Telugu Global
Business

ఒత్తిడి లేకుండా డబ్బు సంపాందించే జపనీస్ టెక్నిక్!

డబ్బు అవసరం అందరికీ ఉంటుంది. అయితే దానికోసం ఎలా ప్రయత్నిస్తున్నామన్నదే ముఖ్యం. డబ్బు మాయలో పడి ఒత్తిడికి గురవ్వడం, ఈజీగా డబ్బు పొందే మార్గాలకోసం చూడడం వంటివి మనిషిని సక్సెస్ వైపు నడిపించలేవు.

ఒత్తిడి లేకుండా డబ్బు సంపాందించే జపనీస్ టెక్నిక్!
X

ఒత్తిడి లేకుండా డబ్బు సంపాందించే జపనీస్ టెక్నిక్!

డబ్బు అవసరం అందరికీ ఉంటుంది. అయితే దానికోసం ఎలా ప్రయత్నిస్తున్నామన్నదే ముఖ్యం. డబ్బు మాయలో పడి ఒత్తిడికి గురవ్వడం, ఈజీగా డబ్బు పొందే మార్గాలకోసం చూడడం వంటివి మనిషిని సక్సెస్ వైపు నడిపించలేవు. అందుకే ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా డబ్బు సంపాందించే మార్గాన్ని వెతకాలి. దీనికోసం జపనీస్ ‘అరిగాటో’ అనే టెక్నిక్‌ను ఫాలో అవుతారు. ఇదెలా ఉంటుందంటే.

‘అరిగాటో’ అంటే.. జపనీస్‌ భాషలో ‘ధన్యవాదాలు’ అని అర్థం. డబ్బు సంపాదించడానికి ధన్యవాదాలలకు సంబంధం ఏంటీ అనేగా మీ డౌట్. ఇక్కడే ఉంది కిటుకంతా. ఎంత సంపాదించినా సంతృప్తి లేనప్పుడు డబ్బు ఉండి ఉపయోగం లేదు. అందుకే సంపాదించాల్సింది సంతృప్తి అంటున్నారు జపనీయులు. అప్పుడు డబ్బు ఆటోమెటిక్‌గా వెంట వస్తుందట.

పాజిటివ్‌ గా ఆలోచిస్తూ.. డబ్బు వెంట పడకుండా హాయిగా పనిచేసుకుంటూ పోవడం ద్వారా ప్రొడక్టివిటీ మరింత పెరుగుతుందని జపనీయుల నమ్మకం. అందుకే ఇరిగాటో అనే టెక్నిక్‌ను ఫాలో అవుతుంటారు. ఈ టెక్నిక్‌లో భాగంగా సంపాదించే డబ్బుని రెండు రకాలుగా విభజించుకోవాలి. ఒకటి సంతోషాన్నిచ్చే డబ్బు, రెండు సంతోషం ఇవ్వని డబ్బు.

సంతోషాన్నిచ్చే డబ్బు అంటే.. మీకు అవసరాలను తీర్చుకోడానికి వాడే డబ్బు, ఇష్టమైన వస్తువులను కొనడానికి వాడే డబ్బు లేదా ప్రేమించే వ్యక్తులు, ఫ్యామిలీకి ఉపయోగించే డబ్బు. ఇలాంటి అవసరాలకు డబ్బు వస్తున్నందుకు కృతజ్ఞతతో ఉండాలి. అలాగే సంతోషం ఇవ్వని డబ్బు అంటే అంటే అప్పులు, విలాసాల వంటివి.

ఒత్తిడి లేకుండా డబ్బు సంపాదించాలంటే సంతోషాన్నిచ్చే డబ్బు కోసం మాత్రమే ప్రయత్నించాలి. సంపాదించేది కొంతైనా.. అది మీ అవసరాలు తీరుస్తున్నందుకు, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు మీరు ధన్యావాదాలు చెప్పుకోవాలి. ఈ ఆటిట్యూడ్ వల్ల డబ్బు వెంట పరిగెత్తే అలవాటు తగ్గుతుంది. పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. తద్వారా ఆటోమెటిక్‌గా డబ్బు వెంట వస్తుంది.

ఎంత సంపాదిస్తున్నా.. ‘ఇంకా ఏదో కావాలి’ అన్నట్టు కాకుండా డబ్బును సరైన రీతిలో ఖర్చు పెడుతున్నందుకు.. తిండి, బట్టకు లోటు లేకుండా డబ్బు వస్తున్నందుకు హ్యపీగా ఫీలవ్వాలి. ఇలా ఫీలవ్వడం ద్వారా డబ్బుతో పాటు సంతోషం కూడా సమకూరుతుందని జపనీయులు నమ్ముతారు. ఇదే అరిగాటో టెక్నిక్.

First Published:  20 Oct 2023 1:26 PM GMT
Next Story