Telugu Global
Business

SUV Car Sales | ఎస్‌యూవీల్లో మేటి క్రెటా.. నెక్సాన్‌, బ్రెజా ఔట్‌.. `మూడంకె`తోనే మారుతి స‌రి!

SUV Car Sales: ఎస్‌యూవీల్లో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్స్‌గా హ్యుండాయ్ మోటార్ ఇండియా క్రెటా నిలిస్తే, మూడు మారుతి సుజుకి కార్లు - బ్రెజా, ఫ్రాంక్స్‌, గ్రాండ్ విటారా నిలిచాయి.

SUV Car Sales | ఎస్‌యూవీల్లో మేటి క్రెటా.. నెక్సాన్‌, బ్రెజా ఔట్‌.. `మూడంకె`తోనే మారుతి స‌రి!
X

SUV Car Sales | ఎస్‌యూవీల్లో మేటి క్రెటా.. నెక్సాన్‌, బ్రెజా ఔట్‌.. `మూడంకె`తోనే మారుతి స‌రి!

SUV Car Sales | క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా కుటుంబం అంతా కూర్చుని హాయిగా ప్ర‌యాణించేందుకు వీలుగా ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ) అంటే మోజు పెంచుకుంటున్నారు. గ‌తంతో పోలిస్తే ఎస్‌యూవీ కార్ల‌కు గిరాకీ పెర‌గ‌డంతోపాటు సెమీ కండ‌క్ట‌ర్ల స‌ర‌ఫ‌రా మెరుగ‌వ్వ‌డంతో గ‌త నెల‌లో కార్ల విక్ర‌యాల్లో ఆల్‌టైం రికార్డు న‌మోదైంది. గ‌త నెల‌లో 3,34,802 కార్లు అమ్ముడు కాగా, వాటిల్లో ఎస్‌యూవీల‌దే 47 శాతం వాటా. ఎస్‌యూవీల్లో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్స్‌గా హ్యుండాయ్ మోటార్ ఇండియా క్రెటా నిలిస్తే, మూడు మారుతి సుజుకి కార్లు - బ్రెజా, ఫ్రాంక్స్‌, గ్రాండ్ విటారా నిలిచాయి.

హ్యుండాయ్ మోటార్స్ (క్రెటా, వెన్యూ), టాటా మోటార్స్ (నెక్సాన్‌, పంచ్‌), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (స్కార్పియో, బొలెరో), కియా సొనెట్ కూడా బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న‌ది. గ‌త నెల‌లో అత్య‌ధికంగా 14,449 క్రెటా కార్లు అమ్ముడ‌య్యాయి. త‌ర్వాతీ స్థానాల్లో టాటా నెక్సాన్ 14,423 యూనిట్లు, మారుతి సుజుకి బ్రెజా 13,398 కార్లు నిలిచాయి.

11,124 కార్ల సేల్స్‌తో టాటా పంచ్ స్పూర్తి దాయ‌కంగా నిలిచింది. 10,213 కార్లు విక్ర‌యించిన హ్యుండాయ్ వెన్యూ కంటే టాటా పంచ్ ఒక మెట్ట‌పైనే ఉంది. ఇటీవ‌లే మార్కెట్లోకి విడుద‌లైన మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడ‌ల్ సైతం 9,863 యూనిట్లు అమ్ముడు కావ‌డంతో త‌నదైన మార్క్ చూపింది.

ఇక మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రాలో పాపుల‌ర్ ఎస్‌యూవీ మోడ‌ల్ (స్కార్పియో ఎన్‌, క్లాసిక్‌) 9,318 యూనిట్ల సేల్స్‌తో అద‌ర‌గొట్టింది. గ‌తేడాది మారుతి సుజుకి మార్కెట్లోకి తీసుకొచ్చిన గ్రాండ్ విటారా మోడ‌ల్ కార్లు కూడా అద్భుతంగా 8,877 యూనిట్లు సేల్ అయ్యాయి. ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ కియా మోటార్‌కు చెందిన సొనెట్ 8,251 యూనిట్లు విక్ర‌యించింది. మ‌రోవైపు, ఎల్లవేళ‌లా మహీంద్రా రిల‌య‌బుల్ ఎస్‌యూవీ బొలెరో 8,170 యూనిట్ల‌తో టాప్‌-10లో చివ‌రి స్థానంలో నిలిచింది.

మే నెల‌లో అమ్ముడైన బెస్ట్ ఎస్‌యూవీలు

హ్యుండాయ్ క్రెటా - 14,449 యూనిట్లు

టాటా నెక్సాన్‌ - 14,423 యూనిట్లు

మారుతి సుజుకి బ్రెజా - 13,398 యూనిట్లు

టాటా పంచ్ - 11,124 యూనిట్లు

హ్యుండాయ్ వెన్యూ - 10,213 యూనిట్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ - 9,863 యూనిట్లు

మ‌హీంద్రా స్కార్పియో - 9,318 యూనిట్లు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా - 8,877 యూనిట్లు

కియా సొనెట్‌ - 8,251 యూనిట్లు

మ‌హీంద్రా బొలెరో - 8,170 యూనిట్లు

First Published:  11 Jun 2023 5:32 AM GMT
Next Story