Telugu Global
Business

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌లో బెస్ట్ డీల్స్ ఇవే..

అక్టోబర్‌ 8 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఫెస్టివల్ సేల్స్ షురూ అవుతున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో పాటు అనేక వస్తువులపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌లో బెస్ట్ డీల్స్ ఇవే..
X

అక్టోబర్‌ 8 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఫెస్టివల్ సేల్స్ షురూ అవుతున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో పాటు అనేక వస్తువులపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేస్తే..

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో ఐఫోన్లు, వన్‌ప్లస్, ఐకూ, రియల్ మీ, శాంసంగ్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లతో పాటు శాంసంగ్‌, వన్‌ప్లస్‌, సోనీ, ఎల్‌జీ, షావోమీ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలపై బోలెడు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

మొబైల్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11 ఆర్, ఐఫోన్ 13, ఐకూ నియో 7 ప్రో, మోట రేజర్ 40 అల్ట్రా, రియల్‌మీ నార్జో 60 ప్రో, ఐకూ జెడ్ 7 ప్రో, హానర్ 90 ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. వీటితోపాటు మిడ్ రేంజ్ ఫోన్లలో శాంసంగ్ ఎం34, వన్ ప్లస్ నార్డ్ సీఈ3, రియల్ మీ 60 5జీ మోడల్స్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. బ్రాండ్‌ను బట్టి 17 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్‌ ఉన్నాయి. మొబైల్స్‌ ధరల వివరాలు అక్టోబర్ 8 న రివీల్ అవుతాయి.

టీవీల విషయానికొస్తే.. రెడ్‌మీ 43 ఇంచెస్ 4కే టీవీ.. సేల్‌లో భాగంగా రూ.20,499కే లభించనుంది. దీని అసలు ధర రూ.42,999. వన్‌ప్లస్‌ టీవీ 43 వై1ఎస్‌ ప్రో.. సేల్‌లో రూ.26,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.39,999. ఎల్‌జీ 50 ఇంచెస్ 4కే టీవీ.. సేల్‌లో రూ.40,990 కి లభించనుంది. దీని అసలు ధర రూ.60,990. శాంసంగ్‌ క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌టీవీ.. సేల్‌లో రూ.32,990కే లభించనుంది. దీని అసలు ధర రూ.52,900. సోనీ బ్రావియా 65 ఇంచెస్ 4కే టీవీ.. సేల్‌లో భాగంగా రూ.82,990కు లభించనుంది. దీని అసలు ధర రూ.1,39,900. అంతేకాదు టీవీలపై నో-కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే హానర్ మ్యాజిక్ బుక్ 14 పై 47 శాతం తగ్గింపు, ఆసుస్ టఫ్ గేమింగ్ ఎఫ్1 ల్యాప్‌టాప్‌పై 31 శాతం తగ్గింపు లభిస్తుంది.

వీటితో పాటు అమెజాన్ అలెక్సా డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, అలెక్సా స్మార్ట్ హోం డివైజ్‌లు, హోమ్ అప్లయన్సెస్, క్లాతింగ్, ఫుట్‌వేర్‌ పై కూడా రకరకాల డిస్కౌంట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డులతో పేమెంట్ చేస్తే అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ విషయానికొస్తే.. ఈ సేల్‌లో ఐఫోన్‌ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ వంటి మొబైల్స్‌తో పాటు వివిధ ఎలక్ట్రానిక్, ఫ్యాషన్‌, బ్యూటీ, హోమ్ అప్లయన్సెస్‌పై ఆఫర్లు ఉన్నాయి.

మొబైల్స్‌లో ఐఫోన్‌ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా, శాంసంగ్‌ గెలాక్సీ ఏ34, పోకో ఎక్స్‌5 ప్రో, పోకో ఎఫ్‌5, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్‌ 40, మోటోరోలా జీ54, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 వంటి మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉండనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా బిగ్‌ బిలియన్‌ సేల్‌లో నథింగ్‌, పిక్సెల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ లభించే వీలుంది. నథింగ్ రీసెంట్‌గా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్2 రూ.32,999కు లభించనుంది. దీని అసలు ధర రూ.44,999. గూగుల్ పిక్సెల్ 7 రూ.36,499కే లభించనుంది. దీని అసలు ధర రూ.59,999

వీటితోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్‌ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం, ఫుట్‌వేర్ క్లాతింగ్, జువెలరీ పై 50 నుంచి 90 శాతం, బ్యూటీ ప్రోడక్ట్స్‌పై 60- నుంచి 80శాతం, హోమ్‌ డెకర్‌ కేటగిరీలో 80 శాతం, ఫర్నీచర్‌పై 85శాతం, రిఫ్రిజిరేటర్లపై 70శాతం, 4కే స్మార్ట్‌ టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. వాషింగ్‌ మెషీన్లు ధర రూ.5,000 నుంచే లభించనున్నట్లు తెలిపింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై అదనపు బ్యాంక్ ఆఫర్ ఉంటుంది.

First Published:  3 Oct 2023 6:00 AM GMT
Next Story