Telugu Global
Business

నేరుగా క‌స్ట‌మ‌ర్ల‌కు రుణ ప‌ర‌ప‌తి.. యాక్సిస్ బ్యాంక్ ఏం చేసిందంటే..?

`యూపీఐ యాప్‌పై రుణ ప‌ర‌ప‌తి` క‌ల్పించ‌డానికి ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్.. క్రెడిట్ కార్డ్ యాప్ (కివీ క్రెడిడ్‌కార్డు)తో జ‌త క‌ట్టింది.

నేరుగా క‌స్ట‌మ‌ర్ల‌కు రుణ ప‌ర‌ప‌తి.. యాక్సిస్ బ్యాంక్ ఏం చేసిందంటే..?
X

నేరుగా క‌స్ట‌మ‌ర్ల‌కు రుణ ప‌ర‌ప‌తి.. యాక్సిస్ బ్యాంక్ ఏం చేసిందంటే..?

`యూపీఐ యాప్‌పై రుణ ప‌ర‌ప‌తి` క‌ల్పించ‌డానికి ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్.. క్రెడిట్ కార్డ్ యాప్ (కివీ క్రెడిడ్‌కార్డు)తో జ‌త క‌ట్టింది. త‌మ రూపే క్రెడిట్ కార్డు యూజ‌ర్ల‌కు వ‌న్ టైం సొల్యూష‌న్ చూప‌డ‌మే కివీ క్రెడిట్ కార్డ్ యాప్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. క్రెడిట్ కార్డు మార్కెట్‌లో నేరుగా ఖాతాదారుడికి రుణ ప‌ర‌ప‌తి క‌ల్పించాల‌న్న‌దే కివి యాప్ ల‌క్ష్యం. క్రెడిట్ ప‌ర‌ప‌తి ఉప‌యోగించుకున్న క‌స్ట‌మ‌ర్లు సుర‌క్షిత ప‌ద్ద‌తుల్లో క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు ఖాతా-వ‌యా ఫోన్ ద్వారా రుణం చెల్లించ‌వ‌చ్చు.

కివి క్రెడిట్ కార్డు యాజ‌మాన్యం త‌న ఖాతాదారుల‌కు త‌క్ష‌ణం డిజిట‌ల్ రూపే క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది. దాన్ని యూజ‌ర్లు మొబైల్ యాప్ ద్వారా రూపే కార్డు, యూపీఐతో లింక్ చేయొచ్చు. అటుపై స‌ద‌రు ఖాతాదారుల‌కు కివి యాప్‌.. `యూపీఐపై రుణ‌ప‌ర‌ప‌తి`, క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు అందిస్తుంది. కివి క్రెడిట్ కార్డ్ యూపీఐ యాప్ సాయంతో క‌స్ట‌మ‌ర్లు త‌మ క్రెడిట్ కార్డు లిమిట్ ఖ‌రారు చేసుకునేందుకు, కార్డు బ్లాక్ చేసేందుకు అనుమ‌తి ఇస్తుంది.

ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో కివి క్రెడిట్ కార్డు యాప్ కూడా ఉంది. మీరు కివి రూపే క్రెడిట్ కార్డు సాయంతో యూపీఐ యాప్‌పై మీ పేరు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అందుకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూపీఐ యాప్‌పై కివి రూపే క్రెడిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.రూపే క్రెడిట్ కార్డుతో రిజిస్ట‌ర్ అయిన మొబైల్ ఫోన్ నంబ‌ర్‌తో సైన్ అప్ కావాలి.

క‌స్ట‌మ‌ర్ల‌కు యూపీఐపై క్రెడిట్ వ‌స‌తి క‌ల్ప‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు కివి క్రెడిట్ కార్డ్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించింది. బ్యాంకుల స‌హ‌కారంతో రూపే క్రెడిట్ కార్డుల‌తో క‌స్ట‌మ‌ర్లు `యూపీఐపై క్రెడిట్‌`తో ల‌బ్ధి పొందేందుకు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నుంచి ధృవీక‌ర‌ణ ప‌త్రం పొందిన తొలి యాప్ కివి క్రెడిట్ కార్డు. వ‌చ్చే 18 నెల‌ల్లో 10 ల‌క్ష‌ల మందికి యూపీఐపై క్రెడిట్ స‌ర్వీసులు అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.

First Published:  11 Jun 2023 6:31 PM GMT
Next Story