Telugu Global
Business

బడ్జెట్‌లో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..

మొబైల్‌లో కెమెరా పెర్ఫామెన్స్ బాగుండాలంటే రెజల్యూషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, కెమెరాను ప్రాసెస్ చేయగల చిప్‌సెట్, మెరుగైన సెన్సర్, స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉండాలి. అలాంటి ఫీచర్లు ఉన్న కొన్ని ఫోన్స్ ఇవి.

బడ్జెట్‌లో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..
X

ఇప్పటి మొబైల్స్‌లో లేని ఫీచర్ అంటూ లేదు. తక్కువ ధరకే అన్నిరకాల ప్రొఫెషనల్ ఫీచర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా మొబైళ్లలోని కెమెరాలు ప్రొఫెషనల్ కెమెరాలను తలపిస్తున్నాయి. అచ్చంగా కెమెరా పెర్ఫామెన్స్ కోసం మొబైల్ తీసుకోవాలనుకునేవాళ్లు ఈ బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయొచ్చు.

మొబైల్‌లో కెమెరా పెర్ఫామెన్స్ బాగుండాలంటే రెజల్యూషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, కెమెరాను ప్రాసెస్ చేయగల చిప్‌సెట్, మెరుగైన సెన్సర్, స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉండాలి. అలాంటి ఫీచర్లు ఉన్న కొన్ని ఫోన్స్ ఇవి.

శాంసంగ్ ఎఫ్‌34– 5జీ

‘శాంసంగ్ ఎఫ్‌34 5జీ’ మొబైల్.. 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌‌తో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. అంటే కదులుతూ ఫోటోలు/వీడియో తీసినా ఇమేజ్ బ్లర్ అవ్వకుండా స్పష్టంగా వస్తుంది. ఇది శాంసంగ్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ధర రూ. 18,999.

వివో టీ2 5జీ

రూ. 17,999 ధరకు లభించే ‘వివో టీ2 5జీ’ ఫోన్‌లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరాలున్నాయి. ఇది క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. అన్ని రకాల కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. తక్కువ లైటింగ్‌లో కూడా మంచి ఫోటోలు తీయగలదు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ

‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ’ మొబైల్‌లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2 ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరాలున్నాయి. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ధర రూ. 19,999 ఉంది.

పోకో ఎక్స్5 ప్రో

‘పోకో ఎక్స్5 ప్రో’ మొబైల్‌లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలున్నాయి. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ధర రూ.18,499.

రియల్‌మీ నార్జో 60 5జీ

‘రియల్‌మీ నార్జో 60 5జీ’ ఫోన్‌లో 64ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరాతోపాటు 2 ఎంపీ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. దీని కలర్ క్యాప్చరింగ్ బాగుంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో అన్నిరకాల లేటెస్ట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 17,999.

మోటోజీ82 5జీ

రూ.19,999కి లభించే ‘మోటో జీ82 5జీ’ మొబైల్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా సెటప్ ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది.

First Published:  26 Nov 2023 11:09 AM GMT
Next Story