Telugu Global
Arts & Literature

జోకాభి రామాయణం

జోకాభి రామాయణం
X

రాత ఫలితం

———————

భార్య (భర్తతో): నేను మీ పేరు ఇసుకలో వ్రాస్తే అలకి చెరిగిపోయింది

నేను మీ పేరు గాలిలో వ్రాస్తే ఆవిరైపోయింది

అందుకే నేను మీ పేరు గుండెల్లో రాసుకున్నాను

అందుకే గుండెపోటు వచ్చింది.

అవునులెండి

------------

‘‘భర్త అంటే కుటుంబానికి శిరస్సు లాంటివాడు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నారందుకే.’’

‘‘కానీ భార్య అంటే మెడ. మెడ ఎటు తిప్పితే తల అనగా శిరస్సు అటు తిరుగుతుంది. తెలుసుకోండి.’’

అంతా అంతే

——————-

“నువ్వు ప్రేమించిన ఏకైక వ్యక్తిని నేనే కదు లతా!’’ అడిగాడు వెంకట్రావు.

‘అఫ్‌కోర్స్! కానీ మగాళ్లంతా నన్ను ఈ ప్రశ్న మన కాలేజీలో ఎందుకు అడుగుతున్నారంటావ్.’’

అసూయ

————-

తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం వుందని పద్మకు తెగ అనుమానంగా వుంది. రానురాను అది బలీయం కాసాగింది.

ఆ విషయమే ఒకరోజు పనిమనిషితో అంది.

‘‘మా ఆయనకు ఆఫీసులో ఎవరో స్త్రీ తో సంబంధం వుందని అనుమానంగా వుందే.’’

‘‘పోండి అమ్మగారూ! నేను ఉడుక్కోవాలని మీరలా అంటున్నారు కదూ!’’ అంది పనిమనిషి.

ఎవరు?

————

కానిస్టేబుల్ కుర్రాడితో: రోడ్డుమీద కలబడి కొట్టుకుంటున్న ఆ ఇద్దరిలో మీ నాన్న ఎవరు?

కుర్రాడు: అదే తెలియదు! దాన్ని గురించే వారిద్దరూ కొట్టుకుంటున్నారు.

ఏం చేస్తావ్

—————

“సూర్యం నన్ను పెళ్లిచేసుకోమని అడుగుతున్నాడు. ఈ ప్రపంచంలో తనను గొప్ప అదృష్టవంతుడిని చేయమంటున్నాడు’’ అంది ప్రభ రోజాతో.

‘‘ఇంతకీ ఆ రెండింటిలో ఏం చేయదలిచావో మరి?’’ అడిగింది రోజా.

అలవాటు

————-

డాక్టర్: ‘‘మీరు రోజూ నిద్ర మాత్ర వేసుకోవడం అంత మంచిది కాదు మానేయండి. లేకపోతే అది అలవాటుగా మారిపోతుంది .

"భలేవారే !రోజూ రాత్రి ఇరవై ఏళ్లనుంచి వేసుకుంటున్నాను నాకు అదేమీ అలవాటుగా మారనే లేదు తెలుసా!’’

తోద్దురూ

————

డాక్టర్‌గారికి అర్ధరాత్రి పూట ఫోన్ వచ్చింది. ‘చాలా అర్జంటు డాక్టర్‌గారూ’ అంటూ..

‘‘మా ఆవిడ మృత్యువాకిలిలో వుంది మీరు వెంటనే రావాలి.’’

‘‘ఇప్పుడు వచ్చి నేనేం చెయ్యగలనయ్యా!’’

‘‘ఆ వాకిలి లోపలికి తోయడానికి కాస్త సాయం పడుదురూ!’’

కార్యాలయం

——————

“ఇలా రోడ్డుమీద ముష్టెత్తుకుంటూ ఎంతకాలం తిరుగుతావ్ సిగ్గుగా లేదూ?’’ రోజూ బస్టాండ్‌లో కనిపించే బిచ్చగాడిని కసురుకుంది లక్ష్మి.

‘‘త్వరలోనే ఆఫీస్ ఓపెన్ చేద్దామనుకుంటున్నా! ఎటొచ్చీ పి.ఏగా మీలాంటి అమ్మాయిఒప్పుకుంటుందేమోనని అడుగుతున్నా’’ అన్నాడు ముష్టోడు.

**

ప్రశ్నలు- జవాబులు

ఃఃఃఃఃఃఃః

ప్రశ్న: భర్తను స్ప్లిట్ ఏ.సితో ఎందుకు పోలుస్తారు

జవాబు: బయట ఎంత గొడవ చేసినా, ఇంట్లో నిశ్శబ్దంగా వుండేలా అమరి వుంటాడు కాబట్టి

**

ప్రశ్న: ‘హనీ బీ’ యు.ఎస్ వెళ్లిపోతే దాన్నేమంటారు

జవాబు: యు.ఎస్.బి

**

ప్రశ్న: నిద్రపోవడంలో ప్రమాదకరమైన భంగిమ ఏది కావచ్చు

జవాబు: ఆఫీస్ టేబుల్ మీద కాళ్లు రెండూ బారచాపి కుర్చీలో నిద్రపోవడం

**

ప్రశ్న: స్త్రీ అంటే ఎవరు

జవాబు: గుమ్మం దగ్గర నిలబడి గంటలకొద్దీ మాట్లాడుతుంది గానీ కూచోమంటే టైం లేదు వెళ్లాలంటుంది.

**

ప్రశ్న: ఇవి కొత్త రకం కుక్క బిస్కెట్లు కదా?

జవాబు: కుక్క బిస్కెట్లలో సరికొత్త రకం అని రుచి చూసేదెవరు చెప్పండి.

**

ప్రశ్న: తెలియకుండా ఏడవడం ఎలా?

జవాబు: నీటి అడుగున ఈత కొడుతూ

First Published:  13 Aug 2023 7:46 PM GMT
Next Story