Telugu Global
Arts & Literature

సి.ఆనందారామం

సి.ఆనందారామం
X

ఆనందారామం గారి జీవన రేఖలు :

ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో జన్మించేరు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శ గ్రంథాలు రాసేరు. ఈమె వ్రాసిన నవల ఆత్మబలి సంసార బంధం సినిమాగా, అదే నవల జీవనతరంగాలు టీవీ సీరియల్‌గావచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు.

ఆనందారామం గారి అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పాస్ అయ్యి బి.ఏ. పూర్తయ్యాక సి.ఆర్.ఆర్. కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేసారు .1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాం మారింది .1958-60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివి సి.నారాయణరెడ్డి గారు గైడుగా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించారు .

హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లోకేంద్రీయవిశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా పనిచేసారు .

సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీవిరమణ చేసారు . వీరి నవలలు

——————-

రేపటి మహిళ,సంపెంగ పొదలు 1962,ఆత్మబలి -1966,జాగృతి,మమతల కోవెల,తపస్వి,ఇంద్ర సింహాసనం,శారద,వర్షిణి

గర్ల్ ఫ్రెండ్ ఆనందనిలయం,

అనిత,భార్యతో రెండోపెళ్లి,చీకటి కడుపున కాంతి,ఏది సత్యం? ఏది అసత్యం?,ఈనాటి శకుంతల,కనబడుటలేదు,రక్షరేకు,మబ్బువిడిపోయింది,ప్రేమసూత్రం,కనువిప్పు,ఈ ప్రశ్నకు బదులేది?,నీరు

పల్లమెరుగు,

సూర్యనేత్రం,వెలుగుబాట, నీటిసెగలు

జిగోలో,మహిళా సమాజం,అందీ అందనిది,మారే కాలంలో మారనివిలువలు,ఆశాజ్యోతి,అపరాజిత,నిరాశలో నిండు గుండె,దీనబంధు

కథాసంపుటాలు

----------------

ఎన్నెన్నో కాంప్లెక్సస్,డోలిక,

దశావతారాలు,పోనీ నేను వ్రాసిపెట్టనా

విమర్శ గ్రంథాలు

____

తెలుగు నవలా విమర్శ

సాహిత్యము -నవలాప్రక్రియ

సమాజ సాహిత్యాలు

తులనాత్మక సాహిత్యం - నవలా ప్రక్రియ: వ్యవస్థాగత దృక్పథం

ఆనందారామంగారు అందుకున్న పురస్కారాలు :

______

గృహలక్ష్మి స్వర్ణకంకణము - 1972,

మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు - 1979 (తుఫాన్ నవలకు),మాదిరెడ్డి సులోచన బంగారు పతకం - 1997,తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు - రెండు పర్యాయాలు,సుశీలా నారాయణరెడ్డి పురస్కారం,గోపీచంద్ పురస్కారం,

అమృతలత జీవన సాఫల్య పురస్కారం - 2013

ఆనందారామం 2021 ఫిబ్రవరి 11 గురువారం హైదరాబాద్ లో అస్తమించారు.

-నారాయణి .ఎస్

First Published:  10 Feb 2023 5:30 PM GMT
Next Story