీఎం, భార‌త్‌పే ఇలా పేరేదైనా యూపీఐ లేని రోజును ఊహించ‌డం ఇవాళ క‌ష్టంగా ఉంది. అలాంటి యూపీఐని మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు ఆర్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తోంది. యూపీఐతో పేమెంట్స్ మాత్ర‌మే కాదు.. త్వ‌రలో క్యాష్ డిపాజిట్ చేసేందుకూ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

సీడీఎంల ద్వారా సాధ్యం

బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ కోసం భారీ క్యూల‌ను నియంత్రించేందుకు క్యాష్ డిపాజిట్ మెషిన్ (సీడీఎం)ల‌ను ఆర్‌బీఐయే తీసుకొచ్చింది. సీడీఎంల్లో బ్యాంకు ఎకౌంట‌ర్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి లేదంటే డెబిట్ కార్డుతో ఓపెన్ చేసి క్యాష్ వేయొచ్చు. ఇప్పుడు అదే సీడీఎంల ద‌గ్గ‌ర క్యాష్ కాకుండా యూపీఐ ద్వారా మ‌నీ డిపాజిట్ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామంటోంది ఆర్‌బీఐ. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా త్వ‌ర‌లోనే తీసుకొస్తామ‌ని చెప్పింది.

First Published:  5 April 2024 8:56 AM GMT
Next Story