Telugu Global
Arts & Literature

జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు

విభిన్న ప్రాంతాలకు చెందిన వారు, వివిధ పాయలకు చెందిన వారు తమ కవితలని పంపించారు. దాదాపు మూడు వందలకు పైగా వచ్చిన కవితలని విభిన్నదశల్లో చదివి, పరిశీలించాక పోటీ ఫలితాలని ప్రకటిస్తున్నాం.

Joshua Memorial Poetry Competition Results 2023
X

జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు 

‘‘కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు, కృతుడు జెందువాడు మృతుడు గాడు’’ అంటూ కవితాశక్తిని లోకానికి తెలియజెప్పిన కవీశ్వరుడు. అగ్రవర్ణ దాష్టీకాలనీ, పెత్తనాలనీ ప్రతిఘటించే కవిత్వాన్ని సృజించి అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని ఇనుమడిరపజేసిన విశ్వనరుడు జాషువాని స్మరించుకుంటూ విమల సాహితీ సమితి-పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన జాషువా స్మారక కవితల పోటీకి మంచి స్పందన వచ్చింది.

విభిన్న ప్రాంతాలకు చెందిన వారు, వివిధ పాయలకు చెందిన వారు తమ కవితలని పంపించారు. దాదాపు మూడు వందలకు పైగా వచ్చిన కవితలని విభిన్నదశల్లో చదివి, పరిశీలించాక పోటీ ఫలితాలని ప్రకటిస్తున్నాం.

వస్తువులో, అభివ్యక్తిలో వైవిధ్యం చూపిన కవితలు అనేకం వచ్చినందున ప్రత్యేక బహుమతుల సంఖ్యని పెంచితే బాగుంటుదని న్యాయనిర్ణేతలు సూచించారు. వారి సూచన మేరకు నిర్దేశించిన పరిధిని దాటి మరో పదిమందికి ప్రత్యేక బహుమతులు అందిస్తున్నామని విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్‌ జెల్ది విద్యాధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోటీకి కవితలు పంపించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

పోటీ ఫలితాల వివరాలు ఇవి:

మొదటి బహుమతి - సావు డప్పు - నెల్లుట్ల రమాదేవి

రెండో బహుమతి - విస్మరిద్దాం - విస్తరిద్దాం - పెనుమాక నాగేశ్వరరావు

మూడో బహుమతి - నది పిలుస్తున్నది - బెల్లి యాదయ్య

ప్రత్యేక బహుమతులు - 20

1. కుల రక్కసి - అరుణ సందడి

2. రూపాంతర కాలం - ఉదారి నారాయణ

3. సత్యవతిని...! - బి. కళాగోపాల్‌

4. మహా విస్మయంగా - గోపగాని రవీందర్‌

5. అద్వైతం - రమాదేవి కులకర్ణి

6. మెలకువ గీతం - చిత్తలూరి సత్యనారాయణ

7. మేం ఉన్మాదులం - స్వయంప్రభ

8. ఆ ఆకాశం మాది- చొక్కర తాతారావు

9. తిమిరంపై సమరం - నల్లా భాగ్యలక్ష్మి

10. బోదె - దాసరి మోహన్‌

11. గబ్బిలాలు - డా. జడా సుబ్బారావు

12. చమురులోయ - రమేశ్‌ నల్లగొండ

13. నా దేశం - సుజాత పోచం

14. గొంగళి - అమ్జద్‌

15. పంచ భూతాత్మకం - యారీదా రాధాకృష్ణారావు

16. చినుకు చిరుస్పర్శ- మంజుల సూర్య

17. కవన ఖడ్గ ధీశాలి - డా. కె. దివాకరాచారి

18. అస్తిత్వం - గాదిరాజు రంగరాజు

19. పొద్దున - తుమ్మల దేవరావ్‌

20. పాడు కాలం - బొల్లారపు బాబన్న

బహుమతి ప్రదానోత్సవ కార్య్రకమం హైదరాబాద్‌లో త్వరలో జరుగుతుందని విద్యాధర్‌రావు పేర్కొన్నారు.

First Published:  12 Jan 2023 4:19 PM GMT
Next Story