Telugu Global
Arts & Literature

డాక్ వాలా.తూ ..కహా..హో..!

డాక్ వాలా.తూ ..కహా..హో..!
X

సైకిల్ ..గంట..గణ..గణ...

పోస్ట్!.

సైకిల్..ఆగిన..చప్పుడు..

ఆ పిలుపు కోసమే.

తలుపు దగ్గరే వేచి..చూస్తున్న..

అతను,ఆమె/ ఆయన/ఆవిడ ./ఎవరైనా

దఢాలున

తలుపు..తెరిచి..ఆతృత

ఆనందం ..ఆశ నిరాశ అనుభూతి ఏదైనా..

నవ్వుతూన్న పోస్ట్ మాన్..

గుమ్మం ముందు..కనబడగానే..

ఓ ఆత్మీయత..

చటుక్కున

ఉత్తరాల కట్టకు కట్టిన బొందు.విప్పి ...

ఒక్కొక్కటి..తాపీ..గా..ఏరి... వారి..వారి ఉత్తరాలు..వారి..వారికి అందించే..

పోస్ట్ మాన్ కనబడగానే...

వారి..వారి..కి తమ.. బిడ్డ లా..

తండ్రి లా..తల్లి లా..

అన్నలా తియ్యని.కబురందించే .

ఓఆపద్భంధువులా .కనబడతావు

నేడు...

సెల్ లో..కబుర్లు..

వీడియోలలో..

పలకరింపులు ..

నెట్ లో పెళ్లి..పిలుపులు..

పేటియమ్ లో

.మనీ ట్రాన్స్ఫర్ లు.

నీ రాక...నీ పిలుపు..నేడు..లేదు..మిత్రమా!

నాడు...

నెల..మొదట్లో.

మనీఆర్డర్..లు పంపిణీ....

అందరి కళ్లలో...సంతోషం వెలుగులను పంచే ..పోస్ట్ మాన్ నిత్య స్నేహితుడు...

నేడు..అప్పుడప్పు డూ..

ప్రభుత్వఫర్మానాలు..

చేరవలసిన.చోటికి

చేర వేసే...ఓ..ఉద్యోగి..మాత్రమే.

నీతో ఆనాటి..అనుబంధం. ఓ..మధురానుభూతి...

మిత్రమా !

-పి.బాలా త్రిపుర సుందరి

First Published:  13 Nov 2022 4:19 PM GMT
Next Story