Telugu Global
Arts & Literature

చక్ర భ్రమణం (కథ)

చక్ర భ్రమణం (కథ)
X

గ్రూప్ డి స్టాఫ్ గా రైల్వేలో ఉద్యోగ జీవితం ప్రారంభించాను. డిగ్రీ వరకు చదువుకున్నాను. నిజమే...అయితే క్లాస్ త్రి పోస్ట్ డైరెక్టుగా దొరకాలని లేదు కదా. ఓ ఎనిమిది సంవత్సరాల తర్వాత లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో డిగ్రీ విద్యార్హతతో గూడ్స్ గార్డు గా ఎంపికయ్యాను. కష్టమే. ఉద్యోగంలో శారీరక శ్రమ ఎక్కువే. ఫలితం కూడా బాగానే ఉంటుంది. చేతికి ఓ ముప్ఫయి వేలుఅందుతాయి.

అన్నగా చెల్లి పెళ్ళి మొన్ననే అతి కష్టం మీద చేసాను ... మా అమ్మా నాన్నా నా పెళ్ళి హడావుడిగా చేసేసి తృప్తిగా ఒకరి తర్వాత ఒకరు కళ్ళు మూసారు. చెల్లెలు పెళ్ళయిన తర్వాత నేను పెళ్ళి చేసుకుంటానంటే... ఒప్పుకుంటేనా?... నాకొక పాప. బాధ్యతని మరువలేదు. చెల్లి పెళ్ళి చేసాను. అప్పులు చేసాను. నెమ్మదిగా తీరుస్తున్నాను.

చెల్లి పెళ్ళి సమయంలో నా సహోద్యోగుల సహకారం అద్భుతం. ఎవరి దగ్గర ఎంత మిగులు సొమ్ము ఉంటే అంత చేబదులుగా ఇచ్చి నేను డబ్బు విషయమై దిగులు పడకుండా చేసారు. నెలకు ముప్ఫయ్ వేలు చేతికందిన సహోద్యోగులు ప్రతి ఒక్కరూ స్కూటర్లు కొనుక్కున్నారు.కొంతమంది మరో అడుగు ముందుకు వేసి వాయిదాల పద్ధతిలో కొన్న కార్లు డ్రైవ్ చేస్తున్నారు...

నేను నా సైకిలుని మరచిపోలేదు. వదులుకోలేదు. ఏ కథా కార్యక్రమానికైనా మేము ముగ్గురం సైకిల్ సవారీనే నమ్ముకున్నాం. స్కూటర్ కొనుక్కోమని మిత్రులు అరచి గోలపెడుతున్నా , తీర్చాల్సిన చేబదుళ్ళ అప్పు తప్పటడుగు వేయ వద్దని హెచ్చరిస్తోంది. అంతరాత్మ అప్రమత్త సందేశాన్ని వింటూ నిగ్రహంతో అడుగులు వేస్తున్నాను. అన్నట్టు కష్టాలు కలకాలం ఉండవు కదా?

- గుండాన జోగారావు

First Published:  11 Nov 2023 7:50 AM GMT
Next Story