Telugu Global
Business

Best SUV Tata Nexon | టాటా నెక్సాన్ బీట్స్ మారుతి బ్రెజా.. కంపాక్ట్ ఎస్‌యూవీల్లో బెస్ట్‌.. !

టాటా నెక్సాన్ త‌ర్వాత మారుతి సుజుకి బ్రెజా 15,001 యూనిట్ల సేల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజా కారు రూ.8.29 ల‌క్ష‌లు - రూ.14.14 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ధ‌ర ప‌లుకుతుంది.

Best SUV Tata Nexon | టాటా నెక్సాన్ బీట్స్ మారుతి బ్రెజా.. కంపాక్ట్ ఎస్‌యూవీల్లో బెస్ట్‌.. !
X

Best SUV Tata Nexon | క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీ వైపు మొగ్గుతున్నారు. కుటుంబ స‌భ్యులంతా హాయిగా కూర్చుని వెళ్లేందుకు స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ)ల‌పై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో కార్ల విక్ర‌యాల్లో దాదాపు స‌గం ఎస్‌యూవీ కార్లే ఉంటున్నాయి. సెప్టెంబ‌ర్‌లోనూ మొత్తం కార్ల విక్ర‌యాల్లో 52 శాతం ఎస్‌యూవీలే ఉండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. రోజురోజుకు అత్యాధునిక టెక్నాల‌జీ ఫీచ‌ర్ల‌తో కూడిన ఎస్‌యూవీల‌కు ఫుల్ గిరాకీ నెల‌కొంది. గ‌త నెల‌లో అమ్ముడైన కంపాక్ట్ ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. నెక్సాన్ త‌ర్వాత మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడ‌ల్స్ `టాప్‌-5 ఎస్‌యూవీ`ల్లో నిలిచాయి. కియా ఇండియా `సొనెట్‌` మ‌రోమారు క‌స్ట‌మ‌ర్ల మ‌న‌స్సు చూర‌గొన‌లేకపోయింది.

15,325 యూనిట్లు విక్ర‌యించిన టాటా నెక్సాన్‌

సెప్టెంబ‌ర్‌లో అమ్ముడైన కంపాక్ట్ ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది. గ‌త నెల‌లో 15,325 యూనిట్లు విక్ర‌యించింది టాటా మోటార్స్‌. ఇటీవ‌లే న్యూ నెక్సాన్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. తాజా ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చిన టాటా నెక్సాన్ ధ‌ర రూ. 8.10 ల‌క్ష‌ల నుంచి రూ.15.10 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతున్న‌ది.

న్యూ నెక్సాన్ రెండు ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తున్న‌ది. రెవొట్రోన్ 1.2 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ (120పీఎస్‌/170 ఎన్ఎం), రెవొటార్క్ 1.5 లీట‌ర్ల డీజిల్ (115 పీఎస్‌/ 260 ఎన్ఎం) సామ‌ర్థ్యంతో కూడిన ఇంజిన్ల‌తో న్యూ టాటా నెక్సాన్ రూపుదిద్దుకున్న‌ది. టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ కారు 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీఏ ఆప్ష‌న్ల‌లో వ‌స్తుంది. ఇక నెక్సాన్ డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్ష‌న్ల‌తో వ‌స్తుంది.

రెండో స్థానంలో మారుతి బ్రెజా

టాటా నెక్సాన్ త‌ర్వాత మారుతి సుజుకి బ్రెజా 15,001 యూనిట్ల సేల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజా కారు రూ.8.29 ల‌క్ష‌లు - రూ.14.14 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ధ‌ర ప‌లుకుతుంది. ఈ కారు కే15సీ 1.5-లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 103 పీఎస్ విద్యుత్‌, 137 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. ప్ర‌స్తుతం బ్రెజాలో బ‌యో-ఫ్యుయ‌ల్ (సీఎన్జీ + పెట్రోల్‌) ఆప్ష‌న్ ఇంజిన్ కూడా ఉంది. బ‌యో ఫ్యుయ‌ల్ మోడ‌ల్ ఇంజిన్ 88 పీఎస్‌, 121 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. పెట్రోల్ మోడ్ ఇంజిన్ 101 పీఎస్ విద్యుత్‌, 136 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. బ్రెజా పెట్రోల్ కారు వేరియంట్ 5- స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్ష‌న్‌ల‌తో వ‌స్తుంది. ఇక బ్రెజా సీఎన్జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో ల‌భిస్తుంది.

12,204 కార్ల‌తో తృతీయ స్థానంలో హ్యుండాయ్ వెన్యూ

హ్యుండాయ్ వెన్యూ గ‌త నెల‌లో 12,204 యూనిట్లు విక్ర‌యించింది. ఈ కంపాక్ట్ మోడ‌ల్ కార్లు మూడు ఇంజిన్ ఆప్ష‌న్లు - క‌ప్పా 1.2- లీట‌ర్ల ఎంపీఐ పెట్రోల్ (83పీఎస్‌/114 ఎన్ఎం), క‌ప్పా 1.0-లీట‌ర్ల ట‌ర్బో జీడీఐ పెట్రోల్ (120 పీఎస్‌/172 ఎన్ఎం), యూ2 1.5-లీట‌ర్ల సీఆర్డీఐ డీజిల్ (116 పీఎస్‌/250 ఎన్ఎం) ఆప్ష‌న్ల‌లో వ‌స్తుంది. 5- స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 7-స్పీడ్ డీసీటీ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. హ్యుండాయ్ వెన్యూ కారు ధ‌ర రూ.7.89 ల‌క్ష‌ల నుంచి రూ.13.34 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుంది.

నాలుగో స్థానంలో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 300

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మహీంద్రా కంపాక్ట్ ఎస్‌యూవీ.. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300 మోడ‌ల్ కారు.. కియా సొనెట్ కంటే ముందు నిలిచింది. గ‌త నెల‌లో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు 5,491 యూనిట్లు అమ్ముడైంది. ఈ కారు ధ‌ర రూ.7.99 ల‌క్ష‌ల నుంచి రూ.14.75 ల‌క్ష‌ల (ఎక్స్‌షోరూమ్‌) ప‌లుకుతుంది. ఎక్స్‌యూవీ300 కారు మూడు ఇంజిన్ ఆప్ష‌న్లు - 1.2-లీట‌ర్ల ట‌ర్బో చార్జ్‌డ్ మ‌ల్టీ పాయింట్ ఫ్యుయ‌ల్ ఇంజెక్ష‌న్ (టీసీఎంపీఎఫ్ఐ) పెట్రోల్‌, 1.2-లీట‌ర్ల ఎం-స్టాలియ‌న్ ట‌ర్బో చార్జ్‌డ్ ఇంట‌ర్ కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్ష‌న్ (టీడీజీఐ) పెట్రోల్‌, 1.5-లీట‌ర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. టీసీఎంపీఎఫ్ఐ ఇంజిన్ గ‌రిష్టంగా 110పీఎస్ విద్యుత్‌, 200 ఎన్ఎం టార్క్‌, టీజీడీఐ ఇంజిన్ (ట‌ర్బో స్పోర్ట్ వ‌ర్ష‌న్) గ‌రిష్టంగా 130 పీఎస్ విద్యుత్‌, 230 ఎన్ఎం టార్క్‌, డీజిల్ ఇంజిన్ గ‌రిష్టంగా 117 పీఎస్ విద్యుత్‌, 300 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. టీసీఎంపీఎఫ్ఐ, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు 6- స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఏఎంటీ చాయిస్‌, టీజీడీఐ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే ల‌భిస్తుంది.

పోటీలో వెన‌క‌బ‌డ్డ కియా సొనెట్‌

కియా ఇండియా కంపాక్ట్ ఎస్‌యూవీ కారు సొనెట్ వ‌రుస‌గా మూడో నెల‌లోనూ క‌స్ట‌మ‌ర్ల‌కు చేరువ కావ‌డంలో వెనుక ప‌డింది. గ‌త నెల‌లో కేవ‌లం 4,984 యూనిట్లు మాత్ర‌మే విక్ర‌యించింది. మూడు ఇంజిన్ ఆప్ష‌న్లు - స్మార్ట్ స్ట్రీమ్ జీ1.2- లీట‌ర్ల పెట్రోల్ (83 పీఎస్‌/114 ఎన్ఎం), జీ1.0- లీట‌ర్ల ట‌ర్బో జీడీఐ పెట్రోల్ (120 పీఎస్‌/172ఎన్ఎం), 1.5-లీట‌ర్ల సీఆర్డీఐ డీజిల్ (116 పీఎస్‌/250 ఎన్ఎం) ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. కియా సొనెట్ కారు 5- స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ, 7-స్పీడ్ డీసీటీ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. ఈ కారు ధ‌ర రూ.7.79 ల‌క్ష‌ల నుంచి రూ.14.89 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.

First Published:  10 Oct 2023 2:54 AM GMT
Next Story