Telugu Global
Business

పదివేల లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్స్ లిస్ట్ మీకోసం!

మెరుగైన పర్ఫామెన్స్, మంచి కెమెరా, ప్రాసెసర్ కలిగి ఉండి రూ. 10,000 లోపు బడ్జెట్‌లో లభించే మొబైల్స్ చాలానే ఉన్నాయి. అయితే వాటిలో ఈ ఏడాది బాగా అమ్ముడైన, మంచి రేటింగ్స్ కలిగిన ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

పదివేల లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్స్ లిస్ట్ మీకోసం!
X

న్యూ ఇయర్ సందర్భంగా తక్కువ బడ్జెట్‌లో మంచి 5జీ/4జీ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ లిస్ట్‌పై ఓ లుక్కేయండి!

మెరుగైన పర్ఫామెన్స్, మంచి కెమెరా, ప్రాసెసర్ కలిగి ఉండి రూ. 10,000 లోపు బడ్జెట్‌లో లభించే మొబైల్స్ చాలానే ఉన్నాయి. అయితే వాటిలో ఈ ఏడాది బాగా అమ్ముడైన, మంచి రేటింగ్స్ కలిగిన ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

పోకో ఎం 6 ప్రో 5జీ

షావోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో నుంచి రిలీజైన ‘పోకో ఎం6 ప్రో 5జీ’ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఆక్టాకోర్ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సె్ల్ కెమెరా ఉంటుంది. 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది బేసిక్ లెవల్ గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.10,999.



లావా బ్లేజ్ 5జీ

దేశీయ మొబైల్ బ్రాండ్ అయిన లావా నుంచి రిలీజైన ‘లావా బ్లేజ్ 5జీ’ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్‌ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 1 టీబీ స్టోరేజ్ వరకూ సపోర్ట్ చేస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 9,299.



రెడ్‌మీ 13సీ5జీ

మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌‌పై పనిచేసే ‘రెడ్‌మీ 13సీ 5జీ’ మొబైల్ లో 50ఎంపీ కెమెరాతోపాటు 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 8,999.



రియల్ మీ 9 5జీ

‘రియల్ మీ 9 5జీ’ మొబైల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టాకోర్ ప్రాసెసర్‌‌పై పని చేస్తుంది. ఇందులో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.



శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 04

రూ. 7,499కే లభించే ‘శాంసంగ్ ఎమ్ 04’ మొబైల్ లో 13ఎంపీ, 12ఎంపీ, 2 ఎంపీతో కూడిన మూడు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇందులో 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇది 5జీని సపోర్ట్ చేయదు.



మోటొరోలా జీ14

‘మోటోరోలా జీ 14’ ఫోన్ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది యనిసాక్ టీ616 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. దీని ధర రూ.9,000.




First Published:  27 Dec 2023 6:30 AM GMT
Next Story