ఎక్కడుంది వెలుగు ? (కవిత)
BY Telugu Global1 Dec 2023 5:30 PM GMT
X
Telugu Global Updated On: 1 Dec 2023 5:30 PM GMT
నేటికాలమనూహ్య
పరిణామములు తెచ్చి
మనిషి జీవితగతినిమార్చివైచె
ఉరుకుపరుగుల
బ్రతుకుయానమందున
మనిషితీరికలేక
తిప్పలొందుచుండ
పండుగపబ్బముగడుప
ఉత్సాహమేది?
ఇంటవేడుక,
సంబరాలుమురిపాలేవి?
మొక్కుబడిగపండుగ
వచ్చిపోవుటతప్ప!
ఇంటినిండుగ
కుటుంబనవ్వులేవి?
నాడుపండుగొచ్చిందంటే
సందడే! కొత్తబట్టలుతళతళ,
తీపిమిఠాయీలు,
తీరైనవంటలు,
పిల్లలహడావుడి,
మరినేడో
అవేవీ ఎక్కడాకనరావు,
వినరావు!
పిల్లలెదిగి, ఉన్నంతవిద్యలంది,
విదేశాల స్థిర పడిరి
తల్లి తండ్రుల వీడి!
ఒంటరిగ మిగిలి
బిక్కుబిక్కుమనుచు
గతకాల స్మృతులతో
బ్రతుకునీడ్చు
వృద్ధ తల్లి దండ్రులకేది'పండుగ'?ఎండమావితప్ప!
చింతలచెరువుమోహనరావు
Next Story