Telugu Global
Arts & Literature

వైధవ్యాల్లో వైవిధ్యం

వైధవ్యాల్లో వైవిధ్యం
X

ఆరోజు ఉదయం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఐదు గంటల సమయం అది. అప్పుడే నిద్రలేచిన వనిత దైవ ప్రార్థన చేసుకొని, అరచేతులు చూసుకుని, మంగళ సూత్రాలు కళ్ళకు అందుకని లేచి హాల్లోకి రాబోయింది అప్పుడే తన గదిలోంచి రాబోయిన బోడి మొహం అత్తగారు దర్శనమిచ్చారు.

వనితకు ఎక్కడలేని కోపము ముంచుకొచ్చింది.' ఏమిటి అత్తయ్య గారు ప్రొద్దుటే ఇలా ఎదురు పడకూడదు అని తెలియదా, ఈరోజు ఏమి దాపరించబోతుందో " అని కొనుక్కుంటూ వంటింట్లోకి దారితీసింది

అప్పటికే అత్తగారు పాలు కాచి డికాషన్ తీసి రెడీగా పెట్టారు. కొడుకు కోడలు లేవగానే కాఫీ కి ఇబ్బంది ఉండదు అని.

వనిత తయారయి ఆఫీసుకు వెళ్లబోతుంటే గడప కొ ట్టుకొని పడబోయీ ఆపుకుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని మంచినీళ్లు ఇమ్మని అడిగి " ఇవాళ ఉదయం లేవగానే మీ ముఖ దర్శనం అయింది కదా !మొదలయ్యాయి అశుభాలు. మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా " అంటూ అరచింది.

" రోజు నీవు లేచేటప్పటికి పొద్దు

పోతోoదని, ఆఫీసుకు లేట్ అవుతుందని ఏదో సహాయం చేద్దామని అలా వచ్చానమ్మా, క్షమించమ్మా " అంది దీనంగా అత్తగారు.

'ఇది రోజు జరిగే తతంగమే కదా 'అని వనిత విసుక్కుంటూ ఆఫీసు బయలుదేరి వెళ్ళింది.

"ఏమిటో కొడుకు చూస్తే వేరే ఊర్లో ఉద్యోగం, నా బ్రతుకు ఇలా అయింద"నిఅత్తగారు బాధపడ్డారు.

:::::::క

"అమ్మ శారదా! నిద్ర లేస్తావా! స్కూల్ కి వేళ అవుతోంది. " అంటూ సుజాతమ్మ గారు కూతురిని నిద్ర లేపారు. శారద నిద్రలేస్తూనే దైవధ్యానం చేసుకొని, అక్కడ ఉన్న అద్దంలో తన ముఖం చూచుకుంటుంటే గతం జ్ఞాపకం వచ్చింది.

తండ్రి లేని తనని తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. బి ఏ బి ఈ డి దాకా చదివించింది. సంపాదనపరురాలిని చేసింది. దగ్గర బంధువులలోని అబ్బాయికి చ్చి వివాహం కూడా చేసింది. కానీ తర్వాత దురదృష్టం కొద్ది పెళ్లయిన ఏడాదికే అలవి గాని జబ్బు చేసి మరణించాడు.

అత్తవారింట తనకు స్థానం దక్కలేదు. ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న తనని సమాజం " విధవ " అని నామకరణం చేసి అన్నిటికీ దూరంగా ఉంచారు.

ఆ మధ్య అమ్మతో కలిసి బంధువులు ఇంటికి పెళ్లికి పెడితే " ఏమే సుజాతా !నీకు పట్టిన గతే నీ కూతురు కు కూడా పట్టింది. తగు దునమ్మా !అంటూ అన్నిటికీ హాజరవుతారు. మీరు దేనికి పనికి వస్తారు. పసుపు కుంకాలు తీసుకోవడానికా, వాయనం అందుకోవడానికా " అంటూ పినత్త గారు సాగదీసింది.

దానికి శారదకు కోపం వచ్చి " బామ్మా !మాకు భర్త అయితే లేడు గాని మేము మనుషులమే కదా! రక్త మాంసాలు ఉన్నాయి. మీ జీన్స్ ఉన్నాయి, మీ డీఎన్ఏ కూడా ఉంది నాలో. బయట నుంచి వచ్చిన భర్త అనుబంధమే కదా పోయింది. ఈ లోకంలో ఎవడు శాశ్వతం కాదు బతకడానికి. ఒకరు ముందు ఒకరు వెనుక అంతే . పదమ్మ పోదాం! ఆడదే ఆడదాని కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతోంది " అంటూ బయటికి నడిచింది నేటి విద్యావతి అయిన విధవ శారద

::::::::::::

అమ్మా !ఒకసారి ఇలా వస్తారా! నాకు ఆఫీసుకు టైం అవుతోంది. జరిగిన దాని తలుచుకుంటూ ఎన్నాళ్ళు కూర్చుంటాం. కాలమే అన్ని గాయాలను మాన్పి స్తుంది. మనం ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన సంఘం గురించి పట్టించుకోవద్దు. అయినా నాకు తెలియక అడుగుతాను సంఘం అంటే మనలాంటి మనుషులు సమూహమే కదా. వాళ్లకి జీవితాల్లో మంచి చెడు అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్లు మనని ఇలా దిగజార్చుకూడదు. ఎదుటివారిలో ధైర్యాన్ని నింపి, దీనత్వాన్ని పోగొట్టాలి.

నేను చూడండి యాక్సిడెంట్ లో మీ అబ్బాయి తో పాటు, నా కాలు కూడా పోగొట్టుకున్నాను. కానీ నేను విద్యావంతురాలిని కనుక అధైర్య పడ కుండా ఆయన ఆఫీసులోనే ఉద్యోగం సంపాదించా. మిగిలిన కుడి చేతితోనే అన్ని పనులు చేసుకుంటున్నా.

కానీ నేను ఒంటరినని మా ఆఫీసులో చాలామంది నాపై కన్ను వేశారు. కానీ నేను నిరాకరించాను. కానీ మా ఆఫీసులో భార్యను పోగొట్టుకున్న వినయ్ అనే ఆయన నన్ను ఇష్టపడ్డారు. ఆయనను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆయనకు ఉన్న ఒక పాపని, నాకున్న బాబుని మేము ఇరువురం తల్లిదండ్రులమై పెంచాలి అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆయనకి కూడా తోడు అవసరం. నేను పాత కాలం నాటి విధవను కాను .వైవిధ్యం ఉన్న విధవను అని నిరూపించుకుంటాను " అంది నేటి ఆధునిక యువతి ప్రణీత ఎంతో వైవిధ్యంగా.

- కామేశ్వరి వాడ్రేవు

First Published:  1 Dec 2023 5:45 PM GMT
Next Story