Telugu Global
Business

Adani Group-Hindenburg | అదానీకి మ‌ళ్లీ షార్ట్‌సెల్ల‌ర్ హిండెన్‌బ‌ర్గ్ షాక్‌.. అస‌లేం జ‌రుగుతోంది?!

Adani Group-Hindenburg | అప‌ర కుబేరుడు గౌతం అదానీ సార‌ధ్యంలోని అదానీ గ్రూపు (Adani Group) సంస్థ‌ల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

Adani Group-Hindenburg | అదానీకి మ‌ళ్లీ షార్ట్‌సెల్ల‌ర్ హిండెన్‌బ‌ర్గ్ షాక్‌.. అస‌లేం జ‌రుగుతోంది?!
X

Adani Group-Hindenburg | అదానీకి మ‌ళ్లీ షార్ట్‌సెల్ల‌ర్ హిండెన్‌బ‌ర్గ్ షాక్‌.. అస‌లేం జ‌రుగుతోంది?!

Adani Group-Hindenburg | అప‌ర కుబేరుడు గౌతం అదానీ సార‌ధ్యంలోని అదానీ గ్రూపు (Adani Group) సంస్థ‌ల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అదానీ గ్రూపు సంస్థ‌ల‌తో అమెరిక‌న్ ఇన్వెస్ట‌ర్ల సంప్ర‌దింపుల‌పై అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు (US authorities) విచార‌ణ చేప‌ట్ట‌నున్నాయ‌ని వార్త‌లొచ్చాయి. దీంతో శుక్ర‌వారం దేశీయ మార్కెట్ల‌లో అదానీ గ్రూప్ (Adani Group) షేర్లు ప‌ది శాతం వ‌ర‌కు న‌ష్ట‌పోయాయి. బీఎస్ఈలో అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ (Adani Enterprises) షేర్ 10 శాతం న‌ష్టంతో రూ.2162 వ‌ద్ద‌కు, అదానీ పోర్ట్స్ (AdaniPorts), అదానీ ప‌వ‌ర్ (Adani Power), అదానీ ట్రాన్స్‌మిష‌న్ (Adani Transmission) స్టాక్స్ ఐదు శాతానికి పైగా, అదానీ టోట‌ల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ గ్రీన్ ఎన‌ర్జీ (Adani Green Energy), అదానీ విల్మార్ (Adani Wilmar) మూడు శాతానికి పైగా ప‌త‌నం అయ్యాయి.

అదానీ గ్రూప్ సంస్థ‌ల్లో ఇటీవ‌లి కాలంలో భారీ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టిన అమెరిక‌న్ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో గ‌ల యూఎస్ అటార్నీ ఆఫీసు నోటీసులు పంపిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ కూడా ఇటువంటి దర్యాప్తే చేప‌ట్టిన‌ట్లు అభిజ్ఞ వ‌ర్గాల భోగ‌ట్టా. ఇటువంటి నోటీసుల ఆధారంగా సంబంధిత ఇన్వెస్ట‌ర్ల‌పై సివిల్‌, క్రిమిన‌ల్ కేసులను అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు న‌మోదు చేయ‌డం లేద‌ని అధికార వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ బ్లూంబ‌ర్గ్ ఓ వార్తాక‌థ‌నం ప్ర‌చురించింది. ఈ విష‌య‌మై త‌మ‌కు ఎటువంటి స‌మాచారం లేద‌ని అహ్మ‌దాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తున్న అదానీ గ్రూప్ అధికార ప్ర‌తినిధి పేర్కొన్నారు.

జ‌న‌వ‌రి నెలాఖ‌రులో షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) వెల్ల‌డించిన నివేదికతో అదానీ గ్రూప్ సంస్థ‌లు కకావిక‌ల‌మ‌య్యాయి. ప‌న్నుకు స్వ‌ర్గ‌ధామాలుగా భావిస్తున్న మ‌లేషియా, వంటి దేశాల్లో డొల్ల సంస్థ‌ల‌తో అదానీ గ్రూప్ సంస్థ‌ల షేర్ల విలువ భారీగా పెంచుకున్నార‌ని, అదానీ గ్రూప్ సంస్థ‌ల ఆదాయం కంటే రుణాలే ఎక్కువ అని హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీనిపై అదానీ గ్రూప్ ఇచ్చిన వివ‌ర‌ణ ఇన్వెస్ట‌ర్ల‌కు న‌మ్మ‌కం క‌ల్పించ‌లేదు. ఒక‌వైపు రుణ భారం త‌గ్గించుకుంటూ, మ‌రోవైపు, విస్త‌ర‌ణ ప్ర‌య‌త్నాల‌ను అదానీ గ్రూపు ప్ర‌స్తుతం నిలిపివేసిన‌ట్లు స‌మాచారం. అదానీ గ్రూపు సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా కేంద్ర ప్ర‌భుత్వం, అధికార బీజేపీ, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ గొంతు విప్పాయి. తొలుత అదానీ గ్రూపు సంస్థ‌ల‌పై హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ దాడి.. జాతీయ‌వాదంపై దాడి అని అదానీ గ్రూప్ ప్ర‌క‌ట‌న చేస్తే దానికి ఆర్ఎస్ఎస్‌, బీజేపీ మ‌ద్ద‌తు ప‌లికాయి.

First Published:  23 Jun 2023 9:16 AM GMT
Next Story