Telugu Global
Business

Bajaj Chetak EV Scooter | ఆ మూడు ఈవీ స్కూట‌ర్ల‌కు స‌రి జోడీ.. దేశీయ మార్కెట్‌లోకి బ‌జాజ్ 2024 ఈవీ స్కూట‌ర్‌.. ఇవీ డిటైల్స్‌..!

Bajaj Chetak EV Scooter | 2024 చేత‌క్ ఈవీ స్కూట‌ర్ సింగిల్ చార్జింగ్‌తో అత్య‌ధికంగా 127 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. గంట‌కు 73 కి.మీ దూరం ప్ర‌యాణించే వేగం గ‌ల ఈ స్కూట‌ర్‌లో 3.2కిలోవాట్ల బ్యాట‌రీ జ‌త చేశారు.

Bajaj Chetak EV Scooter | ఆ మూడు ఈవీ స్కూట‌ర్ల‌కు స‌రి జోడీ.. దేశీయ మార్కెట్‌లోకి బ‌జాజ్ 2024 ఈవీ స్కూట‌ర్‌.. ఇవీ డిటైల్స్‌..!
X

Bajaj Chetak EV Scooter | ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో (Bajaj Auto) శుక్ర‌వారం త‌న బ‌జాజ్ చేత‌క్‌-2024 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ (2024 Bajaj Chetak electric scooter) భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ. 1,15,001 (ఢిల్లీ ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభ‌మైంది. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), హీరో విదా వీ1 (Hero Vida V1) ఓలా ఎస్‌1 (Ola S1) స్కూట‌ర్ల‌కు బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్-2024 గ‌ట్టి పోటీ ఇస్తుంది.


2024 చేత‌క్ రెండు వేరియంట్లు - అర్బ‌న్‌, ప్రీమియం వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. చేత‌క్ అర్బ‌న్ స్కూట‌ర్ కోర్స్ గ్రే, సైబ‌ర్ వైట్‌, బ్రూక్లిన్ బ్లాక్‌, ఇండిగో మెటాలిక్ బ్లూ క‌ల‌ర్స్‌, చేత‌క్ ప్రీమియం స్కూట‌ర్ హ‌జెల్‌న‌ట్‌, ఇండిగో మెటాలిక్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఇంత‌కుముందు 2020 జ‌న‌వ‌రిలో ఆవిష్క‌రించిన బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్ష యూనిట్ల‌కు పైగా అమ్ముడు పోయాయి.



2024 చేత‌క్ ఈవీ స్కూట‌ర్ సింగిల్ చార్జింగ్‌తో అత్య‌ధికంగా 127 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. గంట‌కు 73 కి.మీ దూరం ప్ర‌యాణించే వేగం గ‌ల ఈ స్కూట‌ర్‌లో 3.2కిలోవాట్ల బ్యాట‌రీ జ‌త చేశారు. చేత‌క్ ప్రీమియం ఈవీ స్కూట‌ర్ 800 వాట్ల చార్జ‌ర్‌తో వ‌స్తోంది. న్యూ చేత‌క్ ఈవీ పూర్తిగా మెట‌ల్ బాడీ, లార్జ‌ర్ బూట్ ఫెసిలిటీ క‌లిగి ఉంటుంది. అన్ని ఎల‌క్ట్రిక్ కాంపొనెంట్స్‌కు ఐపీ-67 రేటెడ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఉంటుంది.



2024 బ‌జాజ్ చేత‌క్ ప్రీమియం ఈవీ 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వ‌స్తుంది. అద‌నంగా టెక్ పాక్‌, ట‌ర్న్ బై ట‌ర్న్ నేవిగేష‌న్‌, మ్యూజిక్ కంట్రోల్‌, కాల్ మేనేజ్‌మెంట్, హిల్ హోల్డ్ మోడ్‌, రివ‌ర్స్ మోడ్ కూడా ఉంటుంది. సీక్వెన్షియ‌ల్ రేర్ బ్లింక‌ర్స్‌, సెల్ఫ్ క్యాన్సిలింగ్ బ్లింక‌ర్స్‌, లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్ స్విచ్ఛేస్‌, ఎల‌క్ట్రానిక్ హ్యాండిల్, స్టీరింగ్ లాక్స్‌, సీట్ స్విచెస్‌, హెల్మెట్ బాక్స్ ల్యాంప్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. మ‌నీ ఆదా, ఫ్యుయ‌ల్ వినియోగం త‌గ్గింపు, క‌ర్బ‌న ఉద్గారాల నియంత్ర‌ణ త‌దిత‌ర చ‌ర్య‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌ కోసం చేత‌క్‌-2024 లో గ్రీన్ స్కోర్‌ జ‌త చేశారు.



వేరియంట్ వారీగా బ‌జాజ్ చేత‌క్ 2024 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌లు ఇలా..

2024 బ‌జాజ్ చేత‌క్ అర్బ‌న్ - రూ.1,15,001

2024 బ‌జాజ్ చేత‌క్ ప్రీమియం - రూ.1,35,463

First Published:  5 Jan 2024 8:23 AM GMT
Next Story