రేచీకటి
BY Telugu Global25 Nov 2023 3:30 PM GMT
X
Telugu Global Updated On: 26 Nov 2023 7:24 PM GMT
వెలుతురుంటేనే
వీడికి వెలుగు
చీకటి అంటే వీడికి వణుకు
చెప్పుడు బాగానే చెప్తారు
చేసే దగ్గరనే
మతలబు దాగి ఉంది
ఆత్మ వంచన
పుట్టినరోజు జయంతులు
మళ్లీ మళ్లీ చనిపోతూ
మరణించిన రోజు వర్ధంతులు
సమాధి మీద పూల గుచ్చాలు
వంగి వంగి నంగి దండాలు
మహాత్ముడైనా ఒక్కటే
మహనీయుడైనా ఒక్కటే
సామాన్యుడి
త్యాగమైనా ఒక్కటే
అంతటా దొంగ కొంగజపం
ఓట్ల రాజకీయ
టెంపర్ వెంపర్లాట
షరా మామూలే
ప్రస్తుతానికి ఇంతే సంగతులు
చెవి వొగ్గి దేశం చిత్తగించవలెను
- జూకంటి జగన్నాథం
Next Story