Telugu Global
Arts & Literature

అప్పగింతలు (చిన్నకథ)

KB Krishna Telugu Kathalu Appagintalu
X

అప్పగింతలు (చిన్నకథ)

మామూలుగా ప్రతీ సంవత్సరం

లాగానే పిల్లలకుపరీక్షలు అయిపోయాయి.

వేసవి శెలవులు ఇచ్చేశారు.

మంచి ఎండలు కాస్తున్నాయి.

సుబ్బా రావు ఎలాగో ఆఫీసుకు

వెళ్ళి వస్తున్నాడు.

ప్రతి సంవత్సరం లాగానే

సుబ్బారావు భార్య తనపిల్లల్ని వెంటబెట్టుకుని తన పుట్టింటికి బయలుదేరింది

తనకు శెలవులు వుండవు కాబట్టి పాపం సుబ్బారావు

ప్రతీ సంవత్సరం వేసవి శెలవుల్లో వంట చేసుకుని తిప్పలు పడుతున్నాడు.

ఆ రోజు బస్టాండ్ కి భార్యా పిల్లల్ని బస్ ఎక్కించడానికి వచ్చేడు. బస్సు వచ్చింది. భార్యా పిల్లలు ఎక్కికూర్చున్నారు. కండక్టరూ,డ్రైవరూ ఇంకా రాలేదు.

"పెద్ద దానికి మామిడి పళ్ళు తింటే ఆరగదు.దానికి అవి ఇష్టంకదావని ఒకటే పెట్టమాక."

“రెండవ వాడికి హార్లిక్స్ లేకపోతే వుండలేడు . నీదగ్గర వున్న డబ్బులతో హార్లిక్స్ అయిపోగానే కొనే సెయి"

"చంటాడు ఎండలో తిరుగుతాడు జాగ్రత్త. వాడు ఏమాట వినడు. నన్ను కావాలంటాడు అస్తమాను

ఎలాగో బెంగ పెట్టుకోకుండా చూడు. ఒకవేళ బెంగ పె ట్టుకుని జ్వరం వస్తే ట్రంకాకాల్ చెయ్యి. వెంటనే

వచ్చేస్తాను.”

"నువ్వు నీరసంగా వున్నావ్. నేను కొనిచ్చిన మాత్రలు రోజూ శ్రద్దగా వేసుకో. మీ ఇంట్లో అందరితో సోది పెట్టుకుని కూర్చోకుండా రాత్రిళ్ళు పెందరాళే

నిద్రపో "

సుబ్బారావు తొంభై నిముషాలు టేప్ రికార్డర్ లాగాఒకటే వాగుతున్నాడు.

అతని మాటల్ని, తమ ఇద్దర్నీ బస్ లో అందరూ చూస్తున్న సంగతి సమకి విసుగుగా వుంది.

“సరేలెండి. మీరు జాగ్రత్తగా వండుకుని తినండి"అంది విసుగ్గా.

ఈలోగా బస్ కదిలింది.

భార్య పిల్లలు వెళ్ళి నాలుగు రోజులైంది. రోజూఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఆరోజు భార్య దగ్గర మండి ఉత్తరం వచ్చింది.

"శ్రీవారికి నమస్కారములు.

నేనూ పిల్లలూ క్షేమంగా చేరాము. మీరు క్షేమమనితలుస్తాను.మొన్న బస్టాండ్లో చెప్పడం మరిచిపోయాను.ఎదురింటి పిన్నిగారు వాళ్ళ దొడ్లో మామిడి కాయలు

ఇస్తే తరిగి ఉప్పులో వేశామ. వాటిని నాలుగు రోజులుఎండపెట్టి మాగాయి కలిపి పోపు పెట్టండి.చిన్నఆవకాయ ఒకసారి కలిపి ఎక్కువ తక్కువైతేసరి చెయ్యండి. ఇవన్నీ మడికట్టుకుని చెయ్యండి.రాత్రుళ్ళు దొడ్డితలుపులు జాగ్రత్తగా వెయ్యండి.బీరువా తాళం రోజూ రాత్రుళ్ళు వేసుకుని పడుకోండి.

అవసరమైతే కాని బీరువా తాళం తియ్యకండి.పాలు లెక్క రాయండి. లేకపోతే ఎక్కువ పోశానంటుంది పాలమ్మా యి.నేను వచ్చేలోగా అప్పులు చెయ్యకండి." ఇలావుంది ఆమె ఉత్తరం.

ఉత్తరం ఉండచుట్టి కిందపారేసి "ఛీ ఆడాళ్ళు" అనుకుని మళ్ళీ తను చేయాల్సిన పనులు గుర్తుకు వచ్చి ఆ ఉండ బల్లమీద పెట్టుకున్నాడు. పాపం సుబ్బారావు.

- కె.బి.కృష్ణ

First Published:  11 May 2023 6:45 AM GMT
Next Story