Telugu Global
Arts & Literature

నా జ్ఞాపకo పరారైపోయిoది

నా జ్ఞాపకo  పరారైపోయిoది
X

పాతికేళ్ళు పనిచేసిన నా పాఠశాలలో

జ్ఞాపకాలగనికోసం వెతుకుతున్నా

మనసు మూలలు వెతికితే

తవ్వుతున్న కొద్దీ గుట్టలుగుట్టలుగా

జ్ఞాపకాలు వెలికి వస్తూనే ఉన్నాయి

బెరుకు బెరుకుగా మొదటి

అడుగేసిన తీయని జ్ఞాపకo!!

పేదరికాన్ని వదిలి పెద్దరికాన్ని

తెచ్చుకొన్న ఒక జ్ఞాపకo!!

పసిపిల్లల మనసు గెలుచుకుని

పాఠాలతో పాటు బ్రతుకు

పాఠాల్ని నేర్పిన జ్ఞాపకo !!

అజ్ఞానతిమిరాన్ని పారద్రోలి

విజ్ఞానపు శిఖరాన్ని ఎక్కించి

భావిజీవితపు జీవనాదం

శృతి చేసినఒక జ్ఞాపకo!!

మనసు మనసుతో చెలిమి చేసి

మాధుర్యపు క్షణాల్ని

పంచుకున్న జ్ఞాపకo !!

విద్యార్థుల ఉపాధ్యాయుల

ప్రశంసలు అందుకొని కడుగర్వంగా

ఎవరెస్ట్ అధిరోహించినoత

ఆనందంతో గడిపిన ఒక జ్ఞాపకo!!

గుండెకి గండిపడి

కనులు కన్నీటి చెలమలై

ఆర్ద్రతకి ఆవలివడ్డు చూసిన

ఒక జ్ఞాపకo!!

విద్యార్థులనైపుణ్యాలను వెలికితీసి

బహుమతుల వెల్లువలో

తీపి వరవడినాటి

ప్రతిభకు పట్టంగట్టిన ఒక జ్ఞాపక0!!

నైపుణ్యo చూపిన విద్యలో

యోగ్యతపత్రాల్ని అందుకున్

నఒక జ్ఞాపకo

సరదాగా ఉత్తరాలు రాసుకొని

చెలిమి పంచుకున్నఒక జ్ఞాపకo

చిన్న విషయాలకే చిన్నబోయి చిరాకుపడి

చీత్కారాలకి గురైన ఒక జ్ఞాపకo

చీకు చింత లేని బాల్యం

జ్ఞాపకాల దొంతరలో జారిపోయి

కనులు తడిసిన ఒక జ్ఞాపకo

బాధను దాచిపెట్టి నవ్వుల్ని మదిగదిలో వుoచి నటించిన

ఒక జ్ఞాపకo

ఇన్ని జ్ఞాపకాలు...

ఎదలో సందడి చేసి

ఏటివడ్డున నీటి పూలలా

మనసు మనసులో మరీచికలా కదలాడిన జ్ఞాపకాలదొంతరలు

ఎటో విసిరేయబడి..

ఒక్కసారిగా..

శున్యమావరించి

నిశ్శబ్ద మాధురిలో

నీలినీలి కలలు కంటూ

ఒక జ్ఞాపకoలో జ్ఞాపకoగా మిగిలిన

నా జ్ఞాపకo పరారైపోయింది...

మీకు దొరికితే ఇవ్వండి!!

-రెడ్డి పద్మావతి.

M.A.M. A.B .ED.

(పార్వతీపురం. మన్యం జిల్లా)

First Published:  16 July 2023 6:01 PM GMT
Next Story