Telugu Global
Arts & Literature

శీలావీ

శీలావీ
X

మ‌ర‌ణం మీ దేహానికే

మీ క‌లం కురిసిన అక్ష‌రం

మీ కుంచె ఒలికిన చిత్రం

మా కోసం మీరిచ్చిన

చిర‌కాల‌పు తేజోనిధులే

ర‌చ‌న‌తో ఆలోచ‌న పెంచారు

బొమ్మ‌ల‌తో అవ‌లోక‌న క‌లిగించారు

అంత‌రంగాల్ని ఆలోచ‌నాత్మ‌కంగా

ఆవిష్క‌రించి మాన‌వీయం చేశారు

త‌ర‌గ‌ని సృజ‌నను మాకిచ్చి

మైనాలా మీరు మాత్రం ఎగిరిపోయారు

క‌థ‌లు, న‌వ‌ల‌లు, బొమ్మ‌ల్లో

మీరు కొలువుదీరి క‌న్పిస్తూనే ఉంటారు

సాహిత్య త‌ప‌స్వి

చిత్ర‌క‌ళా మ‌న‌స్వి

అక్షర యోగీ

శీలావీ

భాష్పాంజ‌లి

హృద‌యాంజ‌లి

( ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, చిత్ర‌కారుడు శీలా వీర్రాజు మొదటి వర్ధంతి స్మృతిలో...)

- తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

First Published:  1 Jun 2023 8:03 AM GMT
Next Story