Telugu Global
Arts & Literature

క‌వితాసేనాని...

క‌వితాసేనాని...
X

వివ‌క్ష‌త‌పై అక్ష‌ర‌ఖ‌డ్గం

దౌర్జ‌న్యంపై ర‌గిలిన అగ్నికీల

అణ‌చివేత‌పై ఎగ‌సిన నిర‌స‌న జ్వాల

ధిక్కార‌మైన ప్ర‌తిధ్వ‌నించిన ఆత్మాభిమానం

ప్ర‌జాక్షేత్రంలో మెర‌సిన నిరాడంబ‌రం

క‌ష్టాల్ని త‌ల‌చి రాలిప‌డ్డ క‌న్నీరు

జ‌నం గొడ‌వ‌కు గొడుగైన క‌వితాసేనాని

కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్ప‌డ‌మే ఆయ‌న‌ నైజం

వీర తెలంగాణ‌, వేరు తెలంగాణ అన్న ధీరత్వం

దేశీయ‌త‌, ప్రాంతీయ‌త‌ల స‌మాహారం

అన్యాయాన్ని ఎదిరించినోడే ఆయ‌న‌కు ఇష్టుడు

కంటిచెమ్మ‌తో బ‌తికే సామాన్యుడే

ఆ అక్ష‌రానికి ఘ‌నుడు

కాళోజీ అచ్చ‌మైన ప్ర‌జాక‌వి

ప్ర‌జాక్షేత్రంలో స‌త‌తం వెలిగే ర‌వి.

- తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

First Published:  9 Sep 2023 5:24 AM GMT
Next Story