Telugu Global
Business

జాబ్ సెర్చ్‌లో ఉన్నారా.. ఈ నెట్‌వర్క్ యాప్స్ ట్రై చేయండి!

కొత్త జాబ్ కోసం చూస్తున్నవారికి నెట్‌వర్క్ అనేది ఎంతో ముఖ్యం. ఉదాహరణకు మీకు తెలిసిన ఒక కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంది. కానీ, దాని అవసరం మీకు లేదు. అయితే వేరే ఎవరికో దాని అవసరం ఉండొచ్చు.

జాబ్ సెర్చ్‌లో ఉన్నారా.. ఈ నెట్‌వర్క్ యాప్స్ ట్రై చేయండి!
X

జాబ్ సెర్చ్‌లో ఉన్నారా.. ఈ నెట్‌వర్క్ యాప్స్ ట్రై చేయండి!

కొత్త జాబ్ కోసం చూస్తున్నవారికి నెట్‌వర్క్ అనేది ఎంతో ముఖ్యం. ఉదాహరణకు మీకు తెలిసిన ఒక కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంది. కానీ, దాని అవసరం మీకు లేదు. అయితే వేరే ఎవరికో దాని అవసరం ఉండొచ్చు. మరి ఆ విషయం వాళ్లకి తెలిసేదెలా? దీనికోసమే కొన్ని నెట్‌వర్క్ యాప్స్ ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నాయి? మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎలాంటి ఉద్యోగస్తులున్నారు? అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ యాప్స్‌ ఉపయోగపడతాయి.

కోరుకున్న కెరీర్ కావాలంటే దానికి సంబంధించిన వారితో పరిచయాలు ఏర్పడాలి. నెట్‌వర్క్ ఎంత పెద్దదిగా ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి. నెట్‌వర్క్ బిల్డింగ్ కోసం వాడాల్సిన కొన్ని యాప్స్ ఇవీ..

ఇన్వైట్‌లీ

ఇదొక ఆండ్రాయిడ్ యాప్. ఈ యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా జాబ్ చేస్తున్న వారికి, జాబ్ మారాలనుకుంటున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్‌, లింక్డ్‌ఇన్‌ ద్వారా ఈ యాప్‌లో సైన్‌ఇన్‌ అవ్వొచ్చు. ఒకసారి లాగిన్‌ అయిన తర్వాత మీ ప్రాంతంలో జరిగే వివిధ ఈవెంట్‌ల గురించి స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. ఆయా ఈవెంట్స్‌లో జాయిన్‌ అయ్యి రకరకాల వ్యక్తులను కలిసి కెరీర్ అవకాశాలు పెంచుకోవచ్చు.

షేపర్

ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ యాప్. ఇందులోకి లాగిన్ అవ్వగానే మీ ప్రొఫెషనల్ స్కిల్స్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేయగానే మీ స్కిల్స్‌కు తగ్గట్టుగా సంబంధిత నెట్‌వర్క్‌లోని అందర్నీ మీ ముందు ఉంచుతుంది. మీరు ఏం చేయగలరు? ఎలాంటి కెరీర్‌‌, ఉద్యోగాన్ని కోరుకుంటున్నారు? అనేవి ఇందులో జత చేస్తే.. ఆయా అవసరాలున్న వాళ్లను మీకు పరిచయం చేస్తుంది. ఈ యాప్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అవకాశాలు రాబట్టుకోవచ్చు.

సిటీ అవర్

ఇది ఐఓఎస్ యాప్. ఈ యాప్ ద్వారా ఒకే ఆలోచనలు కలిగి ఉన్న వాళ్లందరూ ఒకే చోట కలుసుకోవచ్చు. ఖర్చు లేకుండా ఒక్క క్లిక్‌తో మీటింగ్, ఈవెంట్ వంటివి కండక్ట్ చేయొచ్చు. ఈ యాప్.. మీ ఆలోచనలతో, మీకు దగ్గరలో ఉన్న ప్రొఫైల్స్‌ను మీకు చూపిస్తుంది. మీరు యాప్ ద్వారా ఒక ఈవెంట్ క్రియేట్ చేసి. ఒక ప్లేస్ నిర్ణయి౦చొచ్చు. ‘నాకు ఓ బిజినెస్ ఐడియా ఉంది. కలిసి మాట్లాడుకుందామా?’ అని అందరిని ఇన్వైట్ చేయొచ్చు. అందరూ ఒక దగ్గరకు చేరాక మీకున్న స్టార్టప్ ఐడియాస్ లాంటివి షేర్ చేసుకోవచ్చు. అలా నెట్‌వర్క్‌ని పెంచుకోవచ్చు.

ఫుల్ కాంటాక్ట్

ఇది ఉద్యోగం చేస్తున్న వాళ్లకు, ఉద్యోగం మారాలన్న వాళ్లకు చాలా ఉపయోగపడే యాప్. ఇది ఆండ్రాయిడ్, యాపిల్, వెబ్‌లో కూడా ఉంటుంది. ఇందులో మీకు సంబంధించి అన్ని విభాగాల్లోని కాంటాక్ట్స్‌ను ఇది ట్రేస్ చేస్తుంది. ఇప్పటి దాకా ఎన్ని జాబ్స్ మారారు? ఎవరి దగ్గర చేసారు? అందులో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరు? ఇలా.. మీకు కాస్త పరిచయం ఉన్న ఏ విభాగాన్ని ఇది వదలదు. ఏ చిన్న లింక్ ఉన్నా దానికి సంబందించిన కాంటాక్ట్స్ అన్ని మీ ముందు ఉంచుతుంది. దాన్ని బట్టి ఎక్కడ మీ అవసరం ఉందో సులభంగా తెలుసుకునే వీలుంటుంది.

First Published:  26 Aug 2023 10:32 AM GMT
Next Story