Telugu Global
Arts & Literature

కాసేపు జోక్స్ తో నవ్వుకుందాం

కాసేపు జోక్స్ తో నవ్వుకుందాం
X

రెడ్ లైట్ ఏరియా :

-----------------

ఇనస్పెక్టర్ : రెడ్ లైట్ ఏరియాపై రైడింగ్ చేయమంటే నీవు ఎందుకు చేయటం లేదు?

పోలీస్ : రెడ్ లైట్ వెలుగుతున్న వీధి ఒక్కటి కూడా కన్పించలేదు సార్!

***

వరద – బురద:

---------------

రిపోర్టర్ : ఈ భారీ వరదలపై మీ అభిప్రాయం ఏమిటి?

నాయకుడు : నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్షాల మీద చల్లటానికి కావలసినంత బురద కొట్టుకొచ్చినందుకు

*

లిక్విడ్ క్యాష్:

-----------

మమ్మీ : బంటీ! ఇదేమిటిరా! డబ్బుల్ని ఇలా నీళ్లల్లో పెట్టావ్?

బంటీ : మామ్మీ! నిన్న నువ్వే కదా “మనకు లిక్విడ్ క్యాష్” కాడా కావాలని చెప్పావు. అందుకనే ఇలా చేశా!

**

షుగర్ ఫ్రీ:

----------

డింగరి : అర కిలో స్వీట్ ఇవ్వండి సార్!

షాప్ వాడు : ఇదిగో మీరడిగిన స్వీటు

డింగరి : మరి దీనితోపాటు షుగర్ ఫ్రీగా ఇవ్వలేదేమిటి?

షాప్ వాడు : నేనేమైనా పిచ్చివాడినా! అయినా నీకు షుగర్ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి?

డింగరి : మీరే కదా! షుగర్ ఫ్రీ స్వీట్లు అని బోర్డు పెట్టారు!

**

ఆకాశపన్ను :

-----------

ఆకాశపతి : ఇదేమిటండీ ఆకాశ పన్ను కట్టమంటున్నారు? అసలు ఇది దేనికి?

అధికారి : మరి మీరు అడ్డూ అదుపూ లేకుఁడా ఆకాశ హార్మ్యాలు కట్టుకుంటున్నారు కదా? అందుకే.

***

ఓన్ బిజినెస్:

——————

అధికారి : అదేమిటయ్య! ఆఫీసులో సంతకం చేసి రోజూ బయటకెళ్లి పోతున్నావ్?

కొండప్ప: మొన్న మీరే కదా సార్! మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పారు!

***

మారు వడ్డన:

------------

బాలాజి : అదేమిటయ్యా స్వీట్లూ, హాట్లూ మారు వడ్డించకుండా ఒకసారి చూపెట్టి మరీ తీసుకెళ్ళి పోతున్నవ్!

గోవిందం : పంక్తిలో వారందరికీ స్వీటూ హాటూ మళ్ళీ ఒకసారి చూపించండి అని మా ఆవిడ

చెప్పిoది సార్!

***

నిఘంటువు ఫ్రీ:

--------------

అప్పన్న : ఒరేయ్! ఈ సినిమా టైటిలే అర్థమవటం లేదు. ఈ సినిమా చూద్దాం అంటామేమిటిరా?

చిన్నబాబు : టైటిలే కాదురా పాటలు, మాటలూ కూడా అర్థం కావట? అవి అర్థం చేసుకోటానికే ఒక నిఘంటువుని ఉచితంగా ఇస్తున్నారు. అది తీసుకొని హాయిగా ఏసీలో నిద్రపోదాం?

**

శిల్పం:

--------

ఎడిటర్ : ఇదేమిటయ్యా! ఈ కథ మధ్యలో శిల్పం బొమ్మ వేశావు ఎందుకు? ఇది కథకు సంబంధించినదా?

కొత్త కవి : కథలో శిల్పం తప్పనిసరిగా ఉండాలని మీరే చెప్పారు కదా సార్!

*

చీపురు:

----------

టీచర్ : ఒరేయ్ బాలాజీ! చీపురు కట్టయొక్క మూడు ఉపయోగములను తెల్పుము.

బాలాజీ : ఒకటి, మనము ఇల్లు ఊడ్చుకొనవచ్చును. రెండు, దోశల వేసే ముందు పొయ్యి మీద పెనాన్ని క్లీన్ చెయ్యవచ్చును, మూడు, అల్లరి చేస్తే కొట్టవచ్చును సార్.

*

అగ్రతాంబూలం:

--------------

పురోహితుడు : అదేమిటి నాయనా! టేబుల్ పైకెక్కి మరీ నాకు తాంబూలం ఇస్తున్నారెందుకు?

పండరి : పూజ చేయించినవారికీ అగ్రతాంబూలం ఇవ్వాలని మా గురువుగారు చెప్పారు స్వామి!

- కొండూరి కాశీ

First Published:  8 Feb 2023 8:46 AM GMT
Next Story