Telugu Global
Arts & Literature

సందర్శనీయం: మాలిబూ బాలాజీ కోవెల, USA

సందర్శనీయం: మాలిబూ బాలాజీ కోవెల, USA
X

అమెరికా లాస్ అంజల్స్ కి 60 కి.మీ దూరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి.ఈ గుడిని 1981 లో నిర్మించారు. హిందూ టెంపుల్ సొసైటీ కాలీఫొర్నియా సంస్త వారు ఒక సొసైటీ గా ఏర్పడి పూర్తిగా దక్షిణ భారత శైలిలో ఉండే గుడి శైలి లో నిర్మించారు.

భారత దేశం నుంచి వచ్చిన శిల్పులు ఈ గుడి నిర్మాణం లో పాలు పంచుకున్నారు .చూపరలును కట్టి పడేసే పరిసరాలు 4 ఎకరాల స్థలం లో వైభవంగా ఉంటుంది. గుడి ప్రారంభించిన వాసన్ శ్రీనివాసన్ గారు వృత్తి రీత్యా సివిల్ ఇంజినీర్.

వారు ఈ గుడి ప్రారంభించటానికి ఇక్కడి భారతీయుల నుంచి డబ్బు మరియు వనరులుఏర్పరచటానికి, గుడి నిర్మాణం లో పర్యవేక్షణ కి ముఖ్యులు.


ఈ దేవాలయానికి రెండు ఆలయాలు ఉన్నాయి.మెట్టమీద ఉన్న గుడిలో వెంకటేశ్వర స్వామి దాని ప్రక్కనే దిగువలో శివాలయం వీటికి తోడుగా మిగితా దేవతల విగ్రహాలుకూడా ఈ ఆలయాల్లో ఉన్నాయి గుడిలోని పురోహితులు వాళ్ళకు ఏర్పరిచిన నివాస స్థలం లో నే గుడి ఆవరణలో ఉంటారు. వాష్ రూంస్ , సేదతీర్చుకునే ప్రదేశాలు చాలా బాగ ఉంచటం ఆకర్షిస్తుంది ఉదయం 9 నుండి సా" 5 వరకు గుడి తీసిఉంటుంది.ప్రస్తుతం కరోనా కారణంగావారాంతాలు శని ,ఆదివారాలు గుడితీసి ఉంచుతున్నారు.

చుట్టుప్రక్కన భారతీయులు వంతులు వేసుకొని వాలంటీర్లుగా శని ఆది వారాలు పిల్లలతో వచ్చి కుటుంబాలు మొత్తం భక్తులకు సేవ చేస్తారు.హిందువుల పండుగలూ ఆచారవ్యవహారాలకు ఇక్కడ పూజలు చెయించుకోవడనికి వసతులు ఉన్నాయి.

కరోనా కారణంగా ఉత్సవ మూర్తులకు ఆరు బయట పందిరి వేసి పూజలు నిర్వహిస్తున్నారు. $ 20 ఫీస్.

గుడిలోపల దర్శనం చేసుకొని ప్రదక్షిణలకు ఎటువంటి ఇబ్బంది లేదు.ప్రసాదం తయారు చేయటానికి వంటసాల తో పాటు తినటానికి పందిరులు & కాంటీన్ ఎర్పాట్లు ఉన్నాయి. ప్రసాదం ఖరీదు $ 5.లడ్డు $ 5 . పులిహార, సాంబార్ అన్నం & దద్దోజనం - దబ్బ కాయ పచ్చడి .విశేషం గా అవి కొని మేము రాత్రి ఇంటికివచ్చి తిన్నాము రుచిలో ఏ మాత్రము మార్పు రాలేదు.

ఏమయినా అమెరికాలో సందర్శనీయ దేవాలయం ఇది

- నేరెళ్ల శ్రీనాథ్

First Published:  10 Feb 2023 5:45 PM GMT
Next Story