Telugu Global
Arts & Literature

డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాలు

జూన్‌ 6వ తేదీన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగే సభలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.

డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాలు
X

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి - పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట` వాసా ఫౌండేషన్‌ సంయుక్తంగా కవితల పోటీ నిర్వహించాయి. డా. వాసా ప్రభావతిగారిని స్మరించుకుంటూ జరిపిన ఈ పోటీకి తమ కవితలు పంపించిన కవులకు ధన్యవాదాలు. ఈ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా ప్రముఖ విమర్శకులు ఎం. నారాయణశర్మ వ్యవహరించారు. పోటీకి వచ్చిన కవితలని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కవితల పోటీ ఫలితాల వివరాలు ఇక్కడ ఇస్తున్నాము. జూన్‌ 6వ తేదీన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగే సభలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.

మొదటి బహుమతి: శోకం లేని లోకం - నెల్లుట్ల రమాదేవి

రెండో బహుమతి: రేపటి సూర్యోదయం కోసం - పల్లా రోహిణీకుమార్‌

మూడో బహుమతి: అమృతోత్సవాల ప్రగతి స్ఫూర్తి - రాజా మానాపురం చంద్రశేఖర్‌

ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు

1. అభినవ భారతి - కరిపె రాజ్‌కుమార్‌

2. సత్యమేవ జయతే - స్వప్న మేకల

3. వెలుగులు నింపుదాం- అల్లాడి శ్రీనివాస్‌

4. వజ్రోత్సవ కానుక - దాసరి మోహన్‌

5. నా గుండె కాల్చుకుతినే గుడ్డె - వేల్పుల రాజు

6. పొడిచే పొద్దు - బొప్పెన వెంకటేష్‌

7. స్వేచ్ఛ లేని ప్రాణం మట్టిపటం - శ్రీకాంత్‌ బింగి

8. మట్టి తిలకం - బి. కళాగోపాల్‌

పోటీలో ఎంపికయిన ఈ కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తాం.

- గుడిపాటి, ఎడిటర్‌, పాలపిట్ట

First Published:  21 May 2023 5:05 AM GMT
Next Story