Telugu Global
Arts & Literature

కాఫీ( గజల్) - కొరుప్రోలు మాధవరావు

కాఫీ( గజల్) - కొరుప్రోలు మాధవరావు
X

ఎలానీకు త్రాగించను..

జ్ఞాపకాల కాఫీని..!

ఒక్కతినే త్రాగుటెలా..

వియోగాల కాఫీని..!

వస్తానని రాకుండా..

వే ధించుట భావ్యమా..

సేవించే భాగ్యమెపుడు..

కులాసాల కాఫీని..!

చిరునామా ఇవ్వలేదు..

కబురుఎలా పంపడం..

ప్రేమిస్తే పంచాలోయ్..

ప్రమోదాల కాఫీని..!

మనసుకష్ట మెంతంటే..

మాటలకేం తెలుసులే..

చూపులతో ఇవ్వాలోయ్..

సరాగాల కాఫీని..!

నీతోనే బ్రతుకంటివి..

గుండెసడిగ మారితివి..

వమ్ముచేసి ఒంపేయకు..

నమ్మకాల కాఫీని..!

చిత్తరువై తనువున్నది..

వీధితలుపు కానుకుని..

అందుకోర చెలిమిమీర..

సుగంధాల కాఫీని..!

రాలుమంచు పూలనడుమ..

బంధమేదొ మాధవా..

మరువలేను నీ నవ్వుల..

తరంగాల కాఫీని..!

First Published:  30 Oct 2022 9:09 AM GMT
Next Story