Telugu Global
Arts & Literature

భావన: కర్మఫలితం

భావన: కర్మఫలితం
X

మనం జీవితంలో ఏవేవో చేస్తుంటాం.ఆ పనులే మనచేత మరికొన్నింటిని

చేయిస్తాయి. మనకి తెలిసి కొన్ని,తెలియకుండానే కొన్ని పనులు చేస్తూనేఉంటాం. వీటినే కర్మల చక్రమని వేదాంతంచెబుతుంది. గతంలో చేసినవాటిని ప్రారబ్ధకర్మలంటారు. వీటి కారణంగావర్తమానంలోఏర్పడేవి సంచిత కర్మలు. ఇవే భవిష్యత్తులోఆగామి కర్మలుగా అవతరిస్తాయి.

ఈకర్మలచక్రంలో పడ్డ మానవుడే అవే తానుగామారిపోతాడు. కళ్లకు గంతలు కట్టిన గానుగెద్దులా వాటిచుట్టూనే తిరుగు తుంటాడు .కర్మలవల్లనే జన్మలు ఏర్పడతాయి. జన్మఎత్తిన ప్రతివారికీ కర్మలు తప్పవు. వాటివల్లనే బాధలు, బంధాలు, బంధనాలు ఏర్పడతాయి.ఆశలు పెరుగుతాయి. అడియాశలు

కలుగుతాయి.ఆపేక్షలకు,

ఆశాభంగాలకు కారణమయ్యేది మనం చేసే కర్మలే. దీనికి

అంతo ఉండదు. అనంతంగా సాగే ప్రక్రియ.

అయితే వర్తమానంలో మనం చేసేపనులు మంచి కర్నలై భవిష్యత్తులోమంచి ఫలాన్నిస్తాయి .అదేవిధంగాచెడ్డపనులుపాపపంకిలాన్నిఅంటిస్తాయి.దీనికిఉదాహరణగా మంచి కథ ఒకటి ఉంది.

అనగనగా ఓ రాజుగారున్నారు. ఆయన ఓ విచిత్రమైన పరీక్ష చేయదలుచుకుని.

ముగ్గురు వ్యక్తుల్ని పిలిచారు. ముగ్గురికీ మూడు గోనెసంచులిచ్చారు. దగ్గరలో ఉన్నఅరణ్యానికి వెళ్లి, ఇచ్చిన సంచీల నిండుగామంచిపళ్లు తెమ్మన్నారు.

ముగ్గురూ అడివికి వెళ్లారు. మొదటి వ్యక్తి "గోనె సంచి నిండా, మంచిపళ్లు

తెమ్మన్నారంటే ఏదో గొప్ప కార్యక్రమం ఉండి ఉంటుంది. ఏరికోరి మంచి పళ్లనే తీసుకువెళ్లాలి"

అనుకున్నాడు. అడవంతా తిరిగి చాలా కష్టపడి, ప్రతి పండునీపరీక్షించి, ఎంచి సంచీలోనింపుకున్నాడు.

రెండో వ్యక్తి మరోవిధంగాఆలోచించాడు.

"రాజుగారికి ప్రతిపండూ శ్రేష్టమైనదా, కాదా అని పరీక్షించేసమయం, సహనం

ఉండవు. కనుకఏవో పళ్లు తీసుకెళితే చాలు" అనుకున్నాడు.

పండు బాగుందా లేదా అనే పరిశీలన చేయకుండానే, దొరికిన ప్రతి పండునూ

గోనెసంచిలో నింపాడు.

మూడో వ్యక్తి అతితెలివి కలిగినవాడు.

"రాజుగారు పనులలో తీరిక లేకుండా.. ఉంటారు. తీసుకెళ్లిన సంచీనిపరిశీలించే తీరిక, ఓపిక ఉండవు. కాబట్టి ఏదోరకంగా సంచీని నింపుకుని వెళ్లిపోతే చాలనుకున్నాను. గోనె సంచీని మూడొంతులు ఆకులు,అలములతో

నింపాడు .మిగిలిన నాలుగోభాగాన్ని దొరికిన పళ్లతోనూ, పిందెలతోనూ నింపాడు.

చూడడానికి ముగ్గురి బస్తాలూ నిండుగానే ఉన్నాయి. ముగ్గురూ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, "రాజా!మీరు చెప్పినట్లే, మాకిచ్చిన గోనెసంచిల నిండా పళ్లు నింపుకుని వచ్చాము" అని మూడు మూటల్నీ రాజుగారి ముందుఉంచారు.

మూడోవ్యక్తి.అనుకున్నట్లే..

రాజుగారు ఆ సంచుల్ని పరిశీలించలేదు.

భటుల్ని పిలిచి, "ముగ్గురినీ కారాగారంలో బంధించామన్నారు . "శిక్షా కాలమంతా అన్నపానీయాలు ఏమీ పెట్టకండి. ఎవరుతెచ్చుకున్న పళ్లు వాళ్లు తిని బతుకుతారు"అని చెప్పారు.

ముగ్గురినీ భటులు మూడు గదుల్లోబంధించారు. ఎవరు తెచ్చిన గోనెమూటనివాళ్ల గదిలో ఉంచారు. శ్రేష్ఠమైన ఉత్తమజాతిపళ్లు మొదటి వ్యక్తి సంచీలో ఉన్న కారణంగా,ఆ పళ్లని ఆహారంగా తీసుకుని, మొదటివ్యక్తితన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నాడు.

అవన్నీ మంచిపళ్లైన కారణంగా అతని ఆరోగ్యం దెబ్బతినలేదు . ఏ కష్టం కలగలేదు.

రెండోవ్యక్తి సంచిలో మంచివి, పాడైపోయినపళ్లూ కూడా ఉన్నాయి. ఆకలికి సరిపడేంత పళ్లు దొరకని కారణంగా మంచాన పడ్డాడు.

మూడోవ్యక్తి దగ్గరున్న పళ్లన్నీ రెండురోజుల్లోనే పూర్తయ్యాయి. తర్వాత తినడానికి ఏమీ లేకపోవడం వల్ల శిక్షాకాలం పూర్తికాకుండా, తిండిలేక మలమలమాడి మరణించాడు.

మనం చేసే పనుల పర్యవసానంగా మనకి వచ్చే కర్మఫలాన్ని, అందరికీ అర్థమయ్యే విధంగా తెలిపే కథ ఇది.

పాపం పుణ్యం అని ప్రత్యేకంగా ఎక్కడోఉండవు. ఎక్కడినుంచో పుట్టుకు రావు..

మంచిపనులు చేస్తే మంచి ఫలితాలువస్తాయి. దానినే మనం పుణ్యం అని

భావిస్తాం. దుర్మార్గపు పనులు చేస్తే.. ఆ పనులు భవిష్యత్తులో చెడ్డఫలితాన్ని అందిస్తాయి. దానినే పాపఫలం అనుకుంటాం.'ఎక్కడ ఏరకంగా ఉన్నా,ఈ మంచిచెడుల ఫలితాలు.మనల్ని వెతుక్కుంటూమన దగ్గరకు వస్తాయి.ఈ ఫలితాలను

తప్పించుకోవడంసాధ్యం కాదు. అందుకే మనసా వాచా కర్మణా ఋజువర్తనలో మెలుగుదాం.

- రమాప్రసాద్ ఆదిభట్ల

First Published:  5 Nov 2023 11:14 AM GMT
Next Story