Telugu Global
Arts & Literature

నాదే.. బాధ్యత (కథ)

Nade bhadhyatha
X

నాదే.. బాధ్యత (కథ)

పెళ్ళైన కొత్తల్లో వినోద్ వాళ్ళ అమ్మ నాన్న గారైన నారాయణ గారు, జానకమ్మ గారితో కలిసి ఉమ్మడి కాపురం లో ఉన్నారు.పుట్టింట్లో రమ్య చాలా గారాబంగా పెరిగింది. . వినోద్ వాళ్ళింట్లో దేవతార్చన మహా నైవేద్యాలు పెట్టడం ,మడి ఆచారం పాటిస్తున్న కుటుంబం...రమ్యకి మడీ ఆచారం తెలియదు. ఆమెను వాళ్ళింట్లో ముద్దుగాచూసుకున్నారు. రమ్య మనిషి మంచిదే కాని పని చేయాలంటేఅదేదో తన వ్యవహారం కాదు అన్నట్లు భావన.


అందరూ రమ్య ను ఇష్ఠ ప డే చేసుకున్నారు.." రమ్యది కళగల మొహం, బారెడు జడ , ఎంచక్కా రెండు మూరల మల్లె చెండు గాని సరిపోదు." అని అందరితో చెప్పుకొని మురిసి పోయేది జానకమ్మ గారు.... " "మరే నీకు నచ్చిన కోడల్నే సెలెక్ట్ చేసుకున్నావు కదా ! మీ ఇద్దరూ అన్యోనంగా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉండేది." నారాయణ గారు భార్య తో హెచ్చరికగా అన్నారు.

ఆయన మాటల్లో అంతరార్థం అర్థమయి ఆవిడ కోపంగా ఓ చూపుచూసి గొణుక్కుoటూ అక్కడి నుంచి పని ఉన్నట్లు పెరట్లో కి వెళ్లిపోయింది.

పదహారు రోజుల పండుగ రోజులలో రమ్య,వినోద్ లు హానీమూన్ కోసం కర్ణాటక స్టేట్ వెళ్లారు. అక్కడ . బృందావన గార్డెన్స్, చాముండి టెంపుల్, మైసూర్ ప్యాలెస్, చూసారు., హలిబీడు లో శిల్పాల అందాలు చూసి ముగ్ధులయ్యారు. శెలవు అయిపోవటం తో తిరిగి వచ్చేసారు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు చేరిపోయి బిజీ అయిపోయారు.

రమ్య బ్యాంక్ నుంచి ఇంటికి రాగానే అలిసి పోతోంది. ఇంటి నుంచి రమ్య వాళ్ళ బ్రాంచ్ చాలా దూరం. బస్సు ప్రయాణం తో చికాకు. ఇంటికి వచ్చి, రాగానే స్నానం చే సి నైటీ వేసుకొని రిలాక్స్ అవుతుంది. తరువాత జానకమ్మ రమ్యకి కాఫీ కలిపి ఇస్తుంది. రమ్య కాఫీ త్రాగి, పుట్టిoట్లో అలవాటు ప్రకారం తాగిన చోటే తాగిన కప్పుని వదిలేస్తుంది..

వినోద్ వాళ్ళిoట్లో తిన్న ప్లేట్స్ తాగిన కప్పులు కడిగే చోట వేరేగా. వెయ్యటం అలవాటు. వంటచేసిన గిన్నెలు విడిగా వేరే చోట ఎంగిలి కంచాలకు కలపకుండా వేసి వినోద్ వాళ్ళ అమ్మే తోముకునేది. మడి కట్టుకొని వంట చేయడం భోజనం చేసేటప్పుడు మడి గా వేరే బట్టలు కట్టుకొని భోంచేయడం ఆచారం. తిన్నచోట పసుపు నీళ్ళు చల్లి శుద్ది పెట్టుకొని తుడుచు కోవాలి.అప్పుడు చివరికి జానకమ్మ గారు అన్నం తిని మడి బట్ట విడిచి ఉతికిన చీర కట్టుకొని కాసేపు నడుం వాలుస్తుంది.


ఆ తరువాత 2గంటలకు కాఫీలు కలిపి తినటానికి, ఏదో నోటికి కరకర జంతికలు , చేగోడీలు, లాంటివి భర్తకు పెట్టి కాఫీ ఇచ్చి తను కూడా ఓ కప్పు కాఫీ తెచ్చుకొని త్రాగుతూ కబుర్లు.చెప్పుకుంటారు.. ఆ తరువాత.ఎంగిలి కంచాలు, తాగిన కప్పులుతోముకుని తుడిచి కొని , వాటిని వేరే గా సర్ది పెట్టడం.. జానకమ్మ గారి అలవాటు.

ఆఫిస్ నుంచి వచ్చిన తరువాత విప్పిన బట్టలు వేరేగా రూం లో పెట్టీ, ఇంట్లో వేసుకునే బట్టలు తో ఇంట్లో లోపల గదుల్లోకి రావాలి. శుచి శుభ్రత పేరు మీద చేసే ఈ కార్య క్రమాన్ని రమ్య కు చాదస్తం లా అనిపిస్తుంది.

పొద్దున లేవగానే కాఫీ పెట్టుకుందాం అనుకుంటూ రమ్య మొహం కడుక్కొని వంటింట్లో కి అడుగు పెట్టింది. జానకమ్మ అప్పటికే లేచి స్నానం చేసి, తులసి దగ్గర దీపం పెట్టుకొని దేముడి గది లో పటాలకి ముందటి రోజు మాలిన్యపూలు ,

అక్షతలు కుంకుమ మొదలైనవి విడి విడిగా తీసి అక్షతలు నెత్తిమీద వేసుకొని పూజ కుంకుమ నుదుటికి పెట్టుకొని పటాలు తుడుచుకొని, విగ్రహాలు ,దేముడి పాత్రలు తోముకుని..ఓ వారగా బోర్లించి పెట్టేది. నారాయణ గారు సంధ్య వార్చుకొని, శివాభిషేకం చేసుకుంటారు. అందుకు అనువుగా అన్నిసర్దిపెడుతుంది ఆవిడ.

ఎవరూ స్నానం చే యకుండా వంటింటి లోకి ప్రవేశం లేదు. జానికమ్మ గారు కాపురానికి వచ్చినప్పటి నాటి నుండీ ఈ క్రమశిక్షణ పాటిస్తుంటారు .వినోద్ కి కూడా ఈ క్రమ శిక్షణలోనే పెరిగాడు. రమ్యది వేరే వాదన . ముందు రోజు సాయంత్రం స్నానం చేసి ఉతికిన నైటీ కదా వేసుకుంది. తెల్లారే మయిల బట్టలు ఎలా అవుతాయి.?

పెళ్ళైన స్త్రీ లు ఉదయమే స్నానం చేయాలని ఆ తరువాతే బయటకు చీర కట్టుకొని రావాలని పగలు నైటీ తో తిరగ కూడదని పెద్దావిడ

అభిప్రాయం .చిన్న పిల్ల పాపం గారాబం . పద్ద తులు నేర్పాలని పెద్దావిడ ఆలోచన. ఆవిడ మాటలు రమ్యకు సాధింపులా.. ఆచారం వంక తో తన్ను ఇబ్బంది పెడుతున్నదని

రమ్య అనుమానం.

శెలవురోజుల్లో కొత్త జంటను హాయిగా హైదరాబాద్ లో చూడ వలసినవి చూసి రమ్మని పర్యాటక ప్రాంతాలు సరదాగా అలా అలా తిరిగి రమ్మని ప్రోత్సహించేది. కాని బయలు దేరే టప్పుడు..చేతికి ఓ పెద్ద బుట్ట నిండా తినడానికి పులిహోర, కాని దద్ద్దో జనం కాని ,చక్రాలో కజ్జి కాయలో, పండ్లు నీళ్ళ బాటిల్ తో సహా ఓ పెద్ద లగేజీ ఇచ్చేది.

ఇలాటివి రమ్య కి విసుగు చాదస్తం లా ఫీల్ అయ్యేది. బయటకు వెళ్లి, మంచి హోటల్లో భోంచేసి, పాని పూరీలు, బర్గర్లు తింటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపాలని ఆమె ఉద్దేశ్యం. శుచి శుభ్రత తో తను చేసినవి తింటే మంచిదని వాళ్ళఅమ్మ ఉద్దేశ్యమని వినోద్ రమ్య కి నచ్చచెప్పే టప్పటికి అతనికి తలప్రాణం తోకకు వచ్చేది. అత్త గారి భావాలు, రమ్య అలవాట్లు పొంతన కుదర టంలేదు.


ఇలా చూస్తుండగా వాళ్ళ పెళ్లయి నాలుగు నెలలు గడిచిపోయాయి. పెద్దావిడ రథ సప్తమి రోజు కోడలి చేత పువ్వు తాంబూలం, నోము పట్టించాలని ఉత్సాహ పడింది. అలా నోము వివరాలన్నీ చెప్పి రమ్య ను ఒప్పించారు.పొద్దున్నే తల స్నానాలు, పూజలు ,తాంబూలాలు. ఇచ్చి ఆఫీస్ కు పరిగెత్తేది . ఇలాంటి విషయాల్లో అంత శ్రద్ధ లేని రమ్య లో కొన్నాళ్లకు విసుగు, కోపం . అదంతా అనవసర శ్రమలా,అనిపించే ది.

ఆ తరువాత శ్రావణమాసం లో మంగళ గౌరీ నోములు మొదలయ్యాయి. రమ్య ను వాళ్ల అమ్మ వాళ్ళు తీసికెళ్ళి నోము పట్టించారు. వరలక్ష్మి వ్రతం రోజు న వినోద్ వాళ్ళు కుటుంబం. రమ్య వాళ్ళింటికి వెళ్లి శ్రావణ మాస సారే

లొ పట్టు చీర బంగారు గొలుసు పెట్టీ భోజనం చేసి, రమ్యవారింటి సత్కారాలకు తృప్తి పడి ఆనందించి వెళ్లారు.

ఓ నెల్లాళ్ళుగడిచింది పోయాయి. రమ్య తిరిగిఅత్తగారింటికి వచ్చింది. మళ్లీ రొటీన్ ..ఉద్యోగం .

ఇల్లు.. ఈ వరవడిలో పడి పోయింది . రమ్య మంగళ గౌరీ నోము లు, వరలక్ష్మి వ్రతాలతో.. కొంచెం మడి, ఆచారం అవగాహన కు వచ్చింది. అత్తగారిఇంటి ఆచారాలుకు అలవాటు పడుతోంది.

ఉన్నట్టుండి ఒక రోజు రమ్య అత్తగారు మంచి నీళ్ళ బిందేతో గుమ్మం దాటబోయి కాలు జారీ దబ్బున పడిపోయి "అమ్మో" అంటూ పెద్ద గాకేక పెట్టారు. బిందె జారీ కాళ్ళ మీద పడి దొర్లి పోయింది.ఆవిడ కేక విని రమ్య మామగారు, భర్త వినోద్ పరుగున. వచ్చారు..ఆమెనులేపి ఎత్తుకుని లోపలకు తీసుకు వచ్చి మంచం పై పడుకో బెట్టారు.ఆవిడ బాధతో "చచ్చానురా బాబు" అంటూవిలవిల్లా డుతూ పెద్దగా ఏడుస్తున్నారు..రమ్య కుఏం చేయాలో తోచటం లేదు.భర్త మామగారు ఏది చెపితే అది అసంకల్పితంగా చేస్తోంది.టవల్ తో ఒళ్ళు మొహం తుడిచింది .డాక్టర్ కి కబురు పెట్టారు. ఆయన వచ్చి చూసి "కాలు ఫ్రాక్చర్ అయిందని పిస్తోంది. ఆవిడను

హాస్పిటలలో అడ్మిట్ చేస్తే. పరీక్షలు చేసి ఆపై ట్రీట్మెంట్ ఏం చేయాలో నిర్ణయించాలి. "అని చెప్పి కొన్ని ఉపశమ న మందులు రాసిచ్చి, వెళ్లారు.

వినోద్ తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేసి సలహా తీసుకొని నగరం లో మంచి కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్చారు. అనుకున్నంతా అయ్యింది.ఆవిడ కాలికి ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్ వేశారు ఈ దెబ్బతో ఆవిడ మంచాన పడ్డారు.

ఆవిడ చాలా ఉత్సాహంగా నిత్యం క్రమశిక్షణతో పని పాట.పూజ పునస్కారం చేసేవారు. పాపం ఒక్క మ్మాటుగా మంచాన పడేటప్పడికి దిగాలు పడిపోయారు. ఇంట్లో పని ,అనుష్ఠానం ఎలా

జరుగుతుంది? ఆవిడ పడిపోయిందని తెలియగానే వచ్చి సహాయ సహకారాలు అందించిన బంధువుల వల్ల కొంత సాంత్వన లభించింది. ఒ కొక్కరే..ధైర్యం చెప్పి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.

రమ్య, వినోద్ కొన్ని రోజులుశెలవు తీసి కున్నారు. వాళ్ళు ఉద్యోగాల్లో చేరాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. ఇన్నాళ్లు వినోద్, వాళ్ళ నాన్న గారు నిత్య సంధ్యా వందనం చేసుకొని ఏ పండో బెల్లము ముక్కోనైవేద్యం పెట్టి శాస్త్రం ప్రకారం మమ అనిపించారు. ఇక ముందు.. అన్నీ ప్రశ్నార్థకమే!

ఒక్కమారు వినోద్ కి తల్లి చేసేన సేవ ఎంతటిదో అర్థం అయ్యింది. నారాయణ గారు ఖిన్నులై పోయి లంఖనం పడ్డవారీ లా అయిపోయారు.

అందరి కంటే ఎక్కువ బెంబేలు పడ్డది..రమ్య .అత్తగారు చేసే పనులు చాదస్తం లా అనిపించినా..తను పైపనులు తప్ప అసలు వంట వార్పు,నైవేద్యాలు .మడి కట్టుకొని వండటం.గురించి.పట్టించుకోలేదు. అత్తగారు కూడా మనసులో ఏం అనుకున్నదో తెలియదు.. తను మటుకు ఇల్లు ఊడవటం.. తుడవడం.. కాఫీ గ్లాసులు టిఫిన్ ప్లేట్స్ కడగ టమ్మో..చేసేది.


పనిమనిషి..నీ పెట్టుకోరు. ముట్టూ,అంటూ కలుస్తుందనీ అనుమానం . తెల్లార్జామున లేచి ఆవిడే అన్నిపనులు చేసుకునే వారు. రమ్య వీధి గుమ్మంఊడవటం,ముగ్గు పెట్టడం..చేసేది. రమ్యకి అలవాటు లేని పని.పుట్టింట్లో పనిమనిషి ఉండేది..

అత్తగారు మడి విడిచేవరకు...ఏది చేతితో అందుకోరు. క్రింద పెడితే నీళ్ళు జల్లి, తీసి కుంటారు.తను నెలసరికి చాలా నిబంధనలు. చాప,చెంబు..తో మూలకు వెళ్లి మూడు రోజులు ఉండినాల్గవ రోజు స్నానం బోలెడు బట్టల తడుపుడు.. ఉతుకు డు...మళ్లీ మర్నాడు స్నానం చేస్తే గాని పూర్తి శుద్ధి కాదు.

ఈ మడి,ఆచారాలు..ఎవరు పెట్టారోబాబూ! ఆడవాళ్ళు చదువులు ఉద్యోగాలు చేసుకుంటూ ఇవి పాటించా లంటే...ఇబ్బందే.

జానకమ్మగారు ఆ మాట ఒప్పుకోరు. ఓ వైష్ణవుల కుటుంబం..లో అందరువిద్యావంతులే..పెద్ద.. చదువులు..ఉద్యోగాలు చేస్తున్న వారే. వాళ్ళ కోడలు డాక్టరేట్ చేస్తూ మడి పాటిస్తూ ప్రసాదాలు చేస్తూ ఆమె భర్తకి అనుష్ఠానం లో అన్నీ అమర్చి పెడుతూండటం.వారు పనిమనిషి నీ కూడా స్నానం చేసి మొదటగా వారింటికి రావాలని ఆంక్ష పెట్టారుట. ఆమనిషి నాలుగు నెలలు చేసి ఊరికి వెళ్లిపోయిందిట. వీళ్ళు మళ్ళీ ఎవరినీ పెట్టుకోలేదు ట.ఇలాంటి ఉదాహరణలు చూపించి నోరుమూయిస్తారు.

ఇప్పుడు ఆవిడని చూసుకోవాలి.. ఈ ఆచార పద్దతులుపాటించాలి .

రమ్య వినోద్ తో తన అశక్తత గురించి చెప్పి, తన భయాన్ని కూడా బయట పెట్టింది.అతనూ కూడా ఆలోచించాడు. మర్నాడు తండ్రి తో ఈ ఇబ్బందులు గురించి ప్రస్తావించాడు..

"కొన్నాళ్ళు మా అమ్మని రమ్మ ని అందామా?తనకు కొంచెం ధైర్యంగా తోడుగా ఉంటుంది."సంశయం. తో ఆలోచనలో పడ్డది రమ్య. అమ్మ వస్తుందో రాదో? మొహమాటం పడుతుందేమో!

మర్నాడు వెళ్లి అమ్మను కలిసింది రమ్య.. "నాన్న సంగతి ఎలా? " పెద్ద ప్రశ్న! "నాన్నతో మాట్లాడ తాను.నువ్వు బెంగ పడకు! ఏదో మార్గం చూద్దాంలే! "అన్నది రమ్య తల్లి..

వినోద్ కూడా వాళ్ళ నాన్నతో సంప్రదించాడు. ఆయన"నిజమే! రమ్య చిన్న పిల్ల! పైగా ఉద్యోగం చేస్తోంది.మన ఇంట్లో పద్ధతులకు అలవాటు పడ లేదు ఇంకా! మనకు దేవతార్చన పెద్దల నుంచి వచ్చింది. దానిని వదులుకో లేము. ఒక పని చేద్దామా? నీవు నేను వంట ప్రసాదాలు మడిగా చేసుకుందాము.ఆ అమ్మాయి పై పనులుచేస్తుంది. ఏమంటావ్! "

"మీరేం చేయగలరు? పెద్ద వారు అలవాటు లేదు కూడా!"

" మీ అమ్మ మంచం మీద పడుకునే మనకు ఎలా చేయాలో చెపుతుంది. కొన్నాళ్లకు మనకు అలవాటు అవుతుంది."

"మరి అమ్మ సంగతి? బెడ్ లోంచి లేవ లేదు కదా! ఆవిడని కూడా చూసుకోవాలి గానాన్నా !"

"కొన్నాళ్లే కదరా వినోద్! భర్తగా ఆమె సేవలు ఇన్నాళ్లు పొందాను. ఇప్పుడు సేవ చేసుకునే అవకాశం వచ్చింది.

సినిమా నటుడు రంగనాథ్ భార్య అనారోగ్యం పాలైతే కెరీర్ కి ఇబ్బందైనా తన భార్యకు చివరి దాకా సేవలు చేశాడు.చివరికి అంతటి నటుడు,మంచి రచయిత కూడా వంటరి తనం భరించ లేక ఆత్మ హత్య చేసుకున్నాడు.

మీ అమ్మ కొన్నాళ్ళకి మందులతో ఫిజీయో థెరపీ తో మంచి ఆహారంతో, తొందరగానే కోలుకోవచ్చు కదా! ముఖ్యంగా; తను లేని పరిస్థితి లో కూడామన పని మనం చేసుకొని ధైర్యం గా నిలబడ గలిగితే..ఆమెకు మనగురించిదిగులుపోతోంది.తనకు తనఆపరేషన్ వల్ల కలిగిన బాధ కంటే ..తన లేకపోతే మనం ఎలా బతుకు తామో అనే బెంగ ఎక్కువ"అని చెప్పిఒక నిర్ణయానికి వచ్చినట్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలారు.


రమ్యా వాళ్ల అమ్మ,నాన్న కూడా ఒక నిర్ణయానికి వచ్చారు.రమ్య వాళ్ల అత్తగారిని, మామ గారిని వాళ్ళతో తీసికెళ్ళి.. ఆవిడ కోలుకొని మామూలు మనిషి అయ్యేవరకు వాళ్ల ఇంటిలో..ప్రక్కనున్న ఖాళీ పోర్షన్ లో వాళ్ళను ఉండమని...దేవతార్చన విగ్రహాలు పెట్టుకొని అనుష్ఠానం చేసుకునేటట్లు..వారికి అన్ని విధాలాసహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. రమ్య ,ఆమె భర్త వినోద్ వారి ఇంట్లోనే ఉండి..వారి వారి పనులకు వెళతారు . రోజూవచ్చి వారిద్దరూ పెద్దవాళ్లను చూసి వెళతారు.ఇదీ వారి నిర్ణయం!

రమ్య వాళ్ల అమ్మానాన్న మర్నాడు రమ్య అత్తగారిని చూడటానికి వచ్చినట్లు వచ్చి,‌,వాళ్ల అభిప్రాయం చెప్పి,వారిని తమ ఇంటికి ఆహ్వానించారు.

రమ్య మామగారు" మీ ఆహ్వానానికి ధన్యవాదాలండీ! మా శ్రేయోభిలాషులు..గా మీరు మమ్మల్ని ఇబ్బందులలో సహాయం చేయాల నే మీ మంచి మనసుకు ఆనందంగా ఉంది. మరొక్క సారి ధన్యవాదములు! నా భార్య పెళ్ళైన దగ్గరనుంచి బాధ్యతగా ఒక మంచి ఇల్లాలుగా నా కుటుంబానికి ,, ఎంతో సేవ చేసింది.నా చెల్లెళ్ళ పెళ్ళి బాధ్య తలు, మా తమ్ముళ్ల చదువులు చదివించటంలో వారు ఒక ఇంటి వారయ్యేవరకు నా బాధ్యతల్లో నాకు అండగా నిలబడింది. వదిన అంటే ఒక తల్లిగా పెద్దరికం వహించింది.

ఈ నాడు తను కాలు కి ఆపరేషన్ అయ్యి లేవలేని స్తితిలో ఉంది. ఇప్ప డు మాకు తను ఒక సమస్య అయ్యానని బెంగ పడుతోంది మేము ఇల్లు వదిలి మీ ఇంటికి వచ్చినా మా వల్ల మీరందరూ ఇబ్బంది పడటం

, మేము పరాయి పంచ చేర వలసి వచ్చిందనే విషయంలోనూ బెంగ పెట్టుకుంటుంది. ఇన్నాళ్లు నాకు,నా వాళ్ళకి సేవ చేసింది. ఇప్పుడు కొద్దికాలం నేను ఆవిడ కు సేవ చేసే అవసరం వచ్చింది. భ ర్తగాఈ బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటాను. మీ సహకారానికి ఎంతో ఆనందంగా ఉంది. "

"ఈ రోజుల్లో ఆడ పిల్లల తల్లి తండ్రులు అత్త గారింటి లో తమ కూతురు ఏ బాదరా బందీ లేకుండా, బాధ్యత లేకుండా ఉండాలని కోరుకుంటున్నా రు. మీరు మంచి మనసుతోమీ అమ్మాయికి అత్తింటి బాధ్యతలు స్వీకరించాలని నేర్పించారు. మాకు ఇంతకంటే అదృష్టం ఏమి కావాలి? మీరు మీ మంచి మనసుతోమమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించారు. అందుకు ఎంతో కృతజ్ఞతలు.నాభార్య బాధ్యత స్వయంగా నేనే తీసుకుంటా ను. మీ అమ్మాయికి మా అబ్బాయి ఇంటి పనుల్లో సహకారం అందిస్తూ ఉంటాడు.మీ రు అప్పుడప్పుడు వచ్చి మాకు తగిన సలహాలు సూచనలు ఇవ్వండి. చాలు. మీకు

ధన్యవాదములు." నవ్వుతూ నమస్కారం చేశారు నారాయణ గారు..

ఈ పరిష్కారం అందరికీ సమంజసంగానే అనిపించింది. విన్న వారి అందరి మనసులు తేలిక పడ్డాయి. మళ్లీ ఆయనే ఇలా అన్నారు - "నా భార్య జానకీ

కోడలిగా, వదినగా ,ఒక తల్లిగా మా తల్లి తండ్రులు మాట తు.చ. తప్పకుండా విని మా ఇంటిఆచా రాలు పాటించింది. ఏ ఒక్కనాడు విసుగు చూపలేదు. ..ఓర్పుతో కలివిడిగా ఆందరితో మసిలి..అందరికీ ప్రేమ పాత్రు రాలయ్యింది. ఇవాళ ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది...తొందరగా నే లేచి నడుస్తుందిఅని నా నమ్మకం.నేను నా భార్యకు సేవ చేసుకునే అవకాశం ఈ విధంగా వచ్చింది అనీ అనుకుంటున్నాను.మేము.. మా పనులు మేము..చేసుకోగలిగితే అదే నా భార్యకు మనోబలం ఇస్తుంది.కాని ఇల్లు వదిలి వెళితే ఆత్మ న్యూనతా భావానికి లోను అవుతుందేమో! మీరే అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళండి. మరో మాట. ఈI రోజుల్లో ఆడపిల్లల తల్లి తండ్రులు తమ గారాల బిడ్డ అత్త మామల ఇంట్లో దర్జాగా ఉండాలి! అత్తింట్లో ఏ భాద్యతలు ఉం డ కూడదు . ఏ చిన్న మాట అనకూడదు...కూతురూ,

అల్లుడూ మాత్రమే అన్యోన్యంగా ఉండాలి. తమ అమ్మాయి పని చేస్తే అలసిపోతుంది. తమ అమ్మాయి ని ఏమి అనకూడదు.. అనుకుంటారు.

అలా కాకుండా... మీరు, మీ అమ్మాయి మమ్మల్ని మా సమస్యను.. సహృదయం తో అర్థం చేసుకొని స్నేహ హస్తం అందిస్తున్నారు. మీ మంచి మనసు కు నా జోహార్లు.! కొండంత ధైర్యంగా ఉన్నది.. మీ అభిమానానికి కృతజ్ఞతలు "అన్నారు. నారాయణ గారు నమస్కారం చేస్తూ.

పి.బాలాత్రిపురసుందరి

Next Story