Telugu Global
Arts & Literature

పరిష్కారం (కథ)

పరిష్కారం (కథ)
X

అమ్మా!అమ్మా!అని ఒక్కటే అరుపులు ఆపకుండా అరుస్తూనేవున్నాడు...

ఇంతలో వాళ్ల నాన్న,"ఏమిటి? నువ్వువాడిని సమాధాన పరచవా"? అన్నాడు .

"కొంచం వుండండి,ఇక్కడ ఈ పని అరగొరగా వదిలేస్తే"......

"ఇంక చాలు తల్లీ! వాడి కేకలుతో

ఇరుగు పొరుగు పరుగెత్తుకొస్తారు. ముందు నీ ముద్దుల బిడ్డ మురిపాల అరుపుల గోల ఏమిటో

కనుక్కో అన్నారు" వాళ్ల నాన్నగారు

ఇంక తప్పని సరై పనివదలి పెట్టి పరుగెత్తినంత పని చేసింది విజయ.

"ఏమిటి నాన్నా !కొoచం కూడ

ఖాళీ లేకుండా ఆ అరపులు" అంది.

Advertisement

"అది కాదమ్మా! "నువ్వు నిన్న నా కోసం కొని పెట్టిన పుస్తకం కనిపించ లేదు,నేను దాచలేదు,మరి అది

ఎలా పోయింది అన్నాడు"?

నవ్వింది

"పుస్తకానికి కాళ్ళు వచ్చాయా?ఎవరైనా తీసిపెట్టవచ్చు కదా?

కొంచం ఓపిక తెచ్చుకుని చూస్తే కనిపిస్తుంది నాన్నారవీ! "

*

"ఎప్పుడూ వదలకుండా అమ్మ కూచిలా ఉంటాడు రవి .ఎప్పుడూ, వదల కుండా అంటుకుపోయే రవి నేడు ఎక్కడో,ఏమిచేస్తున్నాడో ఏమో? కోడలు పిల్ల ఏం చేస్తున్నదో ...?"

ఒంటరిగా కూర్చుని ఆలోచనలో... మునిగిపోయింది,విజయ.

Advertisement

అదే సమయంలో సుమన వచ్చిన విషయం కూడ పట్టించుకోకుండా పరధ్యానంలో ములిగిపోయింది.

"ఏయ్! ఏమిటా కన్నీరు "అని తట్టింది.

హడలిన విజ్జీ,"నాకా కన్నీరా? "అంది

'అవును చూడు 'అని చూపించింది సుమన అద్దం తీసి.

"క్షమించు" సుమనా !నాకు తెలియకుండా కన్నీరు

కారినట్టుంది క్షమించు "అంది.

"దేనికి కన్నీరు? "

"నా పుత్రుడు జ్ఞాపకం వచ్చాడు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటే..."

"ఆపు తల్లీ ఆపు"! పెద్ద నీకే పుత్రుడు !ఎవ్వరూ తల్లులు కాదు ప్రేమలూలేవూ అన్నట్టు చాలా విడ్డూరంగా ఉంది,నీ భావన..."

"లేదు లేదు నేను అలా అనలేదు క్షమించు "అంది విజ్జి.

"ఈ బాధ పడటం ఎందుకు? ఎవరైనా పుట్టడం సహజం, పెరగడం సహజం,అంచెల వారీగా మార్పు సహజం,అటువంటప్పుడు మంచి భవిష్యత్తు కోసం మీరే పంపారు కదా పరాయి దేశానికి .మరి ఇప్పుడు బాధపడి ఏమి లాభం విజ్జీ !ఆలోచించు" అంది సుమన.

"సరే !దానికి ఏమిటి విరుగుడు లేక సరైన మార్గం "అంది విజయ...

"చెప్పనా "అంది సుమన్.

"సరే చెప్పు "అంది

"చిన్నప్పుడు బడికి పంపావాలేదా? అప్పుడు రోజు అంతటిలో కొంత కాలం వాడు దూరమే కదా? "

'అవును 'అంది విజ్జి.

"తరువాత పదవ తరగతి తర్వాత కాలేజీ, ఆ తర్వాత పెద్ద చదువులు ఇవన్నీ జరగడానికి 18 సంవత్సరాలు పడుతుంది కదా?"అంది సుమన

"అబ్బా ఆపవే బాబు నీ సుత్తి .అసలు విషయానికి రా" అంది విజ్జి.

"ఇంతకాలం దూరంగా ఉన్నా మనవాడే కానీ, వాడి జీవితంలోకి ఒక స్త్రీ మూర్తి వస్తే మారిపోతాయి నీ ఆలోచనలు. ఇది కొత్త పాతల మధ్య సంఘర్షణ. కారణం ఇద్దరి

ఆంతర్యాలు కలవకపోవడం .ఇదే 'నా' ' నీ' ల భేదం,కొత్త -ఒక ప్రశ్నతో వస్తుంది .పాత -నా అనే భావంతో ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన ఆమె "ఈ ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళతో నా జీవితం అంతా గడపాలి, సంతోషంగా గడపాలి" అని భావించదు. ఆ భావమే ఉండదు అంచేత కొత్త కొత్తగానే ఉంటుంది. ప్రతి విషయం వింతగానే చూస్తుంది .తప్పులు వెతకడానికి కాలాన్ని వ్యర్థం చేస్తుంది కానీ, ప్రేమని సంపాదించడానికి ప్రయత్నించదు. తప్పులు కనిపించినంత వేగంగా ప్రేమ పుట్టదు, పెరగదు అప్పుడే పాత వ్యక్తి ఓర్పు నేర్పు స్నేహభావం కలిగి చాలా సున్నితంగా అపురూపంగా అవగాహన అయ్యే విధంగా తెలిపి నేర్పితే ,ఇద్దరి జీవితాలు ధన్యమే .కానీ,ఆ అవకాశం ఇవ్వకుండా కొంతమంది కొత్త కోడళ్ళు తప్పులు చూపెట్టి ,భర్తని అతని తల్లిదండ్రులని ఒకళ్ళకొకరిని దూరం చేస్తారు .ఇవి తెలివితేటలనుకుని సంతోషిస్తారు .కాదు .ఒక తల్లి హృదయానికి చిచ్చు పెట్టి భస్మీ పటలము చేస్తున్నామని అనుకోరు.ఆ తల్లి మంచిదైతే- నా బిడ్డసంసారం పిల్లలు బాగుండాలని మంచి కోరవచ్చు .ఆమె కూడా ఈ కోడలు లాగ అయితే వంశ నాశనమే కదా"

అంది సుమన

" మరి ఎలాగే "అంది విజయ?

" దీనికి నేను ఒక్కటే పరిష్కారం చెప్తాను నన్ను అర్థం చేసుకో వీజ్జీ " అందిసుమన.

"ప్రతి మనిషి జీవితంలో జీవించే కాలం చాలామితం .అంచేత ఉన్నన్నినాళ్లు వుండము కాబట్టి ఉన్నంతకాలం అందరికీ మంచి చేద్దాం ,అందరితో మంచినే పంచుకుందాం అనే భావన పెట్టుకోవాలి .రాని వాళ్ళ కోసం దుఃఖపడకూడదు.మనం పక్షుల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది గుడ్డులోంచి వచ్చిన పిల్ల ఎదుగుతుంటేతోడుంటే ,ఎదిగిన తర్వాత ఎగిరిపోతే, వెనక మిగిలిన రెండు పక్షులు వాటికోసం బాధపడక మళ్లీ వాటి పద్ధతిలో అవి జీవిస్తాయి .అలాగే మనం కూడా ఉండాలి . వాళ్ళ తప్పులు కాక మన ఉన్నత జీవితానికి సోయగాలు అలముకుని సంతోషంగా మిగిలిన వారితో బ్రతుకుదాం. మంచి పనులు చేయడానికి ఆలోచన ఎందుకు? అందుకే ప్రేమ పెంచు .మంచిని పంచు. మనుగడని సంతోషమయం చేసుకో,అని అంటాను,ఎలా ఉంది? బాగుందా?"అని ముగించింది సుమన.

- కె కె తాయారు

Next Story