Telugu Global
Arts & Literature

ప్రత్యక్ష దైవం

ప్రత్యక్ష దైవం
X

ఎవరికైనా ఋణపడితే

ప్రాణం పోయేలోగా తీర్చేసుకోవడం మంచిదట !

లేదంటే మాత్రం మరోజన్మ ఎత్తి, ఋణదాత ఇంట పుట్టి తీర్చుకోవలసి వుంటుందట!!!

నిజమో కాదో తెలియదు కానీ

అమ్మ' ఋణం 'విషయంలో మాత్రం యిది నిజమైతే

ఎంత బాగుంటుందో కదా !

కన్నతల్లి ఋణం తీర్చుకోలేని కారణంగా

మళ్ళీ మళ్ళీ ఆమె పుట్టిన ఇంటే పుడుతూ వుంటే

అంతకు మించిన అదృష్టం మరోటి వుండబోదు !

అవును !!

తొమ్మిది నెలలు కడుపులో

దాచుకుని మోసి,

శిశువుగా వున్నంతకాలం

గుండెల్లో పెట్టుకుని కాపాడి,

బాల్యావస్థలో పాలనపోషణ చేసే

అమ్మ ఋణం తీర్చుకోలేనిది !

రుగ్మత పాలైతే రాత్రింబవళ్ళు

కళ్ళలో ఒత్తులేసుకుని కనిపెట్టి వుండే తల్లి 'దేవతే'

దేవతలు కంటికి కనపడరు !

కనిపెంచే తల్లి మాత్రం

కనిపించే దేవత ! ప్రత్యక్ష దైవం !

మాతృ దేవో భవ !

-డాక్టర్ మానుకొండ సూర్యకుమారి, (విశాఖపట్నం)

First Published:  29 Jan 2023 6:15 AM GMT
Next Story