Telugu Global
Arts & Literature

చిందేసిన చిరుజల్లు (కథానిక)

చిందేసిన చిరుజల్లు (కథానిక)
X

చిందేసిన చిరుజల్లు (కథానిక)

వారాంతంలో రెండ్రోజుల సెలవులు దొరికినందుకు కుటుంబాన్ని కలుద్దామని పూణే నుంచి హైదరాబాద్ వచ్చిన నేను, తిరుగు ప్రయాణంలో నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద రాత్రి 20:40 గంటలకు ఎక్కాల్సిన ముంబై ఎక్స్ ప్రెస్ (17032) ని మిస్సయ్యాను.


ఏమీ చేయాలో అర్థంకాక నాంపల్లి రైల్వే స్టేషన్ నాల్గవ నంబర్ ప్లాటుఫారం మీద తలపట్టుకుని కూర్చొన్న నాకు ఓ ఆలోచన తట్టింది. ముంబై ఎక్స్ ప్రెస్ నాంపల్లి తర్వాత బేగంపేట, లింగంపల్లిలో ఆగుతుంది. అంటే బస్సులో నాంపల్లి నుండి బయలుదేరి ముంబై ఎక్స్ ప్రెస్ కంటే ముందే బేగంపేట గానీ, లింగంపల్లి గానీ చేరుకుంటే మళ్ళీ యధావిధిగా ముంబై ఎక్ష్ప్రెస్స్ లోనే ప్రయాణం సాగుతుందని ఆశపడ్డాను. అందుకోసం స్టేషన్ నుండి బయటపడ్డానో లేనో వర్షం మొదలయ్యింది. అసలే ట్రైన్ వెళ్ళిపోయి చిరాకులో నేనుంటే వర్షం చిటపట చినుకులతో చిందేయ్యసాగింది.

కోపంగా 'ఈ వర్షానికి బుద్ధి లేదు, వేళాపాళా లేకుండా కురుస్తోంది. వెళ్లి పల్లెటూరిలో కురవొచ్చుగా. హైదరాబాదులో కాలుష్యం తక్కువగా ఉందని, ఇక్కడే కురుస్తోంది' అని లోలోపల తిట్టుకున్నానో లేదో వర్షం రెట్టింపయ్యింది.


నేను తిట్టినందుకు కాబోలు వర్షానికి కూడా కోపం వచ్చింది. రోడ్డు మీదికి పరిగెత్తేసరికి ఇంచుమించు పూర్తిగా తడిసిపోయాను. అంతలోనే పటానుచెరుకి వెళ్తున్న బస్సు కనబడేసరికి పరుగున వెళ్లి బస్సెక్కుతుండగా, బస్సు పైకప్పు నీళ్లన్నీ నామీదే పడ్డాయి. 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ మాదిరి నాకు వర్షమిచ్చిన చివరి బహుమతికి నిలువెల్లా తడిసిపోయాను. ఆ పరిణామానికి నాకు ఏడుపొచ్చింది. వర్షాన్ని తిట్టినందుకు నా మీద ప్రతీకారం తీర్చుకొందది. బస్సులో చాలా సీట్లు ఖాళీగున్నా నేను మాత్రం ఆ తడి బట్టలతో కూర్చోలేక

పోతున్నాను. కండక్టర్ టికెట్ ఇస్తూ, "ఎందుకు నిల్చొన్నావ్! కూర్చో బాబు" అని చెప్పాడు. ఆ మాటకి బస్సు కండక్టర్ని తిట్టాలన్నంత కోపమొచ్చింది. అయినా నాకు నేనే కోపాన్ని అదుపు చేసుకుని, "నిలువెల్లా తడిసిపోయున్నాను, పైనుండి కింది వరకు నీళ్లు కారుతున్నాయి. ఎలా కూర్చోమంటారు?" అని చిరాగ్గా అన్నాను.

"నీ ఇష్టం" అని వెళ్ళిపోయి డ్రైవరుతో ముచ్చట్లు పెట్టాడతను .బస్సు కండక్టర్ నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయేసరికి - 'నీ చావు నీవు చావు' అన్నట్లుగా అనిపించింది.

లోపల్నుండి తన్నుకొస్తున్న ఉక్రోషానికి ఉడుకుమోత్తనం ఆపుకోలేకా ఎవరిమీదనో కోపం చూపించాలనుకున్నాను. నాతో ఉచితంగా తిట్టించుకోడానికి అప్పుడు ఎవరొస్తారు, కేవలం ఒక్క భార్య తప్ప. అంతలోనే ఫోన్ మోగింది. అతీకష్టమ్మీద తడిసిన ప్యాంటు జేబులోంచి తీసి చూశాను. ఇంకెవరు నా భార్య మాలతి నుంచే ఆ ఫోన్ కాల్. నా కోపమంతా తనపై చూపించాను.

"ఈ రోజు నీ వల్లనే ట్రైన్ మిస్సయ్యింది. నేను వెళ్లేముందు పళ్లెంలో అన్నం పెట్టుకొచ్చి తినండి, తినండి, ఇంకొంచమే అని కొసరి కొసరి వడ్డించి నా గొంతుకోశావు. ఈ సృష్టిలో నీవొక్కతివే భార్య అయినట్లు లేని పోని ప్రేమనంతా ఈ రోజే ఒలకబోశావు కదే. నీవు ఈ ఒక్కదాంట్లోనే కాదు, ప్రతీదాంట్లో నన్ను నాశనం చేశావు. నీవు చేసే ఏ పనైనా ఇలాగే ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పాపం" అని తనని ఎన్ని మాటలన్నా కూడా మాలతి మౌనంగానే వింటూ ఉండిపోయింది.

ఆమె తిరిగి నన్ను తిడ్తే నాకు ఇంకా తిట్టే అవకాశం వచ్చేది. కానీ, ఆమె మరోమాట లేకుండా మౌనంగా ఉండేసరికి నాకే మనసు చివుక్కుమంది. తనకి చెప్పకుండానే, తను చెప్పేది వినకుండానే తన చెంప చెళ్ళున వాయించినట్టుగా విసురుగా ఫోన్ పెట్టేశాను.

నా భార్యని తిట్టాక మనసు కాస్త కుదుటపడింది. బస్సు కిటికీలోంచి బయటకి తొంగి చూశాను. ఒక్క చినుకు కూడా రాలటం లేదు. దొంగవాన నా మీద పగ సాధించడానికే వచ్చిందనిపించింది. అప్పటికే బస్సు కూకట్ పల్లి దాటింది. మరో అర్ధగంటలో లింగంపల్లి చేరుకోగల్గితేనే ముంబై ఎక్స్ ప్రెస్ ని అందుకోగలను.

బస్సు మంచి వేగమందుకుని రయ్యిమంటూ పరుగులు తీస్తోంది. ఆ వేగాన్ని చూసి బస్సు డ్రైవర్ని లోలోన మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఏంటో దైవమొకటి తలిస్తే, నేనొకటి తలచినట్టు నాకు తిరుగు ప్రయాణం తికమకపెట్టేసింది. ఈసారి పెద్దశబ్దంతో బస్సు రోడ్డు పక్కనెళ్ళి ఆగింది. అందరూ ఆశర్యంగా కిందికి దిగుతున్నారు. నేను కూడా అనాలోచితంగా కిందికి దిగేశాను. ఇంకేముంది అందరూ ఊహించిందే, బస్సు ముందు చక్రం పంక్చరయ్యింది. సరాసరిగా మియాపూర్ బస్సు స్టాప్ పక్కనే ఆగింది.

ఎవరిని తిడ్తే మళ్ళీ ఏం జరుగుతుందోనని ఈసారి ఇంకెవరిని తిట్టే ప్రయత్నం చేయలేదు. తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా మౌనంగా వెళ్లి బస్సు స్టాపులో కూర్చొండిపోయాను. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదిన్నర కాసాగింది. ముంబై ఎక్స్ ప్రెస్ ని అందుకోవడం ఇకా నా తరం కాదని, చివరి ప్రయత్నంగా ఏదైనా పూణే వెళ్లే బస్సు వస్తే వెళ్ళిపోదామనుకుని అక్కడే ఆశావహ దృక్పథంతో మళ్లీ చిందెయ్యడానికొచ్చిన చినుకుల మధ్య చిరాకుతో నిలబడిపోయాను.


ఏమిటో ఈ అర్థం కాని వింత. నాతో పాటు బస్సు దిగిన వాళ్లంతా ఏదో రకంగా వెళ్లిపోయారు. చివరికి బస్సు కూడా వెళ్ళిపోయింది, కానీ నేను మాత్రం అక్కడే ఒంటరిగా తుంటరి వర్షంలో తడుస్తూ మిగిలిపోయాను.

నేను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఓటమి నన్ను మింగేస్తున్నప్పుడు, మిణుకు మిణుకుమనే నింగిలోని తారలకు సహితం భయపడిపోతున్నపుడు, శరీరంలో సత్తువ లేకా నిలబడలేకా కూలబడిపోతున్నప్పుడు, జీవితం మీద ఆశల్లేక కుళ్ళి కృశిoచి, చిక్కి శల్యమై పోతున్నప్పుడు, పాతాళపు లోతుల్లోకి నన్నెవరో తోసేసినపుడు నేనున్నానని నాకు తోడు వొచ్చేది కేవలం నా భార్య మాత్రమే.


ఎందుకో నా భార్య మాలతికి ఫోన్ చేసి క్షమించమని అడుగుదామంటే నాకు అహం అడ్డొచ్చి ఊరుకుండిపోయాను. అంతలోనే ఓ నాన్ ఏసీ బస్సొకటి నా ముందు నుండి వెళ్తుంటే బస్ స్టాప్ లోనుండి బయటికి పరుగెత్తి చెయ్యెత్తాను. అంతలోనే దాని వెనకాలే ఓ ఏసీ బస్సు రావడం గమనించి నాన్ ఏసీ బస్సుని వెళ్లమన్నట్లుగా సైగ చేశాను.

ఆ ఏసీ బస్సు నన్నెంతగానో ఆకర్షించింది. అసలే పూణే వెళ్ళడానికి ట్రైన్ మిస్సయ్యిందన్న బాధని మరిచి, నేరుగా పూణే వెళ్తున్న బస్సుని విడిచి ఉద్యోగం చేస్తున్నానన్న అహంతో విలాసం కోరుతూ ఏసీ బస్సుని ఆపాను. ఆ బస్సు ఆగినట్టే ఆగి, 'ఖాళీ సీట్లు లేవు' అని కేకేస్తూ ముందు కెళ్ళిపోయింది. మరుసటి రోజు బిర్యానీ దొరకబోతుందన్న ఊహాలో నేటి పప్పన్నాన్ని పారబోసుకునే నాలాంటి పండితుడికి దండేసి దండం పెట్టాలేమో. మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది.


ట్రక్కు జహీరాబాద్ దాటేసి సోలాపూర్ మధ్యలో గతుకుల హైవే మీద పరుగులు తీస్తోంది. ఆ కుదుపులకి నిద్ర పట్టడంలేదు. సుమతిని అలా వదిలేసి వచ్చినందుకు మనసంతా అదోలా ఉండిపోయింది. నేను నాన్ ఏసీ బస్సుని ఎక్కకుండా చేసిన తప్పు, సుమతి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వదిలేయడం రెండూ ఒకేరకమైన, సమానమైన తప్పులా?. సుమతికి అర్థమైతే మారిపోయి నాలాగా ట్రక్కు లాంటి మనిషితో ప్రయాణం మొదలు పెడ్తుందేమో.

ఇంతకీ సుమతి ఆ రాత్రి రోడ్డు మీద వదిలేయగా గుండె పగిలిన ప్రేమికుడు ఎవరనుకుంటున్నారు, నేనేనండి. నన్ను సుమతి గుర్తుపట్టిందో లేదో తెలియదు .ఒకవేళ గుర్తుపట్టి కూడా నాతో పాత జ్ఞాపకాల గురించి మాట్లాడే ధైర్యం చేయనప్పుడు, నేను గుర్తు చేయడం ఎందుకని మౌనంగుండిపోయాను. ఒకవేళ గుర్తుచేసి ఉంటే, నేను దెప్పిపొడుస్తున్నానని తనకి జరిగిన ఘోరాన్ని తలచుకుని లోలోపల తెగ సంబరపడిపోతున్నానని నా మీద అపవాదు వేసేది. ఎంతలా కాదనుకున్నా, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కదా, తెలిసి ఎలా బాధపెట్టగలను. నేను మౌనంగా, అపరిచితుడిలా ఉండటమే తనకి విధించిన అతిపెద్ద శిక్ష. ఆ ట్రక్కులోనే నిద్రతో కళ్లు మూతలు పడ్తుండే సరికి "ఐ యామ్ సో సారీ!" అని నా భార్యకి మెస్సేజ్ పెట్టి కళ్లు మూసుకున్నాను.

- రాజేష్ ఖన్నా

Next Story