Telugu Global
Arts & Literature

లెఫ్టే .. రైట్ ?

లెఫ్టే .. రైట్ ?
X

మనిషికొక్క గ్రూపు ,

గ్రూపునిండా

పెద్ద గుంపు

అడగ కుండానే

అందులో

అందరికీ ...

చోటు వచ్చేస్తుంది !

గుర్తు తెలియని వ్యక్తి

గ్రూపులో చేరిస్తే ...

వళ్లు మండిపోయి

వెంటనే వాకౌట్ (లెఫ్ట్ )

గ్రూపు నిర్మాత ..

ఎరిగున్నవాడయితే

మొహమాటానికొక

థాంక్ యు సర్ ..

మెసేజ్ ....పంపుడు !

ఈ డజన్ల కొద్దీ

జమ అయిన గ్రూపులు

పంపించే ..చెత్త

టన్నులకొద్దీ చేరి

అసలు మెసేజిలకి గండి !

మొహమాటం గ్రూపులతో

మొహం మొత్తి ...

మొబైల్ నే ...

నేలకేసి కొట్టాలన్నంత కోపం

ఆపని చేయలేక ..

మనల్ని మనం

కాసేపు తిట్టుకుని

చేసేది లేక ......

'లెఫ్ట్ 'మార్గాన్నే

ఎంచుకోడం

మంచి మార్గం ( రైట్ )

అనిపిస్తుంటుంది !!

డా.కె.ఎల్.వి.ప్రసాద్.

(హన్మకొండ )

First Published:  11 March 2023 11:26 AM GMT
Next Story