Telugu Global
Arts & Literature

అనుభవం: ఆడ పిల్లలూ బహుపరాక్. !

అనుభవం: ఆడ పిల్లలూ బహుపరాక్. !
X

ఐ ప్యాడ్లో యూ ట్యూబ్లో వార్తలు చూస్తున్నాను.ఇంట్లో ఎవరూ లేరు.హరీష్ స్కూల్ కీ ,హరిత కాలేజీకి ,భర్త ఆఫీసుకీ వెళ్ళారు.

ఆ వార్తల్లో ఓ ఘోరమైన హత్యాచారం కేసు గురించి చెప్తున్నారు. పదిహేనేళ్ళ బాలికను ప్రేమని తిరస్కరించిందన్న కోపంతో, కత్తితో పద్నాలుగు సార్లు పొడిచి, పొడిచి చంపిన ఓ యువకుడు.

ఒక్కసారిగా షాక్ అయ్యాను.కాలేజీకి వెళ్ళిన పదహారేళ్ళ కూతురు హరిత మదిలో మెదిలింది.ఆడపిల్లలకి యుక్త వయసు రాక ముందే తల్లులు మెచ్యూరిటీ గురించిన అవగాహన కలిగించాలని నమ్మేవాళ్ళల్లో తనూ ఒకత్తె కాబట్టి ఆ వివరాలన్నీ తను మెచ్యూర్ అయ్యే ముందే చెప్పింది.

కానీ ఇలా ప్రేమించమని అబ్బాయిలు బలవంతపెడితే ఆ సిటుయేషన్ని ఎలా ఎదరుకోవాలో మాత్రం చెప్పాలని తోచలేదు.

పిల్ల కాలేజీనుంచి ఎప్పుడొస్తుందా ఎప్పుడెప్పుడు తనని ఎలర్ట్ చేద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

ఇంతలో హరీష్ స్కూల్నుంచి వచ్చాడు. వాడికి కావలసినవి పెట్టి ఆడుకోవటానికి పంపాను. దాదాపు ఆరవుతుండగా హరిత కాలేజీనుంచి వచ్చింది. తను ఫ్రెష్ప్ అవుతుండగా తనకి బూస్ట్ కలిపి తసుకొచ్చాను.

హరిత రాగానే బూస్ట్ ఆమెకిచ్చి తనని బెడ్రూంలోకి తీసుకెళ్ళాను. తను తాగుతుండగా నేను మధ్యాహ్నం చూసిన విడియో చూపించాను. తను చూస్తుంటే హరిత ముఖకవళికలను పరిశీలనగా చూడటం మొదలు పెట్టాను. తన ముఖకవళికలు నెమ్మది నెమ్మదిగా మారడం గమనించాను. అంతా చూసినాక, హరిత చిగురుటాకులా వణికి పోయింది. “ అమ్మా ఇదేంటమ్మా ఇలా ఉంటారా అబ్బాయిలు?” “ మరి కనిపించిన ప్రతివాడూ ప్రేమిస్స్తున్నానంటే ఎలాగమ్మా? వాడు ప్రేమిస్తే ప్రేమించాడు మమ్మల్నికూడ ప్రేమించమని బలవంతం చేస్తే ఎలా అమ్మా? దానికి చంపటమే సొల్యూషనా? అబ్బాయిలు ఎందుకుట్లా తయారవుతున్నారమ్మా?” అన్నది ఆవేశంగా!

“ఆవేశపడకురా తల్లీ! నేను చెప్పేది విను. మాకాలంలో అబ్బాయిలు ఇలా ప్రవర్తించేవారు కాదు.ఈ రోజులలోనే ఆధునికత పెచ్చు మీరి పోవడం మూలాన సినిమాలూ, టీవీలు, స్మార్ట్ ఫోన్ల ప్రభావం వల్ల అబ్బాయిలలో ఉద్రేకం,హింస ప్రతీకార వాంఛ ఇవన్నీ ప్రబలిపోయయినాయి.కాబట్టి మనం జాగ్రత్తగానూ, మెళుకువతోనూ ఈ సమస్యను టాకిల్ చేయాలి.

అసలు నీకు తెలుసా అమ్మా, టీనేజ్ అబ్బాయిలు గాజు వస్తువుల వంటివారు. వాళ్ళను, ‘హాండిల్ విత్ కేర్ అని’ గ్లాస్వేర్ ప్యాకింగ్ల మీద రాస్తారే, అలా టాకిల్ చేయాలి.”


"అంటే ఎవడైనా ఓ ఆడపిల్ల దగ్గరకు వచ్చి, 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడ నన్ను ప్రేమించు'అని బలవంతపెడితే, అతనితో ఏకంగా 'నేను నిన్ను ప్రేమించటంలేదు

'అని ఖరాఖండీగా చెప్తే మాత్రం చాలా చాలా ప్రమాదం! ఇటువంటప్పుడే ఆడ పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి.ఎందుకంటే ఒక ఆడపిల్ల రిజెక్ట్ చేసిందంటే వాళ్ళ యువరక్తం ఉడికి పోతుంది. అంతే కాదు ఒక ప్రక్క రోషం ,మరో ప్రక్క బిపి వగైరా పెరిగి పోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ మేల్ ఇగో దెబ్బ తింటుందన్నమాట! వాళ్ళకి అది ఒక పెద్ద ప్రిష్టేజ్ ఇష్యూ అయి కూర్చుంటుంది.ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే! అతనితో ఏమనాలంటే “ చూడు బాబూ మా అమ్మా నాన్నా నన్ను చదువు

కోవటానికి కాలేజీకి పంపుతున్నారే కానీ ప్రేమా దోమా అని పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి కాదు. నాకు లైఫ్లో ఓగోల్ ఉంది. ఆ గోల్ నెరవేరి నేను నా కాళ్ళమీద నిలబడిన తరువాతనే ప్రేమా, పెళ్ళీను. నాకు నీ మీద విముఖత ఏమీ లేదు…..అలా అని ప్రేమగూడ లేదు. నేను దానికి సిద్ధంగా లేను.నువ్వుకూడ నీ చదువు మీద కాన్స్ంట్రేట్ చేయి. ఆ తరువాత ప్రేమ, పెళ్ళీ గురించి ఆలోచించవచ్చు "అని హితవు పలకాలి. అంతేకాదు - "నాకు నీ మీద కోపంగానీ ద్వేషంగానీ ఏమీ లేవు…..సారీ ఏమీ అనుకోవద్దు "అని సౌమ్యంగానే చెప్పాలి. అర్థం అయిందా అమ్మా! "

"ఇంకొక్క విషయం ఏంటంటే , ఈ విషయాన్ని ఒక్క నీ బెస్ట్ ఫ్ర్ండ్ కి మాత్రం చెప్పి ఉంచాలి, ఎందుకైనా మంచిది. లేకపోతే .మాకు చెప్పుకో! "

“ అమ్మా! మరి అతను అప్పటికీ మాట వినకపోతే ఎం చేయాలమ్మా?”ప్రశ్నించింది హరిత.

"అప్పుడు మేమే రంగంలోకి దిగుతామమ్మా! ఏం భయపడవద్దు. అంత దూరం వస్తే నాన్న నేనూ ఊరుకుంటామా? పోలీసు కంప్లెయింన్ట్ ఇచ్చి వాడ్ని కటకటాల వెనక్కు పంపిగానీ వదలము. ఇదంతా నిన్ను ఎలర్ట్ చేయటానికే చెప్పానమ్మా!” అన్నాను.

"చాలాథాంక్స్ అమ్మా "అంటూ నన్ను వాటేసుకుంది నా బంగారు తల్లి!

సో !ఆడ పిల్లలూ బహుపరాక్!!!

-మాధవపెద్ది ఉష

First Published:  30 Jan 2023 6:53 AM GMT
Next Story