Telugu Global
Arts & Literature

రాయల్ చైర్ ( కథానిక)

రాయల్ చైర్ ( కథానిక)
X

సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటింది అది ప్రభుత్వ జననమరణాల ధృవీకరణ కార్యాలయంలో అందరూ హడావుడిగా తిరుగుతున్నారు కొందరి ముఖాలలో చెప్పలేని బాధ, కొందరిలో నిరుత్సాహం, మరికొందరు సాదా సీదాగా తమకేమి పట్టనట్టు తిరుగుతున్నారు ....

సహజంగానే భావాతీతంగా వుండే పరంధామయ్య మాత్రం మిగిలిన పనిని సాయంత్రం లోగా పూర్తి చేయాలని తొందరగా తొందరగా సంతకాలు పెడుతూ పూర్తి చేస్తున్నాడు.

అనుకున్న సమయం రానే వచ్చింది సాయంత్రం అయిదు గంటలైంది మెల్లిగా వీడ్కోలు సభ మొదలైంది ఒక్కొక్కరూ కుర్చీల్లోకి చేరుతున్నారు. అధికారులంతా సమావేశం అయ్యారు. సభ మొదలు అయింది ముఖ్యఅథిది తన ప్రసంగాన్ని మెదలెట్టారు....

Advertisement

"పరంధామయ్యగారు రిటైర్ అవుతున్నాడంటే కొందరికి బాధ, మరికొందరికి సంతోషం. వీరు చిన్న వయస్సులో ఉద్యోగంలో చేరి అంచలంచలుగా పెద్ద గెజిటెడ్ అధికారిగా ఎదిగారు, దానికి వారి దీక్ష,పట్టుదల,నీతి నిజాయితి క్రమశిక్షణతో పనిచేసేతీరే వారిని ఉద్యోగంలో ఉన్నత స్థానంలో నిల బెట్టింది. వారినుండి మనమంతా, ముఖ్యంగా యవత ఎంతో నేర్చుకోవలసినది వుంది.

"ప్రతి ఉద్యోగస్తుని జీవితంలో తప్పని రోజు .ఉద్యోగానికి మాత్రమే విశ్రాంతి. మిగతా జీవితానికి నాందిగా, పునాదిగా నేను భావిస్తున్నాను అందుకే నేను తీసుకున్న నిర్ణయం మీకు తెలియచేస్తున్నాను "

Advertisement

"ఎంత కాలమైతే నేను పెన్షన్ తీసుకుంటానో అంతకాలం మన ఆఫీసుకి వారానికి ఒక రోజు కేటాయించాను . ఆ రోజు స్వచ్చందంగా ఆఫీస్ లో ఎవరికి ఏరకమైన సహయం కావలసి వచ్చినా చెయ్యాలని నిర్ణయం తీసుకొన్నాను.దానికి అవసరమైన విధంగా అంటే ప్రత్యేకమైన వసతి కేటాయించబడినది . నా పై అధికారుల అనుమతితో ఏర్పాటు చెయ్యబడినది."

"నాలాగే విశ్రాంత సేవా తత్పరులైన ఉద్యోగులందరు వచ్చి ముందు తరం వారికి పనిలో మెలుకువలు నేర్పటానికి అనుమతి తీసుకొన్నాను. నా సలహాలను అనుభవాన్ని అందించ తలచుకున్నాను. కాబట్టీ మీ అందరి నుండిదూరమౌతున్నాను అనే భావన నాకు ఇక లేదు, అంతేకాకుండా ఎవ్వరికీ ఏవిధమైన సహాయం చెయ్యడానికైనా నేను సిద్దంగా వున్నాను. నా కుర్చీ మారింది ఇక్కడ అంతే !"అంటూ చిరునవ్వుతో చేతులు జోడించాడు.

" మరొక్కమాట నా దగ్గర ఎన్నో పుస్తకాలు మన భారత దేశ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించినవి వున్నాయి . మీకు వాటిని తెలుసు కోవాలనుకునే వారు మా ఇంటి దగ్గరే ఏర్పాటు చేయబడిన మినీ గ్రంధాలయానికి రావచ్చు చదువుకోవచ్చు. మీ సందేహాలను నాకు తెలిసినంత వరకు నివృత్తి చెయ్యగలను కూడా!! ".అంటూ తన ప్రసంగాన్నీ ముగించాడు.

ఒక్కోసారిగా కరతాళ ధ్వనులతో హాలంతా మారు మ్రోగింది .

అభినందనల మాలలతో , అభిమానుల సత్కారాలతో బరువెక్కిన హృదయంతో ఇంటికి చేరిన పరంధామయ్యకు హాలులో కొత్తగా ఓ రాయల్ కుర్చీ దాని పక్కనే చిన్న బల్లపై ఆయన నిత్యం చదివే భగవద్గీత ఎదురుచూస్తూ కనిపించాయి.

- లలితా చండి

Next Story