Telugu Global
Arts & Literature

స్త్రీ అంటే? (కవిత)

స్త్రీ అంటే? (కవిత)
X

మన ప్రజాస్వామ్యపు

ఈ నవీన సమాజంలో

పల్లెనుండి ఢిల్లీ వరకు

ఇంటినుండి

పార్లమెంటు వరకు

స్త్రీలు పూజ్యు లంటారు

విషపు నవ్వులతో

మోహాపు చూపులతో

కొన్ని గోముఖవ్యాఘ్రాలు

విష సంస్కృతిలో పడి

కామ కోడె విషనాగులై

నీచ కామ పిశాచులై

విషపు బొట్లు చిందిస్తారు

చులకన భావంతో

పలు లైంగిక దాడులతో

కించ పరుస్తూ....

ఎలుగు బంటుల్లా

ఇకిలిస్తారు

కామకృత్యాల అకృత్యాలను

పదే పదే ప్రదర్శిస్తారు

ఈ కామ ముష్కరులు

తామూ ఓ మాతృమూర్తి

పవిత్ర గర్భాన పుట్టామన్న

ఇంగితజ్ఞానం కోల్పోతారు

ఈ నరరూప రాక్షసులు

ఎన్నెన్నో విలువలు

వల్లిస్తారు

దానవులకంటే దుర్మార్గంగా

మహిళల వలువలు

వలుస్తారు

స్త్రీ అంటే సెక్స్ సింబలుగా

ఫిక్స్ అయి పోతారు

విశృంఖల విషసంస్కృతిలో

కామ విషనాగులై కాటేస్తారు

ఒరేయ్! కామాంధులారా !

స్త్రీ అంటే?

భోగ వస్తువు కాదురా

పడికట్టు పదం కాదురా

అంగడి సరుకు కాదురా

ప్రాణం లేని మర బొమ్మ కాదురా

రాతి బొమ్మ కాదురా

స్త్రీ అంటే!?

అవతార మూర్తిరా !

మానవ జాతికి

బతుకు నిచ్చే

ఆడ బ్రహ్మరా !

అమ్మలగన్న మూలపుటమ్మరా !

సర్వ ప్రాణులు ఆరాధించే!

దేవతా మూర్తిరా !!

- పున్నయ్య పాతకోటి

(ఖమ్మం)

First Published:  26 March 2023 9:29 AM GMT
Next Story